ప్రధాన మెనూను తెరువు

సర్పి

(హెర్పిస్ నుండి దారిమార్పు చెందింది)

సర్పి (Herpes) అనేది హెర్పెస్ సింప్లెక్స్ (Herpes Simplex) అనే సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. ఇందులో రెండు రకాలు: హెచ్.యస్.వి టైప్ 1 (HSV Type1) మరియు హెచ్.యస్.వి టైప్ 2 (HSV Type 2). సర్పి సాధారణంగా జననేంద్రియాల వద్ద, నోటి వద్ద, నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. హెచ్.యస్.వి టైప్ 2 వల్ల జననేంద్రియాలవద్ద సోకే సర్పి స్త్రీ పురుషులలో నొప్పితో కూడిన కురుపులతో ఏర్పడుతుంది. హెచ్.యస్.వి టైప్ 1 వల్ల సోకే సర్పి నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. జననేంద్రియాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల కంటికి సోకవచ్చును. మెదడుకు సోకిన సర్పి అన్నింటికన్నా ప్రమాదమైనది. జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లంతా నొప్పులు, జననావయవాల్లో మంట, దురద... ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం శూన్యం. తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతుండటంతో మానసిక ఆందోళన. హెర్పిస్ బారినపడిన వారిలో కనిపించే పరిస్థితి ఇది జననాంగ సర్పి (Genital Herpes) లైంగిక సంపర్కం ద్వారా సంభవించే సుఖ వ్యాధి.

సర్పి
వర్గీకరణ & బయటి వనరులు
Herpes(PHIL 1573 lores).jpg
Herpes labialis of the lower lip. Note the blisters in a group marked by an arrow.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 5841 33021
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

అతి సూక్ష్మమైన వైరస్ హెర్పిస్. జీవితాంతం బాధించే ఈ వైరస్‌ను హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటారు. ఇది రెండు రకాలు. ఒకటి హెచ్ఎస్‌వి 1, హెచ్ఎస్‌వి 2.

  1. హెచ్ఎస్‌వి 1 : ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటి పొక్కులలాగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఇవి వచ్చి పోతూ ఉంటాయి.
  2. హెచ్ఎస్‌వి 2 : జననావయవాల దగ్గర పొక్కులతో బయటపడుతుంది. దీనినే జెనిటల్ హెర్పిస్ అంటారు. చిన్న చిన్న నీటి పొక్కులలాగా వచ్చి పగిలిపోతుంటాయి. తగ్గినట్టే తగ్గి తిరిగి రావడం జరుగుతుంది. లైంగిక వ్యాధులలో నిత్యం వేధించే ఈ సమస్య దైనందిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.

హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు లేదా స్త్రీల నుంచి పురుషులకు శృంగారం జరిపే సమయంలో వ్యాప్తి చెందుతుంది. కలయిక సమయంలో చర్మం చిట్లినప్పుడు పుండ్లు, గాయాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ వెన్నెముక చివరి భాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చోటు చేసుకుని నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణ స్థితిలో ఎలాంటి లక్షణాలూ చూపించకుండా అవ సరమైనప్పుడు తన ప్రతాపాన్ని చూపించి అతలాకుతలం చేస్తుంది. రోగిలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు మానసిక ఆందోళన, శారీరక ఆందోళన ఉన్నప్పుడు, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇది సునామీ లాగా విజృంభిస్తుంది.

కారణాలుసవరించు

అపరిశుభ్రమైన వాతావరణం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, సరైన ఆహార సమతుల్యత లేకపోవడం.

లక్షణాలుసవరించు

మామూలుగా అయితే తొలి దశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో మంట ఉంటుంది. ఒళ్లంతా నొప్పులు, గజ్జల్లో, చంకల్లో గడ్డలుగా ఉంటుంది. తరువాత క్రమక్రమంగా లైంగిక భాగాలపై చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తాయి. ఈ నీటి పొక్కులు రెండు, మూడు రోజులలో పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ దశలో రోగికి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. తొలిసారి లక్షణాలు కనిపించినప్పుడు సరైౖన చికిత్స తీసుకుంటే ప్రారంభ దశలోనే సత్వర నివారణ జరుగుతుంది. కానీ చాలా మందిలో వైరస్ ఉండిపోవడం వల్ల నిదానంగా ఉంటూ తిరిగి బయటపడుతూ ఉంటుంది. దీనినే హెర్పిస్ రికరెంట్ అటాక్ అంటారు.

హెర్పిస్ రికరెంట్ అటాక్స్సవరించు

వాతావరణ పరిస్థితుల్లో ఉన్న తీవ్రమైన తేడాలు, మానసిక ఆందోళన, విపరీతమైన శారీరక ఆందోళన వల్ల హెర్పిస్ రికరెంట్ అటాక్స్ వస్తాయి. దీనిలో లక్షణాల తీవ్రత అంతగా లేకపోయినా కొన్ని రోజుల్లో పుండ్లు మానిపోతాయి. నీటి పొక్కులు చితికి పుండ్లుగామారినప్పుడు హెర్పిస్ వైరస్ పుండు రసిలో ఉంటుంది. ఈ సమయంలో రతిలో పాల్గొంటే భాగస్వామికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి పుండ్లూ, గాయాలూ లేకపోయినా అవతలి వ్యక్తికి అంటుకునే అవకాశం ఉంటుంది. స్త్రీలలో నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల చిన్న చిన్న పొక్కులు ఉన్నా తెలియవు. వీరికి హెర్పిస్ ఉన్నట్లు తెలియకపోయినా, లోలోపల హెర్పిస్ ఉండే అవకాశం ఉంటుంది.

నిర్ధారణసవరించు

కొన్ని లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించవచ్చు. అపరిచిత వ్యక్తులతో లైంగికంగా కలిసిన తరువాత వారం రోజులలో నీటి పొక్కుల లాగా ఏర్పడతాయి. కొన్ని రోజులకు తగ్గినట్టే తగ్గి మళ్లీ కనిపిస్తాయి. దీనిని బట్టి హెర్పిస్‌ను గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్ట్, హెచ్ఎస్‌వి 1 అండ్ 2, ఐజీజీ, ఐజీఎమ్ వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. పుండ్ల దగ్గర ఉండే స్రావాలను సేకరించి కల్చర్ టెస్ట్, డీఎన్ఎ టెస్ట్, యూరిన్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా నిర్ధారించుకోవచ్చు.

దుష్ఫలితాలుసవరించు

గర్భిణిలకు మొదటి నెలలో హెర్పిస్ సోకితే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో గర్భిణికి హెర్పిస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నియోనాటల్ హెర్పిస్ అంటారు. వెన్నెముకలోని నాడీ మండలానికి హెర్పిస్ వస్తే అంగ స్తంభన సమస్య ఎదురు కావచ్చు. శీఘ్ర స్ఖలనం సమస్య కూడా రావచ్చు. కొందరిలో నాడీ మండలంలో హెర్పిస్ వచ్చి మెదడులో మెనింజైటిస్‌కు కారణం కావచ్చు.

చికిత్సలుసవరించు

సర్పికి చాలా రకాల చికిత్సలున్నాయి. ఆయుర్వేదంలో వేప ఆకులతో చేసిన మాత్రలు వేసుకోవడం, వేపగింజల నూనె సర్పిపైన పూయడం వంటివి చేస్తుంటే సర్పి నయమవుతుంది.

నివారణసవరించు

ఆహారంలో పోషక విలువల సమతుల్యత సరిగా ఉండేలా చూసుకోవాలి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సర్పి&oldid=2415905" నుండి వెలికితీశారు