హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం

హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం ఒక సేంద్రీయ ఆమ్లం.హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం అనేది దేహ బరువును తగ్గించే ఔషద గుణాలు కలిగి వున్నది.గార్సినియా కంబోజియాచెట్టు యొక్క పండ్ల నుండి హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం ను సంగ్రహిస్తారు.యాసిడ్ హైడ్రాక్సీసిట్రిక్ (HCA) అనేది ఆగ్నేయాసియాలో బాగా ప్రాచుర్యం పొందిన గార్సినియా కంబోజియా యొక్క ఫ్రూట్ రిండ్‌లో ప్రధాన భాగం, దీనిని వంట కోసం మసాలాగా ఉపయోగిస్తారు. మొక్కలో క్సాంతోన్స్, బెంజోఫెనోన్స్ మరియు హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ వంటి ప్లాంట్ యాసిడ్‌లు వంటి వివిధ రసాయన భాగాలు ఉంటాయి. హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ బరువు తగ్గింపు కోసం, ముఖ్యంగా అధిక బరువు ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగిస్తారు. హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం నీరు మరియు ఆల్కహాల్‌లో కరుగుతుంది. అయితే హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం అస్థిరంగా ఉంటుంది(అనగా రసాయనచర్యకు త్వరగా లోనవుతుంది).అందుకని ఎక్కువ రోజులు పాదవకుండా వుందటానికి దానిని మరింత స్థిరమైన లాక్టోన్ రూపంలోకి మార్చబడుతుంది. వినియోగదారు ఉత్పత్తుల కోసం, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ లవణాలు గామార్చి నిల్వ చేయబడుతుది,[1]

గార్సినియా కంబోజియా చెట్టు

మార్చు
 
గార్సినియ పండ్లు

గార్సినియా కంబోజియా చెట్టు ఇండోనేషియా, భారతదేశం, శ్రీలంక, మలేషియా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. గార్సినియా చెట్టుకు కొత్త సరైన పేరు గార్సినియా గుమ్మి-గుట్ట. దీనికి ఇతర పేర్లు ఎర్ర మామిడి, మలబార్ చింతపండు, కుండ చింతపండు, బ్రిండాల్ బెర్రీ, మరియు గంబూజ్.[2] గార్శి నియాలోని ఐదు గార్సినియా జాతులు జి. బ్రసిలియెన్సిస్, జి.గార్డ్నేరియానా, జి.పెడున్‌కులాటా, జి. కాంబోజియా మరియు జి.మాంగ్‌స్తానా వైద్య చికిత్స పరంగా పల ఔషద గూణాలు వున్నాయి.ఈ మొక్కల పండ్ల సారం(extract) యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో కూడిన సహజసిద్ధమైన సహజ చికిత్స గుణం కల్గి వున్నది, అవి చర్మ రుగ్మతలు, గాయాలు, నొప్పి మరియు ఇన్‌ఫెక్షన్ల చికిత్స కోసం, యాంటీ నోసైసెప్టివ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీటూమోరల్, యాంటీ ఫంగల్,యాంటీకాన్సర్, యాంటి హిస్టామి నిక్, యాంటీఅల్సెరోజెనిక్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, వాసోడైలేటర్, హైపోలిపిడెమిక్, హెపా టోప్రొటెక్టివ్,నెఫ్రోప్రొటెక్టివ్ మరియు కార్డియోప్రొటెక్టివ్ గుణాలను కలిగివున్నది.[3]

పండు-తొక్క

మార్చు

మొక్క యొక్క పండు పసుపు లేదా ఎరుపు రంగును కలిగి ఉంటుంది మరియు గుమ్మడి కాయను పోలి ఉంటుంది. పండ్లను తినగలిగినప్పటికీ, వాటి రుచి చాలా ఆమ్లంగా ఉన్నందున వాటిని సాధారణంగా పచ్చిగా తినరు.పండ్ల తొక్క సాధారణంగా ఆసియాలో ఆహారాన్ని సంరక్షించడానికి మరియు దాని రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. సాంప్రదాయకంగా, ఇది మలబద్ధకం, రుమాటిజం మరియు ఋతు నొప్పికి నివారణగా ఉపయోగించబడింది.[4] మొక్క పై తొక్కను బంగారం మరియు వెండిని పాలిష్ చేయడానికి ఉపయోగిస్తారు, దాని రెసిన్ పెయింటింగ్‌ లు మరియు వాటర్ కలర్‌లకు వర్ణద్రవ్యం వలె ఉపయోగించబడుతుంది. గమ్‌ను వార్నిష్‌గా ఉపయోగిస్తారు.[5]

హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం ఉత్త్పత్తి విధానం

మార్చు

గార్సినియా కంబోజియా నుండి హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్‌ను సంగ్రహించి శుద్ధి చేసే పద్ధతి పలు దశలను కలిగి వుండును.

1*.సంగ్రహణ: సరైన ద్రావకం/ద్రావణి ని ఉపయోగించి హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్‌ను ను పండ్ల తొక్క నుండి సంగ్రహించడం. ఇందుకు నీరు లేదా 99% శుద్ధమైన ఇథనోల్ /ఇథైల్ ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు.సాల్వెంట్(ద్రావకం)ఉపయోగించి వేరుచేసిన హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్‌ను సరైన క్షారం ఉపయోగించి తటస్థీకరిస్తారు. ఇలా చేయడం వలన ఏర్పడిన హైడ్రాక్సీసిట్రేట్ కు హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం కన్న స్థిరత్వం ఎక్కువ.ఇప్పుడు ఉపయోగించిన ద్రావకం ను స్వేదన క్రియ ద్వారా ఆవిరి/వాయువుగా మార్చి వేరుచేస్తారు.ద్రావకం నుండి వేరు చేసిన హైడ్రాక్సీసిట్రేట్ ను నీటితో పలు దపాలుగా కడిగి అందులోని లవాణాన్ని,నీటిలో కరగించి వేరు చేస్తారు.నీటితో బాగా కడగబడి,అనవసర లవణాలు తొలగింపబడిన హైడ్రాక్సీసిట్రేట్ ను ఒక ఆమ్లం ద్వారా జలవిశ్లేషణ(hydrolysis)చర్య జరిపించి ,దాని రంగును తొలగించి, హైడ్రాక్సీసిట్రేట్ యొక్క గాఢత ను పెంచెదరు.ఇప్పుడు హైడ్రాక్సీసిట్రేట్ ను శుద్ధిచేసి,స్పటికీకరణ చేస్తారు.[6]

హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం యొక్క ఐసోమరులు

మార్చు
 
హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం

గార్సినియాలో నుండి వేరు చేసిన హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం నాలుగు ఐసోమరు రూపాలలో లభించినది ఆ నాలుగు ఐసోమర్లు వరుసగా (+)- మరియు (-) -హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్, మరియు (+)- మరియు (-)-అల్లో-హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్. (-)-హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ ఐసోమర్. [7]

హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం భౌతిక గుణాలు

మార్చు
అణుఫార్ములా:C6H5O8
అణుభారం:205.101 గ్రా/మోల్

(-)-హైడ్రాక్సీసిట్రేట్ యొక్క భౌతిక గుణాలు [8]

అణుఫార్ములా : C6H8NaO+8
అణుభారం : 231.11 g/mol

హైడ్రాక్సీసిట్రేట్/హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం ఉపయోగాలు

మార్చు

ఉబకాయం తగ్గించుటలో

మార్చు
  • 1.బరువు తగ్గుదల:99 మంది స్థూలకాయులపై జరిపిన క్లినికల్ ట్రయల్‌లో, గార్సినియా కంబోజియా బరువు తగ్గించే మందు (orlistat), BMI, బొడ్డు కొవ్వు, చర్మం కింద మొత్తం కొవ్వు మరియు నడుము చుట్టుకొలతను 3 నెలల్లో తగ్గించింది.[9]
  • 2.దాదాపు 150 మంది అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పెద్దలపై 8 వారాల రెండు అధ్యయనాలలో, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ శరీర బరువు మరియు BMI 5%-6% తగ్గింది.[10]

రక్త కొవ్వులను తగ్గించుటలో

మార్చు
  • 1.82 మంది ఊబకాయం ఉన్న పెద్దలపై 8 వారాల అధ్యయనంలో, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ LDL-కొలెస్ట్రాల్ స్థాయిలను 12.9% తగ్గించింది మరియు ట్రైగ్లిజరైడ్స్ 6.9% తగ్గింది, అయితే HDL-కొలెస్ట్రాల్‌ను 8.9% పెంచుతుంది.[11]
  • 2.35 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై 8 వారాల అధ్యయనంలో, గార్సినియా కాంబోజియా కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను ప్లేసిబ్ కంటే మెరుగ్గా తగ్గించింది.[12]

ఆకలిని తగ్గించడం

మార్చు
  • 1.24 మంది అధిక బరువు గల పెద్దలపై 6 వారాల అధ్యయనంలో, గార్సినియా కంబోజియాలో ప్రధాన భాగం అయిన హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్, సంతృప్తి అనుభూతిని కొనసాగించేటప్పుడు ఆహార వినియోగాన్ని తగ్గించింది.[13]

మధుమేహం నియంత్రణ

మార్చు

టైప్ 2 డయాబెటిస్ ఉన్న 8 మంది రోగులలో హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ ప్రభావం చూపలేదు, అయితే 12 మంది ఆరోగ్యకరమైన పెద్దలలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించింది.[14]

హైడ్రాక్సీసిట్రేట్/హైడ్రాక్సీ సిట్రిక్ఆ మ్లం(హెచ్‌సిఎ) సురక్షితమేనా?

మార్చు

గార్సినియా కంబోజియా మరియు హెచ్‌సిఎ సప్లిమెంట్‌లు సురక్షితమైనవని కొన్ని పరిశోధనలు నిరూపించినప్పటికీ, సప్లిమెంట్ యొక్క అధిక మోతాదులను తీసుకోవడం వల్ల విషపూరితం ఉన్నట్లు నివేదికలు వచ్చాయి.873 మంది వ్యక్తులతో చెసిన17 అధ్యయనాల సమీక్ష లో, రోజుకు 2,800 mg మోతాదులో HCA ప్రతికూల ప్రభావాలను కలిగించలేదని నిర్ధారించింది.[15]అయినప్పటికీ, గార్సినియా కంబోజియా సప్లిమెంట్స్ కాలేయ వైఫల్యం మరియు ఇతర ప్రతికూల ప్రభావాలతో ముడిపడి ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలలో తెలింది.34 ఏళ్ల వ్యక్తి 5 నెలల పాటు గార్సినియా కాంబోజియా సారాన్ని కలిగి ఉన్న 2,400 మి.గ్రా. తీసుకున్నప్పుడు తీవ్రమైన ఔషధ ప్రేరిత కాలేయ వైఫల్యాన్ని అనుభవించాడు కిడ్నిమార్పిడి అవసరం అయ్యింది.[16]

మూలాలు

మార్చు
  1. September 2015 | IJIRT | Volume 2 Issue 4 | ISSN: 2349-6002.E. A. H. E. Edirisinghe, S. B. Nawarathna, R. A. U. J. Marapana, J. Jaysinghe Department of Food Science and Technology, Faculty of Applied Sciences, University of Sri Jayewardenepura, Gangodawila, Nugegoda, Sri Lanka.(EXTRACTION, CRYSTALLIZATION, PRESERVTION, PELLETIZING AND QUANTIFICATION OF HYDROXY CITRIC ACID FROM GARCINIA CAMBOGIA)
  2. "Does Garcinia Cambogia Work?". healthline.com. Retrieved 2024-02-05.
  3. "Medicinal Potential of Garcinia Species and Their Compounds". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-25.
  4. "A comprehensive scientific overview of Garcinia cambogia". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-25.
  5. "Collection and Characterisation of Malabar Tamarind [Garcinia cambogia (Gaertn.) Desr.]". link.springer.co. Retrieved 2024-02-25.
  6. "Method for extracting and purifying hydroxycitric acid from garcinia cambogia". patents.google.com. Retrieved 2024-02-26.
  7. Jena, BS; Jayaprakasha, GK; Singh, RP; Sakariah, KK (2002-01-02). "Chemistry and biochemistry of (-)-hydroxycitric acid from Garcinia". Journal of Agricultural and Food Chemistry. 50 (1): 10–22. doi:10.1021/jf010753k. PMID 11754536.
  8. "(-)-Hydroxycitrate". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-05.
  9. "Effect of orlistat alone or in combination with Garcinia cambogia on visceral adiposity index in obese patients". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  10. "Effects of a natural extract of (-)-hydroxycitric acid (HCA-SX) and a combination of HCA-SX plus niacin-bound chromium and Gymnema sylvestre extract on weight loss". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  11. "Efficacy of a novel calcium/potassium salt of (-)-hydroxycitric acid in weight control". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  12. "Control of obesity with Garcinia cambogia extract". researchgate.net. Retrieved 2024-02-26.
  13. "The effect of (-)-hydroxycitrate on energy intake and satiety in overweight humans". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  14. "Effects of intraduodenal hydroxycitrate on glucose absorption". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  15. "In Vitro and In Vivo Toxicity of Garcinia or Hydroxycitric Acid: A Review". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.
  16. "Dangerous dietary supplements: Garcinia cambogia-associated hepatic failure requiring transplantation". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-26.