వెండి లేదా రజతం (ఆంగ్లం: Silver) ఒక తెల్లని లోహము, రసాయన మూలకము. దీని సంకేతం Ag (ప్రాచీన గ్రీకు: ἀργήεντος - argēentos - argēeis, "white, shining), పరమాణు సంఖ్య (Atomic number) 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము (Transition metal). దీనికి విద్యుత్, ఉష్ణ ప్రవాహ సామర్ద్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను, ఇతర మూలకాలతో అర్జెంటైట్ (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.

వెండి,  47Ag
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరుlustrous white metal
ప్రామాణిక అణు భారం (Ar, standard)107.8682(2)[1]
ఆవర్తన పట్టికలో వెండి
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Cu

Ag

Au
పల్లాడియంవెండికాడ్మియం
పరమాణు సంఖ్య (Z)47
గ్రూపుగ్రూపు 11
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10 5s1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18, 1
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1234.93 K ​(961.78 °C, ​1763.2 °F)
మరుగు స్థానం2435 K ​(2162 °C, ​3924 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)10.49 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు9.320 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
11.28 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
250.58 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.350 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1283 1413 1575 1782 2055 2433
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు1, 2, 3 (amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.93
పరమాణు వ్యాసార్థంempirical: 144 pm
సమయోజనీయ వ్యాసార్థం145±5 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం172 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Face-centered cubic crystal structure for వెండి
Speed of sound thin rod2680 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం18.9 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత429 W/(m·K)
థెర్మల్ డిప్యూసివిటీ174 mm2/s (at 300 K)
విద్యుత్ విశిష్ట నిరోధం15.87 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[2]
యంగ్ గుణకం83 GPa
షేర్ గుణకం30 GPa
బల్క్ గుణకం100 GPa
పాయిసన్ నిష్పత్తి0.37
మోహ్స్ కఠినత్వం2.5
వికర్స్ కఠినత్వం251 MPa
బ్రినెల్ కఠినత్వం206 MPa
CAS సంఖ్య7440-22-4
చరిత్ర
ఆవిష్కరణbefore 5000 BC
వెండి ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
105Ag syn 41.2 d ε - 105Pd
γ 0.344, 0.280,
0.644, 0.443
-
106mAg syn 8.28 d ε - 106Pd
γ 0.511, 0.717,
1.045, 0.450
-
107Ag 51.839% - (SF) <20.512
108mAg syn 418 y ε - 108Pd
IT 0.109 108Ag
γ 0.433, 0.614,
0.722
-
109Ag 48.161% - (SF) <19.241
111Ag syn 7.45 d β 1.036, 0.694 111Cd
γ 0.342 -
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

స్థూల సమీక్షసవరించు

వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నది[3] .

రసాయన శాస్త్రవేత్తలు వెండిని పరివర్తన లోహంగా గుర్తించారు.పరివర్తన మూలకాలు/ లోహాలు అనేవి మూలకాల ఆవర్తన పట్టికలో గ్రూప్ 2, 13 మధ్యలో ఉన్న లోహములకాలు .40 కి పైగా మూలకాలు లోహాలు .ఇవన్నియు పైన పేర్కొన్నపరివర్తన మూలకాలు/ లోహలకు చెందినవే. వెండిని విలువైన లోహంగా గుర్తింపు పొందిన మూలకం.సాధారణంగా విలువైన లోహాలు భూమిలో సంమృద్దిగా లభించవు. తక్కువ పరిమాణంలో ఉండును. విలువైన రకానికి చెందిన మూలకాలు ఆకర్షణియంగా ఉంటాయి .కాని రసాయనికంగా అంతగా చురుకైన చర్యాశీలతను ప్రదర్శించవు.ఆవర్తన పట్టికలో వెండికి సమీపంలో ఉన్నములాకాల అరడజను వరకు వెలువైన మూలకాలే, అవి బంగారం, ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇండియం లు[4].

తొలి గుర్తింపు –నామకరణంసవరించు

క్రీ.పూ .5000 సంవత్సరాల నాటికే మానవుడు వెండిని కనుగోనినట్లుగా ఆధారాలున్నాయి . చాలా అరుదుగా వెండి రూపంలో లభిస్తుంది. మిగిలినది ముడిఖనిజంగా లభ్యము అవుతుంది.మానవుడు వెండిని తొలుతగా బంగారం, రాగి లోహాల గుర్తింపు తరువాత కనుగొన్నట్లుగా తెలుస్తున్నది. ఆరెండు లోహాలు ప్రకృతిలో తరచుగా లోహాలుగా లభించడంతో మొదటగా వాటినిగురించి తెలుసుకోవడం సులభమైనది.అంతేకాక ఆరెండు లోహాల విశిష్టమైన, నిర్దుష్టంగా కనిపించే రంగులు కారణమై ఉండవచ్చును. పురాతన వస్తు పరిశోధకులు, ఈజిప్టు త్రవ్వకాలలో క్రీ.పూ .35 00 నాటికి చెందిన ఆభరణాలను కనుగోనటం జరిగింది.

క్రీ.పూ .3000 నాటికి సీసం నుండి వెండిని వేరుచేయడం మానవుడు తెలుసుకొన్నాడు .సిల్వరు (silver ) అనేపదం ఆంగ్లో-సక్సోను పదమైన siolfur (అనగా silver ) నుండి ఏర్పడినది[5].

సంస్కృతిసవరించు

ఇతర జాతుల సంస్కృతులలో కుడా వెండియొక్క ప్రస్తావన ఉంది. ఇండియాలో క్రీ.పూ 900 సం.నాటికి వాడుకలో ఉంది. యూరోపియన్‌లు మొదటిసారిగా అమెరికా వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ వెండి వాడకంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది . క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌లో పలుమార్లు వెండిని గురించిన ప్రస్తావన ఉంది. వెండిని వస్తువుల అమ్మకం, కొనుగోలు సమయంలో మారకంగా వినియోగించడం జరిగింది. వెండితో దేవాలయాలను, ప్రదేశాలను, ప్రముఖమైన భవనాలను అలకరిస్తారు. హిందూదేవతల విగ్రహాలను వెండితో చేసి పూజిస్తారు. దేవతా అర్చనా పాత్రలను కూడా వెండితో చెయ్యుదురు. బైబిల్‌లో కొన్ని విబాగంలలో వెండిని తయారు చేసే పద్ధతులను కుడా వర్ణించారు. ఈ లోహంనకు Silver అనేపేరు 12 వ శతాబ్దిలో వచ్చినట్లు తెలుస్తున్నది. ఇది పాత ఆంగ్ల పదం. ఇక దిని సంకేత అక్షరమును లాటిన్ పదం ‘Argentum’ నుండి తీసుకోవటం జరిగింది. argos అనగా మెరయుచున్న లేదా తెల్లని అని అర్థం.

భౌతిక లక్షణాలు[5]సవరించు

వెండిని అతి పలుచని రేకులుగా, తీగెలుగా అతి సులుగుగా సాగాగొట్ట వచ్చును.వెండి ఒక రసాయనిక మూలకం.ఒకలోహం.

భౌతిక గుణము విలువ
సంకేత అక్షరము Ag
ఎలక్ట్రానుల విన్యాసం [Kr] 4d^10 5s^1
ద్రవీభవన ఉష్ణోగ్రత 961.8 °C
పరమాణు సంఖ్య 47
మరుగు ఉష్ణోగ్రత 2,162 °C
మొదటిగా గుర్తించినది 5000 BC
పరమాణు ద్రవ్య రాశి 107.8682 u
వెండి యొక్క సాంద్రత 10.4 9 gms /cm3
భౌతిక స్థితి ఘనస్థితి 298K వద్ద
మొలారు ఘనపరిమాణం 10.27 cm3
ఉష్ణవాహకతత్వవిలువ 430 W m‑1 K‑1

రసాయనిక లక్షణాలుసవరించు

వెండి రసాయనికంగా చురుకైన లోహం కాదు . ఇది గాలిలోని ఆమ్లజనితో చర్య నొందదు . చాలా నెమ్మదిగా గాలి సమక్షములో గంధకంతో చర్య వలన నల్లని సిల్వరు సల్ఫైడు (AgS) అనే సమ్మేళనం ఏర్పడును. నీరు, ఆమ్లాలతో, పలుసమ్మేళనాలతో వెండి క్రియా/చర్యారహితంగా ఉంటుంది. నత్రజని, ఉదజని తోకూడా చర్యారహితంగా ఉండును., దహింప బడదు.వెండి నత్రికామ్లం, వేడి గాఢ సల్ప్యూరిక్ ఆమ్లం త్వరగా కరుగుతుంది. వెండి ద్రవస్థితిలో తనభారానికి 22 రెట్లు భారమున్న ఆక్సిజన్ ను తనలో కరగించు కుంటుంది. ఘనీభవించునప్పుడు గ్రహించిన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఆక్షీకరణ చేయు ఆమ్లాలలో కుడా కరుగుతుంది .అలాగే సైనైడ్ కలిగిన ద్రవాలలో కుడా వెండి కరుగుతుంది .సైనైడులో వెండిని కరగించి నప్పుడు డైసైనో అర్జెన్ టేట్[Ag (CN)2]−, అనే అయానులు ఏర్పడును.

వెండి ఒజోను, హైడ్రోజను సల్పైడు, సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోవును.

ఐసోటోపులు(isotopes)సవరించు

పరమాణువు లోని ప్రోటాను, న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల ఎ మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోపుల అంటారు. Ag 107, Ag109 అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోపులు[4].

వెండి యొక్క సమ్మేళన పదార్థాలుసవరించు

వెండిని కొన్ని ఇతర ములకాలతో కలిపనచో ఏర్పడు సమ్మేళన పదార్థాలు[6]

ఫ్లోరైడులు
క్లోరైడులు
 • సిల్వరు క్లోరైడు: AgCl
బ్రోమైడులు
 • సిల్వరు బ్రోమైడు: AgBr
అయోడైడులు
 • సిల్వరు అయోడైడు:AgI
ఆక్సైడులు
 • సిల్వరు ఆక్సైడు:AgO
 • డై సిల్వరు ఆక్సైడు:Ag2O
సల్ఫైడులు
 • డైసిల్వరు సల్ఫైడు: Ag2S

ఆరోగ్యం పై ప్రభావంసవరించు

వెండి కొంచెం విష ప్రభావం కలిగిన మూలకం. వెండి లేదా వెండి యొక్క సమ్మేళన పదార్థాలు చర్మంపై నీలి మచ్చలను కల్గించే ఆవకాశం ఉంది.వెండి ధూళిని (dust) పీల్చినచో శ్వాస పరమైన అనారోగ్యం ఏర్పడే ప్రమాదం ఉంది.

వనరులు-లభ్యతసవరించు

భూమి పొరలలో వెండి 0 .1 ppm పరిమాణంలో ఉంది. సముద్ర జలాల్లో కుడా వెండి ఉంది.సముద్ర జలంలో వెండి లభించు పరిమాణం 0 .0 1 ppm . భూమిలో వెండి ఇతర లోహ ఖనిజాలతో కలిసి లభిస్తుంది .ఎక్కువగా అర్జెంటైట్ (AgS) గా దొరకుతుంది.అలాగే Ag Cl,3Ag2As2s3, Ag 2 S○ Sb 2 S3గా లభిస్తుంది. ప్రపంచంలో భారీగా వెండి మెక్సికో, పెరు, సంయుక్త రాష్ట్రాలు, కెనడా, పోలాండు, చిలి, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి చేయబడుచున్నది. పెద్ద మొత్తంలో వెండిని ఉత్పత్తి చెయ్యు రాష్ట్రాలు అమెరికాలో నినెవడా, ఇడహో, ఆరిజోనాలు.అమెరికా ఉత్పత్తిలో 2 /3 వంతు ఈ మూడు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అగుచున్నది.

వెండి వినియోగంసవరించు

అమెరికాలో ఉత్పత్తి అయ్యిన వెండిలో 10 % వరకు నాణేలు, ఆభరణాల తయారీలో వాడెదరు. ఆభరణాల తయారీలో బంగారంలో వెండిని మిశ్రమ ధాతువుగా వాడెదరు. బంగారంలో కలపడం వలన వెండికి దృఢత్వం పెరుగుతుంది.పోటోగ్రాప్ ఫిల్ముల మీద పూతగా వెండి యొక్క సమ్మేళనంలను వాడెదరు.

సిల్వరు అయోడైడును కృత్తిమ వర్షం కురుపించే టందుకు ఉపయోగిస్తారు[5].

వెండిని ప్రింటెడ్ ఎలక్ట్రికల్ సర్కూట్ బోర్డులను తయారుచేయుటకు ఉపయోగిస్తారు[7]

ఉత్తమ గుణమట్టానికి చెందిన దర్పణాలను తయారుచేయుటకు వెండిని ఉపయోగిస్తారు[8]

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
 2. Magnetic susceptibility of the elements and inorganic compounds in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
 3. "Chemical properties of silver". lenntech.com. Retrieved 2015-03-13.
 4. 4.0 4.1 "SILVER". chemistryexplained.com. Retrieved 2013-03-13.
 5. 5.0 5.1 5.2 "Silver: the essentials". webelements.com. Retrieved 2015-03-03.
 6. "Silver: compounds information". webelements.com. Retrieved 2015-03-13.
 7. "Properties, uses, and occurrence". britannica.com. Retrieved 2015-03-13.
 8. "Silver Element Facts". chemicool.com. Retrieved 2015-03-13.

యితర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వెండి&oldid=3429211" నుండి వెలికితీశారు