హైడ్రోఫైల్ అనగా గ్రీకు భాషలో నీటిని ప్రేమించునది అని అర్థం. అంటే ఏదైనా అణువు లేక అణుసమూహం నీటికి ఆకర్షించబడి దానిలో కరిగినచో దానిని హైడ్రోఫైల్ అంటారు.[1]

హైడ్రోఫైల్ అయిన అణువులు సవరించు

ఏదైనా అణువు నీటికి ఆకర్షించబడే లేక దానిలో కరిగే స్వభావం ఉన్న వాటిని హైడ్రోఫైల్ అంటారు. ఈ పదార్థాలకు గాలిలో నుంచి నీటిని లాక్కునే స్వభావం ఉంటుంది.[2][3] ఉదా: పంచదార, ఉప్పు మొ|| ఉష్ణగతిక ప్రకారం అనుకూలం కావున ఇవి నీటిలోనే కాకుండా మిగతా ధ్రువ పదార్థాలలో కూడా కరుగుతాయి. కణ పొరల్లో కూడా హైడ్రోఫిలిక్, హైడ్రోఫోభిక్ భాగాలు ఉంటాయి. వీటిలో ఛార్జ్ ధ్రువీకరణ జరుగుట వలన, దాని వలన హైడ్రోజన్ బంధం జరిగే అవకాశం ఉండుట వలన ఇవి నీటిలో, ఇతర పోలార్ పదార్థాలలో కరుగుతాయి కానీ నూనె మొ|| పదార్థాలలో కరగవు. కాబట్టి హైడ్రోఫిలిక్, హైడ్రోఫోభిక్ పదార్థాలను పోలార్, నాన్ పోలార్ పదార్థాలు అని కూడా అనుదురు. అయినప్పటికీ కొన్ని హైడ్రోఫిలిక్ పదార్థాలు నీటిలో కరగవు. ఈ మిశ్రమాలను “ కొల్లాయిడ్ “ అంటారు. సబ్బులకు మాత్రం ఒక వైపు హైడ్రోఫిలిక్ తల మరియొక వైపు హైడ్రోఫోభిక్ తోక ఉండి నీరు, నూనె రెండీటిలో కలుస్తుంది. “ఒకవేళ ప్రతి 5 కర్బన అణువులకు ఒకటి కన్నా ఎక్కువ న్యుట్రల్ హైడ్రోఫైల్ ఉన్నా లేకపోతే ప్రతి 7 అణువులకు ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ కల హైడ్రోఫైల్ ఉన్నా” ఒక శాతం బరువు కన్నా ఎక్కువ కరుగుతుంది.

హైడ్రోఫిలిక్ కెమికల్స్ సవరించు

ద్రవహైడ్రోఫిలిక్ పదార్థాలను ఘన పదార్థాలను కలపడం ద్వారా మనకు కావాల్సినంత పరిణామములో కరిగేలా చేయవచ్చు.

ద్రవ కెమికల్స్ సవరించు

ఆల్కహాల్స్ సవరించు

ఆల్కహాల్స్ లో (-OH) గ్రూపులు ఉండుట వలన పోలార్ అవుతుంది కానీ కర్బన వరుస వలన నాన్ పోలార్ అవుతుంది. కర్బన వరుస పెరిగే కొద్ది నాన్ పోలార్ స్వభావం తగ్గిపోతుంది. మితనాల్, ప్రొపనాల్ లు నీటిలో కరుగుతాయి కానీ బ్యుటనాల్ కరగదు.[4]

ఘన కెమికల్స్ సవరించు

సైక్లోడెక్స్ట్రిన్స్ సవరించు

హైడ్రోఫోభిక్ అణువులను హోస్ట్లు బంధించదం ద్వారా ఫార్మాస్యూటికల్ సొల్యుశన్స్ తయారుచేయడానికి ఉపయొగిస్తారు. కాబట్టి ఇవి శరీరాల్లోకి చొచ్చుకుపోతాయి, అలా కొన్ని రకాల కెమికల్స్ విడుదల కావడానికి ఉపయొగపడుతుంది. ఉదా: జోసఫ్ పిత స్టడీలో టెస్టొస్టిరోన్ని HPBCDతో కలపడము ద్వారా 95% టెస్టొస్టిరాన్ పీల్చుకుంటుంది. లేకపోతే 40% మాత్రమే పీల్చుకొనబడుతుంది.

హైడ్రోఫిలిక్ పొర వడపోత సవరించు

దీనిని వివిధ ద్రవాలను వడపోయడానికి చాలా పరిశ్రమలలో వాడతారు. దీనిని వైద్య, జీవపరమైన మొ|| శాఖల్లో బాక్టీరియా, వైరస్, ప్రోటీన్, డ్రగ్స్ మొ|| వాటిని వడపోయడానికి ఉపయొగిస్తారు. హైడ్రోఫిలిక్ పదార్థాలకు ఉదా: ప్రత్తి, సెల్యులోస్, కొల్లొయిడ్స్ .

మిగతా విధాల లాగా కాకుండా ఇందులో ఆ పదార్థాలు తడి స్థితిలో ఉండవలసిన అవసరం లేదు. ఎక్కువ భాగం చల్ల ద్రవాలనే వడపోయడానికి ఉపయొగించినా కొత్త పద్ధతుల్లో వేడి ద్రవాలకు కూడా ఉపయొగిస్తున్నారు.

మూలాలు సవరించు

  1. Liddell, H.G. & Scott, R. (1940). A Greek-English Lexicon Oxford: Clarendon Press.[page needed]
  2. IUPAC, Compendium of Chemical Terminology, 2nd ed. (the "Gold Book") (1997). Online corrected version:  (2006–) "hydrophilic".
  3. Merriam-Webster dictionary
  4. http://www.chem.latech.edu/~deddy/chem121/Alcohols.htm[full citation needed][permanent dead link]

ఇతర లింకులు సవరించు