హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య 2017 జనవరి 14న విడుదలైన తెలుగు చిత్రం.
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య | |
---|---|
దస్త్రం:HeadConstableVenkatramaiah.jpg హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ప్రచారచిత్రం | |
దర్శకత్వం | చదలవాడ శ్రీనివాసరావు |
రచన | చదలవాడ శ్రీనివాసరావు (సంభాషణలు) |
స్క్రీన్‌ప్లే | చదలవాడ శ్రీనివాసరావు |
కథ | చదలవాడ శ్రీనివాసరావు |
నిర్మాత | చదలవాడ పద్మావతి |
నటవర్గం | ఆర్.నారాయణమూర్తి జయసుధ |
ఛాయాగ్రహణం | కె.సుధాకర్ రెడ్డి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
విడుదల తేదీలు | 2017 జనవరి 14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
నీతి, నిజాయితీతో పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఆర్. నారాయణమూర్తి). ఏ విషయంలోనూ రాజీ పడడు. ఎవరి దగ్గరా లంచాలు తీసుకోడు. ఆ తత్వం చుట్టూ ఉన్నవాళ్లకి నచ్చకపోయినా తాను మాత్రం నమ్మిన దారిలోనే బతకాలనుకొంటాడు. దాంతో తన సహచర ఉద్యోగులు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. భార్య పద్మ (జయసుధ) కూడా డబ్బుపై ఆశతో లంచాల్ని తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంటుంది. అయినా సరే తన తీరు మార్చుకోని వెంకట్రామయ్య ఊహించని రీతిలో ఓ అవినీతి కేసులో ఇరుక్కుంటాడు. దాంతో భార్య పద్మ (జయసుధ) అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అసలు నీతిగా బతికే వెంకట్రామయ్యకి అవినీతి మకిలి ఎలా అంటింది? అందుకు కారకులు ఎవరు? తననుంచి దూరమైన భార్య మళ్లీ దగ్గరైందా లేదా? మానవీయ విలువల్ని సైతం శాసిస్తూ సమాజంలోని అవినీతి, అక్రమాలకి కారణమవుతున్న నల్లధనంపై ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ ఎలా పోరాటం చేశాడు? అనేవి కథలో భాగం.[1]
తారాగణంసవరించు
- ఆర్.నారాయణమూర్తి
- జయసుధ
- సునీల్ శర్మ
- జయప్రకాశ్ రెడ్డి
- చలపతిరావు
- వెన్నెల కిశోర్
- తనికెళ్ళ భరణి
- వై. విజయ
- సమీర్
- విజయ భాస్కర్
- విజయ్
- పార్వతి
సాంకేతికవర్గంసవరించు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: కె.సుధాకర్ రెడ్డి
- కూర్పు: మోహన రామారావు
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
- పోరాటాలు: సతీష్ మాస్టర్
- సమర్పణ: చదలవాడ తిరుపతిరావు
- నిర్మాత: చదలవాడ పద్మావతి
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.