హెర్మన్ స్నెల్లెన్

హెర్మన్ స్నెల్లెన్ ( 1834 ఫిబ్రవరి 19 - 1908 జనవరి 18) ఒక డచ్ నేత్ర వైద్యుడు,. అతను దృశ్య తీక్షణతను (1862) అధ్యయనం చేయడానికి స్నెల్లెన్ చార్టును ప్రవేశపెట్టాడు. ఫ్రాన్సిస్కస్ డోండర్స్ తరువాత నెదర్లాండ్స్ హాస్పిటల్ ఫర్ ఐ పేషెంట్స్‌లో డైరెక్టర్ పదవిని చేపట్టాడు.

హెర్మెన్ స్నెల్లెన్
జననం(1834-02-19)1834 ఫిబ్రవరి 19
జీస్ట్, నెదర్లాండ్స్
మరణం1908 జనవరి 18(1908-01-18) (వయసు 73)
ఉట్రెచ్, నెదర్లాండ్స్
జాతీయతనెదర్లాండ్స్
రంగములునేత్రవైద్యుడు
వృత్తిసంస్థలునెదర్లాండ్స్ హాస్పిటల్ ఫర్ ఐ పేషెంట్స్
ప్రసిద్ధిస్నెల్లెన్ చార్ట్
దృష్టి తీక్షణతను అంచనా వేయడానికి ఉపయోగించే సాధారణ స్నెల్లెన్ చార్ట్

జీవిత విశేషాలు

మార్చు

స్నెలెన్ ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయంలో డోండర్స్, గెరార్డస్ జోహన్నెస్ ముల్డర్, జాకబస్ ష్రోడర్ వాన్ డెర్ కోల్క్ ల వద్ద మెడిసిన్ చదివాడు. 1858 లో వైద్య పట్టా పొందాడు. అతను ఆప్తాల్మాలజీలో ప్రావీణ్యం పొందాడు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత కంటి రోగుల కోసం నెదర్లాండ్స్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ఫిజిషియన్‌గా పనిచేశాడు.

వృత్తిగతం

మార్చు

అతను 1884 లో డోండర్స్ తరువాత ఇన్స్టిట్యూట్‌కు డైరెక్టరయ్యాడు. ఈ పదవిలో అతడు 1903 వరకు పనిచేసాడు. 1877 లో, ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయంలో ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. అతను ఆస్టిగ్మాటిజం, గ్లాకోమా తదితర కంటి వ్యాధులపై పరిశోధనలతో పాటు కళ్ళజోడును, నేత్ర శస్త్రచికిత్సలనూ ఉపయోగించి దృశ్య తీక్షణతను సరిదిద్దడంపై పరిశోధనలు చేశాడు. [1]

చార్టు

మార్చు

స్నెల్లెన్ 1862 లో దృశ్య తీక్షణత కొలిచేందుకు కంటి చార్టును అభివృద్ధి చేసాడు. [2] ఇది వేగంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రామాణికమైంది. [3] ప్రామాణిక ఫాంట్‌లను ఉపయోగించకుండా, 5x5 గ్రిడ్‌లో ఉత్పత్తి చేయబడిన ఆప్టోటైప్స్, ప్రత్యేకంగా రూపొందించిన అక్షరాలు, అతడి చార్టు లోని అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ. ఆప్టోటైప్ అక్షరాల పంక్తిని 5 నిమిషాల ఆర్క్‌ను ఉపసంహరించుకున్నప్పుడు, 1 నిమిషం ఆర్క్ ద్వారా వేరుచేసినప్పుడూ వాటిని చదవగలిగే శక్తి ద్వారా ప్రామాణిక దృష్టిని కొలుస్తారు.

మూలాలు

మార్చు
  1. Herman Snellen, Whonamedit.com. Accessed July 6, 2010.
  2. H. Snellen, Probebuchstaben zur Bestimmung der Sehschärfe, Utrecht 1862.
  3. Watt, Wendy Strouse. "How Visual Acuity Is Measured" Archived 2020-06-19 at the Wayback Machine, Macular Degeneration Support, October 2003. Accessed July 6, 2010.