జెనిసిస్ గ్రంథం ప్రకారం, కయీను లేదా కేన్ ('Cain), హెబెల్ (Abel) లు ఆదాము, అవ్వ ల సంతానం.[1] మానవుని పతనం తరువాత[2] వీరు జన్మించారు. వీరి కథ బైబిల్ Genesis 4:1-16 లోను, ఖురాన్ 5:26-32లోను, మోసెస్ 5:16-41లోను చెప్పబడింది. అన్నింటిలోను కేన్ ఒక రైతు. హెబెల్ ఒక గొర్రెల కాపరి.[3] కేన్ తన తమ్ముడైన హెబెల్‌ను చంపేశాడు.[4] కనుక బైబిల్ ప్రకారం మానవ సృష్టిలో ఇది మొట్టమొదటి హత్య. ఈ హత్యకు కారణం దేవుడు[5] కేన్ ఇచ్చిన బలిని నిరాకరించి, హెబెల్ ఇచ్చిన బలిని స్వీకరించాడు. ఎందుకంటే హెబెల్ తన గొర్రెలలో అన్నింటికంటె మంచిదానిని బలి ఇచ్చాడు. కేన్ మాత్రం తన అదనపు పంటను సమర్పించాడు. ఈ విధంగా హెబెల్ ప్రపంచంలో మొదటి హతుడు. ఆదం రెండవ కొడుకు. తన అన్న కయీను చేతిలో హతుడయ్యాడు.

హెబెల్‌ను హత్య చేస్తున్న కేన్ - సెయింట్ బావో కేథెడ్రల్‌లో ఘెంట్ అల్టార్ (1432) పైని చిత్రం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "She conceived and gave birth to Cain. ... Then she also gave birth to his brother Abel." మూస:Bibleref2 (Holman Christian Standard Bible, HCSB).
  2. "God sent him away from the garden of Eden to work the ground." Gen 3:23 (HCSB).
  3. "Cain cultivated the land." Gen 4:2 (HCSB).
  4. "Abel became a shepherd." (మూస:Bibleref2).
  5. మూస:Bibleref2 and others (Biblia Hebraica Stuttgartensia, BHS).

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హేబేలు&oldid=2951743" నుండి వెలికితీశారు