హేమంత కుమార్ సర్కార్

భారతీయ రచయత మరియు ఉద్యమకారుడు

హేమంత కుమార్ సర్కార్ (బెంగాలీ: হেমন্তকুমার সরকার) (1897 — 3 నవంబర్ 1952) భారతీయ భాషావేత్త, రచయిత, సంపాదకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను సుభాష్ చంద్రబోస్ కు అత్యంత సన్నిహితుడు.[1]

హేమంత కుమార్ సర్కార్
হেমন্ত কুমার সরকার
హేమంత కుమార్ సర్కార్ 1927లో దేవాస్ రాష్ట్రం హోం మంత్రిగా ఉన్నారు.
జననం1897
బగన్‌చ్రా, నాడియా జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం3 నవంబర్ 1952
కృష్ణానగర్, నదియా జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిరైతు నాయకుడు
తల్లిదండ్రులుమదన్ మోహన్ సర్కార్
కాదంబరీ దేవి

ప్రారంభ జీవితం

మార్చు

సర్కార్ 1897లో నదియా జిల్లాలోని శాంతిపూర్ సమీపంలోని బాగంచ్రా గ్రామంలో మదన్ మోహన్ సర్కార్, కాదంబరీ దేవిలకు ఆరుగురు కుమారులలో ఐదవ కుమారుడిగా జన్మించాడు. సర్కార్ కృష్ణనగర్ కాలేజియేట్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లోని కార్మికుల విద్యా కార్యక్రమాల నుండి ప్రేరణ పొందిన అతను సైలెన్ ఘోష్‌తో కలిసి కృష్ణానగర్ వర్క్‌మెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాడు, ఇది శ్రామిక-తరగతి ప్రజలకు ఉచిత విద్యను అందించే ఒక రాత్రి పాఠశాల. 1917లో, సర్కార్ కృష్ణనగర్ ప్రభుత్వ కళాశాల నుండి సంస్కృతంలో ప్రథమ శ్రేణిలో సాధించాడు. అతని కళాశాలలో బిఎ, బిఎస్సి విద్యార్థులందరిలో మొదటి స్థానంలో నిలిచినందుకు అతనికి మోహినీ మోహన్ రాయ్ బహుమతి లభించింది. తన గ్రాడ్యుయేషన్ తర్వాత, సర్కార్ కలకత్తా విశ్వవిద్యాలయంలో కంపారిటివ్ ఫిలాలజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1919 లో, అతను కంపారిటివ్ ఫిలాలజీలో ఎంఎ లో మొదటి స్థానంలో నిలిచి, విశ్వవిద్యాలయ బంగారు పతకాన్ని అందుకున్నాడు.[2]

వ్యక్తిగత జీబితం

మార్చు

నవంబర్ 1926లో, సర్కార్ బెంగాల్‌లోని మొదటి మహిళా పోస్ట్-గ్రాడ్యుయేట్‌లలో ఒకరైన సుధీర ఠాగూర్ (1902-1973)ని వివాహం చేసుకున్నాడు. 1931లో, సర్కార్, అతని భార్యతో కలిసి కోల్‌కతాలోని 7 బాలిగంజ్ ప్లేస్‌లో తమ ఇంటిని నిర్మించుకున్నాడు. సర్కార్‌కు ముగ్గురు కుమారులు (మనబేంద్ర, దీపాంకర్, మనసిజ) ఉన్నారు.

ఉద్యోగ జీవితం

మార్చు

1919లో, సర్కార్ అప్పటి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశుతోష్ ముఖర్జీచే కలకత్తా విశ్వవిద్యాలయంలో కంపారిటివ్ ఫిలాలజీలో లెక్చరర్‌గా నియమించబడ్డాడు. అతను వేద సంస్కృతం, ఆధునిక బెంగాలీ కవిత్వం, భారతీయ వెర్నాక్యులర్స్ ఫిలాలజీని బోధించాడు. 1920లో, "ది ఇంటెలెక్చువల్ లాస్ ఆఫ్ లాంగ్వేజ్" అనే అతని థీసిస్‌ను ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ స్కాలర్‌షిప్ ఆమోదించింది. అదే సంవత్సరంలో, అతను ఇంగ్లాండ్‌లో మూడు సంవత్సరాలు చదువుకోవడానికి భారత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను కూడా పొందాడు.

చివరి రోజులు

మార్చు

సర్కార్ తన చివరి సంవత్సరాలను కృష్ణానగర్‌లో గడిపాడు, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి స్థానిక మత్స్యకారులతో కలిసి పనిచేశాడు. అతను 3 నవంబర్ 1952న మరణించాడు. తన చివరి రచనలలో కూడా, అతను విమాన ప్రమాదంలో బోస్ మరణించాడనే వార్త తప్పు అని, అతను త్వరలో భారతదేశానికి తిరిగి వస్తాడని ప్రతిపాదించాడు.[3]

రచనలు

మార్చు

సర్కార్ భాషాశాస్త్రం, తన రాజకీయ జీవితంలోని వ్యక్తిగత అనుభవాలపై బెంగాలీ, ఆంగ్లంలో పుస్తకాలు రాశాడు. 1927లో, అతను సుభాష్చంద్రబోస్ మొదటి జీవిత చరిత్రను ప్రచురించాడు.[4]

బెంగాలీ

మార్చు
  • নদীয়া ও কলিকাতার কতকগুলি চলিত কথা

ఇంగ్లీష్

మార్చు
  • History of the Bengali Language
  • The Intellectual Laws of Language
  • Twelve Years With Subhas
  • My Jail Experiences
  • Reminiscences of Deshbandhu

మూలాలు

మార్చు
  1. Sengupta, Subhodh Chandra; Basu, Anjali, eds. (January 2002). "Sansad Bangali charitabhidhan" হেমন্তকুমার সরকার [Hemanta Kumar Sarkar]. Samsad Bangali Charitabhidhan (Bibliographical Dictionary) (in Bengali). Vol. 1 (4th ed.). Kolkata: Shishu Sahitya Samsad. p. 693. ISBN 81-85626-65-0.
  2. Aurangzeb, R. M. (3 November 2012). চিরস্থায়ী বন্দোবস্তের কুফল ও বাংলার প্রজা আন্দোলন. Dainik Sangram (in Bengali). Dhaka. Archived from the original on 29 April 2014. Retrieved 21 April 2013.
  3. Sinha, Dinesh Chandra (2001). শ্যামাপ্রসাদ: বঙ্গভঙ্গ ও পশ্চিমবঙ্গ [Shyamaprasad: Banga Bibhag O Paschimbanga] (in Bengali). Kolkata: Akhil Bharatiya Itihash Sankalan Samiti. p. 276.
  4. Ghose, Chandrachur. "His Majesty's Opponent A Review". Subhas Chandra Bose.org. Archived from the original on 5 July 2013. Retrieved 21 April 2013.