హేలీ తోకచుక్క : Halley's Comet (/ˈhæli/ or /ˈhli/), అధికారిక నామం 1పి|హేలీ (1P/Halley),[1] ఇదొక స్వల్పకాలిక తోకచుక్క. భూమి మీద నుండి కంటికి ఏ పరికర సహాయమూ లేకుండా కనిపించే తోకచుక్క. ఇది ప్రతి 75–76 సంవత్సరాలకు ఒక సారి కనిపిస్తుంది.[1][3] ప్రతి మనిషి జీవితంలో గరిష్ఠంగా రెండు సార్లు కనిపించే తోకచుక్క. ఇది 1986 లో కనబడింది, మరలా 2061 లో కనబడుతుంది.[4]

1P/హేలీ (హేలీ తోకచుక్క)
A color image of comet Halley, shown flying to the left aligned flat against the sky
Halley's Comet on 8 March 1986
కక్ష్యా లక్షణాలు[1]
Epoch 2449400.5
(17 February 1994)
అపహేళి: 35.1 AU
(9 December 2023)[2]
పరిహేళి: 0.586 AU
last perihelion: 9 February 1986
next perihelion: 28 July 2061[2]
Semi-major axis: 17.8 AU
అసమకేంద్రత (Eccentricity): 0.967
కక్ష్యా కాలం: 75.3 a[1]
వాలు: 162.3°

ఇది 1910 సంవత్సరంలోను, 1986 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659 లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531 లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607 లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682 లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759 లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.

హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారని తెలిసింది. మానవులు చైనా లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066 లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది.

ప్రాచుర్యంసవరించు

సాహిత్యంలో ప్రస్తావనలుసవరించు

జనజీవితం లోసవరించు

 • హేలీ తోకచుక్క కనిపించిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జన్మించిన పలువురికి ఈ విషయాన్ని స్ఫురించేలా హేలీ అన్న పేరు పెట్టుకున్నారు.

హేలీ తోకచుక్క కాలరేఖసవరించు

 • 1P/−239 K1, −239 (25 మే, క్రీ.పూ. 240)
 • 1P/−163 U1, −163 (12 నవంబరు, క్రీ.పూ. 164)
 • 1P/−86 Q1, −86 (6 ఆగస్టు, క్రీ.పూ. 87)
 • 1P/−11 Q1, −11 (10 అక్టోబరు, క్రీ.పూ.12)
 • 1P/66 B1, 66 (25 జనవరి, క్రీ.శ.66)
 • 1P/141 F1, 141 (22 మార్చి, క్రీ.శ. 141)
 • 1P/218 H1, 218 (17 మే, క్రీ.శ. 218)
 • 1P/295 J1, 295 (20 April 295)
 • 1P/374 E1, 374 (16 February 374)
 • 1P/451 L1, 451 (28 June 451)
 • 1P/530 Q1, 530 (27 September 530)
 • 1P/607 H1, 607 (15 March 607)
 • 1P/684 R1, 684 (2 October 684)
 • 1P/760 K1, 760 (20 May 760)
 • 1P/837 F1, 837 (28 February 837)
 • 1P/912 J1, 912 (18 July 912)

 • 1P/989 N1, 989 (5 September 989)
 • 1P/1066 G1, 1066 (20 March 1066)
 • 1P/1145 G1, 1145 (18 April 1145)
 • 1P/1222 R1, 1222 (28 September 1222)
 • 1P/1301 R1, 1301 (25 October 1301)
 • 1P/1378 S1, 1378 (10 November 1378)
 • 1P/1456 K1, 1456 (9 June 1456)
 • 1P/1531 P1, 1531 (26 August 1531)
 • 1P/1607 S1, 1607 (27 October 1607)
 • 1P/1682 Q1, 1682 (15 September 1682)
 • 1P/1758 Y1, 1759 I (13 March 1759, predicted by Halley)
 • 1P/1835 P1, 1835 III (16 November 1835)
 • 1P/1909 R1, 1910 II, 1909c (20 April 1910)
 • 1P/1982 U1, 1986 III, 1982i (9 February 1986)
 • Next perihelion predicted 28 July 2061

Orbit of Halley's Comet (blue) set against the orbits of the outer planets (red)
Orionid meteor originating from Halley's Comet striking the sky below the Milky Way and to the right of Venus.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; jpldata అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. 2.0 2.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; horizons అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. G. W. Kronk. "1P/Halley". cometography.com. Retrieved 13 October 2008.
 4. O. Ajiki and R. Baalke. "Orbit Diagram (Java) of 1P/Halley". Jet Propulsion Laboratory Solar System Dynamics. Retrieved 1 August 2008.

ఉపయుక్త గ్రంధాలుసవరించు

బయటి లింకులుసవరించు