జయసుధ

సినీ నటి, రాజకీయ నాయకురాలు

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి.[1]

జయసుధ
జననంసుజాత
డిసెంబర్ 17, 1959
మద్రాసు
ఇతర పేర్లుజయసుధ
ప్రసిద్ధితెలుగు సినిమా నటి.
పదవి పేరుసికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ
పదవీ కాలం2009 నుండి
రాజకీయ పార్టీకాంగ్రెస్
భార్య / భర్తనితిన్ కపూర్
పిల్లలుఇద్దరు కొడుకులు

జయసుధ 1985లో హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986లో మొదటి కొడుకు నిహార్, 1990లో శ్రేయంత్ పుట్టారు. జయసుధ 2001లో బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు.

రాజకీయ జీవితం

మార్చు

జయసుధ 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్మెల్యేగా గెలిచారు.[2] ఆ తరువాత టిడిపిలోకి చేరి, 2018 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2023 ఆగస్టు3న బీజేపీ పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[3]

పురస్కారాలు

మార్చు
ఫిల్మ్ ఫేర్ (దక్షిణ భారత)
నంది పురస్కారాలు
ఇతర పురస్కారాలు

జయసుధ నటించిన తెలుగు చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
  2. వి.ఎస్. కేశవరావు బ్లాగ్, మన తెలంగాణ (హరివిల్లు)-22.05.2016 (1 August 2017). "అభినయ సూచి జయసుధ". Vskesavarao's Blog. Retrieved 19 July 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (3 August 2023). "బీజేపీలోకి జయసుధ". Archived from the original on 3 August 2023. Retrieved 3 August 2023.
  4. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  5. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జయసుధ&oldid=4178777" నుండి వెలికితీశారు