గ్రీకు పురాణం ప్రకారం హెరాకిల్స్ (లేదా హెర్క్యులెస్) సాహసాల్లో సాటిలేని వీరుడు. ఇతడు హెరాకిల్స్ దేవలోకానికి అధిపతి అయిన జూస్ కు, మానవ స్త్రీ అయిన అల్కమెనెకు జన్మించాడు. ఇతడు పన్నెండు అత్యంత కష్టతరమైన సాహసాలను ఛేదించిన ధీరుడు. గ్రీకు పురాణాల్లో హెరాకిల్స్ సాహసకృత్యాలు అతి ముఖ్యమైనవి.

హెర్కులెస్, హైడ్రా (1475 నాటి బొమ్మ చిత్రకారుడు ఆంటోనియోడెల్ పొల్లొవులో: కథానాయకుడు సింహం చర్మం ధరించి గదను వాడడం చూపబడింది

కథ మార్చు

హెరాకిల్స్ ను సవతి తల్లి అయిన హెరా ద్వేషిస్తుంది. హెరికిల్స్ ను చంపడానికి రెండు సర్పాలను పంపగా వాటిని తన బలంతో చంపేస్తాడు. ఆ విధంగా చిన్ననాటినుండి అత్యంత బలవంతుడిగా పెరుగుతాడు హెరాకిల్స్. యుక్త వయసులో మెగారా అనే యువతిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు హెరాకిల్స్. ఇది సహించలేక హెరా తన మాయతో హెరాకిల్స్ కు కోపం వచ్చేలా చేస్తుంది. ఆ కోపంలో హెరాకిల్స్ విచక్షణ కోల్పోయి తన భార్యా బిడ్డలను కిరాతకంగా చంపేస్తాడు.చేసిన పాపానికి పశ్చాత్తాపంతో హెరాకిల్స్ 'డెల్ఫీ' అనే గ్రామానికి వెళ్ళి అక్కడ 'అపోలో' అనే దైవాన్ని కలుస్తాడు. ఆర్గాస్ సామ్రాజ్యపు రాజైన యురిస్తియోస్ చెప్పినట్లుగా పన్నెండు సాహస కృత్యాలను చేస్తే చేసిన పాపాన్ని దేవుళ్ళు క్షమిస్తారని అపోలో చెబుతాడు. హెరాకిల్స్ ను ముందుగా 10 సాహసాలు చేయమంటాడు యురిస్తియోస్.

సాహసకృత్యాలు మార్చు

మొదటి సాహసం మార్చు

హెరాకిల్స్ ను నెమియా వెళ్ళి అక్కడ ఉన్న రాక్షస సింహాన్ని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. చెప్పినట్టుగా హెరాకిల్స్ నెమియా వెళ్ళి అక్కడున్న రాక్షస సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ సింహాన్ని కత్తి, బాణము, గదతో ఎదుర్కోలేకపోతాడు. చివరికి చేసేది లేక వట్టి చేతులతోనే పోరాడి పీకను నులిమి చంపేస్తాడు. గదతో దాని దంతాలను రాలగొట్టి, ఒక దంతంతో దాని చర్మాన్ని చీల్చి ఆ చర్మాన్ని వస్త్రంగా చేసుకుంటాడు. ఈ విషయంలో ఎధినా అనే దేవత ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి హెరాకిల్స్ కు సాయం చేస్తుంది.

రెండవ సాహసం మార్చు

హెరాకిల్స్ ను 5 నుండి 100 తలలు గల విష సర్పాన్ని చంపమంటాడు యురిస్తియోస్. లెర్నా అనే నది వద్ద నివసించే ఈ సర్పానికి ఒక తల తెగిన చోట రెండు తలలు పుట్టుకొస్తాయి. తన మేనల్లుడైన లోలాస్ సహాయంతో రసాయనం పూసిన కాగడాతో తలలు పుట్టుకు రాకుండా చేసి, అన్ని తలలు నరికివేసి ఆ సర్పాన్ని చంపేస్తాడు. తన బాణాలను ఆ సర్ప శరీరంలొకి గుచ్చి మరింత విషమయం చేసుకుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ బాణాలే హెరాకిల్స్ మరణానికి దారితీస్తాయి.

మూడవ సాహసం మార్చు

హెరాకిల్స్ ను ఎరిమాన్తియన్ పర్వతంలో రాకాసి పందిని సజీవంగా తీసుకురమ్మంటాడు యురిస్తియోస్. హెరాకిల్స్ ఆ పందిని మంచుకొండల గూండా అలసిపోయే వరకూ తరిముతాడు. ప్రమాదవశాత్తు ఆ పంది మంచులో చిక్కుకుపోగా హెరాకిల్స్ దాన్ని పట్టి కాళ్ళు కట్టి, తన భజాలకు తగిలించుకొని యురిస్తియోస్ వద్దకు వెళ్ళతాడు. రాకాసి పందిని చూసిన యురిస్తియోస్ భయంతో పెద్ద జాడీలో పెట్టేస్తాడు.

నాల్గవ సాహసం మార్చు

ఈ సాహసంలో ఆర్టిమిస్ అనే కన్యక దేవతకు ప్రీతికరమైన జింకను హెరాకిల్స్ బంధిస్తాడు. సెర్నియా అను ప్రదేశంలో నివసించే ఈ జింక కంచు, బంగారపు గిట్టలు కలిగివుండి గాలిలో వదిలిన బాణ వేగాన్ని సైతం అధికమిస్తుంది. హెరాకిల్స్ సంవత్సరం పాటూ శ్రమించి ఆ జింకను ఓ నది దాటుతుండగా బాణంతో కొట్టి పట్టుకుని తన భుజంపై వేసుకుంటాడు. ఆర్టిమిస్ కు గతాన్ని అంతా చెబుతాడు. హెరాకిల్స్ ఆ జింకను తీసుకెళ్ళి యొరిస్తియోస్ కు చూపిస్తాడు. మాట ప్రకారం హెరాకిల్స్ ఆ జింకను ఆర్టిమిస్ కు సజీవంగా తిరిగి ఇచ్చేస్తాడు.

ఐదవ సాహసం మార్చు

ఎలిస్ దేశపు రాజైన ఆగీస్ కి ఒక 30 సంవత్సరాల నుండి శుభ్రం చేయబడని అశ్వశాల ఉంది. ఈ అశ్వశాలను ఒక్క రోజులో శుభ్రపరచడమే హెరాకిల్స్ చేసిన ఐదవ సాహసం. అశ్వశాలలో రెండు వైపుల గోడలను పడగొట్టి కందకాలు తవ్వి ఆఫయుస్, పెయుస్ అనే రెండు నదుల ప్రవాహాలను మళ్ళించాడు. దాంతో అశ్వశాల శుభ్రమైపోతుంది. అశ్వశాల శుభ్రమైతే పదవ వంతు అశ్వాలను ఇస్తానని మాట తప్పిన అగీస్ ను హెరాకిల్స్ హతమార్చుతాడు. తన పనిలో సహాయపడినందుకుగాను అగిస్ కుమారుడైన ఫైలియూస్ కు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు.

ఆరవ సాహసం మార్చు

స్టింపాలియా నది వద్ద ఉన్న నరమాంస పక్షులను తరిమివేయడం హెరాకిల్స్ చేసిన ఆరవ సాహసం. ఈ పక్షుల ముక్కులు కాంస్యంతోను, రెక్కలు లోహంతోను తయారుచేయబడి ఉంటాయి. పంటలను, పండ్ల చెట్లను, మనుష్యులను నాశనం చేసే ఇవి యుద్ధ దేవుడైన ఎరిస్ కు ప్రీతికరమైనవి. హెపేస్తస్ తయారు చేసిన గలగల శబ్దం చేసే కాంస్యపు యంత్రాన్ని ఉపయోగించి హెరాకిల్స్ ఆ పక్షులను భయపెడతాడు. భయంతో ఎగురుతున్న ఆ పక్షులను హెరాకిల్స్ తన బాణాలతో (లేక పంగళి కర్రతో) చాలా వరకూ చంపేస్తాడు. మిగిలిన పక్షులు అక్కడినుండి శాశ్వతంగా వెళ్ళిపోతాయి.

ఏడవ సాహసం మార్చు

క్రేట్ ద్వీపంలో పంటలను నాశనం చేస్తున్న వృషభాన్ని బంధించమే హెరాకిల్స్ చేసిన ఏడవ సాహసం. క్రేటాన్ ను పాలించే మినోస్ అనే రాజు హెరాకిల్స్ కు వృషభాన్ని బంధించేందుకు అనుమతిస్తాడు. హెరాకిల్స్ ఆ వృషభాన్ని బంధించి ఓడలో ఎధెన్స్ పంపేస్తాడు. యురిస్తియోస్ ఆ వృషభాన్ని హెరా కోసం బలివ్వాలనుకుంటాడు. సుందరంగా ఉన్న ఆ వృషభాన్ని యురిస్తియోస్ బలివ్వడం హెరా నిరాకరిస్తుంది.

ఎనిమిదవ సాహసం మార్చు

డయోమెడెస్ అనే రాజు తన గుర్రాలను మనుషుల మాంసంతో మేపుతుంటాడు. హెరాకిల్స్ ఆ రాజును కంచు తొట్టిలో పడేస్తాడు. ఆ నరమాంస గుర్రాలు తమ రాజును తినేస్తాయి. దాంతో ఆ గుర్రాలు శాంతించడంతో వాటిని యురిస్తియోస్ వద్దకు తీసుకువెళ్లతాడు హెరాకిల్స్. అలెగ్జాండర్ గుర్రమైన బుష్పలాస ఈ గుర్రాల జాతికే చెందినదని భావిస్తారు.

తొమ్మిదవ సాహసం మార్చు

హెరాకిల్స్ అమెజాన్ దేశానికి ఒంటరిగా (లేక థెసస్, తెలమన్ అను యువకులతో) వెళ్ళతాడు. థెర్మోడాన్ నది ఒడ్డున ఉన్న థెమిస్క్రియా దేశాన్ని పరిపాలించే హిప్పోలైట్ అనే రాణి ఎప్పుడు ఎరిస్ అనే దేవుడు బహూకరించిన నడికట్టుతో ఉంటుంది. హెరాకిల్స్ రాణి అయిన హిప్పోలైటస్ ను అపహరిస్తున్నాడని హెరా అమెజాన్ దేశమంతా పుకారు సృష్టించి ఆ అమెజానులను హెరాకిల్స్ పై ఉసిగొల్పుతుంది. అమెజానులు హెరాకిల్స్ యొక్క ఓడపై దాడి చేస్తారు. హెరాకిల్స్ తన పై హిప్పోలైటస్ హత్యాప్రయత్నం చేస్తోందని భావించి ఆమెను చంపి నడికట్టును దక్కించుకుంటాడు.

పదవ సాహసం మార్చు

హెరాకిల్స్ పదవ సాహసం గెర్యాన్ అను రాక్షసుడికి చెందిన పశు సంపదను సాధించడం. యురిథియా సామ్రాజ్య రాజైన గెర్యాన్ అను రాక్షసుడు మూడు జతల కాళ్ళు, మూడు మొండెములు కలిగినవాడు. హెరాకిల్స్ లిబియా ఎడారి మీదుగా యురిథియా వెళ్తున్నప్పుడు హీలియోస్ అను సూర్య భగవానుడి వద్ద నుండి బంగారు కప్పుని పొంది దాని సహాయంతో యురిథియా చేరతాడు. అబాస్ పర్వత శిఖరం వద్ద హెరాకిల్స్ తన గదను ఉపయోగించి గెర్యాన్ కాపరి అయిన యురిషన్ ను, ఓర్తస్ అను రెండు తలల కుక్కను హతమారుస్తాడు. ఇదంతా కళ్ళారా చూసిన మెనొటెస్ అను నరకానికి చెందిన కాపరి గెర్యాన్ కు వివరిస్తాడు. చివరిగా అంధిమస్ నది వద్ద హెరాకిల్స్ గెర్యాన్ ను హతమారుస్తాడు.

పదకొండవ సాహసం మార్చు

హెస్పెరిడెస్ అను దేవకన్యలు కాపలా కాస్తున్న తోటలోనుండి బంగారు యాపిల్స్ ను దొంగిలించడం హెరాకిల్స్ చేసిన పదవ సాహసం. హెరాకు పెళ్ళి బహుమతిగా గేయా దేవత ఇచ్చిన బంగారు యాపిల్స్ కాసే చెట్లను హెస్పెరెడిస్ అను దేవకన్యలు కాపలా కాస్తుంటారు. ఈ దేవకన్యలు అట్లాస్ కుమార్తెలు. ఈ యాపిల్స్ ను దొంగిలించడమే హెరాకిల్స్ చేయవలసిన పదకొండవ సాహసం. హెరాకిల్స్ తన ప్రయాణంలో కకాకస్ పర్వతాల వద్ద జూస్ చే శపించబడిన ప్రొమిధియస్ యొక్క కాలేయాన్ని ఆరగిస్తున్న ఒక గ్రద్ధను సంహరిస్తాడు. హెరాకిల్స్ ను భూమిని చేతులతో మోసే అట్లాస్ దేవుడి వద్దకు వెళ్ళమంటాడు ప్రొమిధియస్. హెరాకిల్స్ అట్లాస్ వద్దకు వెళ్ళతాడు. అట్లాస్ బంగారపు యాపిల్స్ ను తీసుకొస్తే ఆలోగా భూమిని మోస్తానంటాడు హెరాకిల్స్. జాస్ పెట్టిన శిక్షనుండి తప్పించుకోవడానికి అదే అవకాశంగా భావించిన అట్లాస్ హెరాకిల్స్ కోసం యాపిల్స్ తీసుకురావడానికి ఒప్పుకుంటాడు. అట్లాస్ బంగారు ఆపిల్ పండ్లను తీసుకొస్తాడు. హెరాకిల్స్ "భూమిని మోస్తుంటే భుజం నొప్పిగా ఉంది. ఒక్క సారి ఈ భూమిని పట్టుకుంటే , నొప్పి లేకుండా నేను నా భుజంపై సింహపు తోలు ను మెత్తటి దిండులా పెట్టుకుంటాను" అనడంతో అట్లాస్ ఆ భూమినిపట్టుకుంటాడు. హెరాకిల్స్ ఆ విధంగా అట్లాస్ ను బురిడీ కొట్టి ఆపిల్స్ సంపాదించాడు. తరువాత ఆపిల్స్ ను యురిస్తియోస్ వద్దకు తీసుకెళ్ళాడు.హెరాకిల్స్

వంశ చరిత్ర[1] మార్చు

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Zeus
 
Danaë
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Perseus
 
Andromeda
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Perses
 
 
Alcaeus
 
Hipponome
 
 
 
 
 
Electryon
 
Anaxo
 
 
Sthenelus
 
Menippe
 
 
Mestor
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Anaxo
 
 
Amphitryon
 
Alcmene
 
Zeus
 
 
 
Licymnius
 
 
 
Eurystheus
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Iphicles
 
 
 
 
 
 
 
 
 
Megara
 
Heracles
 
Deianira
 
Hebe
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Iolaus
 
 
 
 
 
 
 
Three Children
 
 
Hyllus
 
Macaria
 
Others

సూచికలు మార్చు

  1. Morford, M.P.O, Lenardon R.J.(2007)Classical Mythology. pp. 865 Oxford: Oxford University Press.

యితర లింకులు మార్చు

యివి చదవండి మార్చు

  • Padilla, Mark W. (1998). "Herakles and Animals in the Origins of Comedy and Satyr Drama". In Le Bestiaire d'Héraclès: IIIe Rencontre héracléenne, edited by Corinne Bonnet, Colette Jourdain-Annequin, and Vinciane Pirenne-Delforge, 217-30. Kernos Suppl. 7. Liège: Centre International d'Etude de la Religion Grecque Antique.
  • Padilla, Mark W. (1998). "The Myths of Herakles in Ancient Greece: Survey and Profile". Lanham, Maryland: University Press of America.

బయటి లింకులు మార్చు