హైడ్రోబ్రోమిక్ ఆమ్లం
హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ఒక బలమైన ఆమ్లం.ద్విపరమాణుయుత (diatomic)హైడ్రోజన్ బ్రోమైడ్ ను నీటిలో కరిగించడంవలన హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ఏర్పడును. హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ద్రవరూప ఆమ్లం. ద్రవ హైడ్రోబ్రోమిక్ ఆమ్లంలో హైడ్రోజన్ బ్రోమైడ్ 47.6%(భారం)ఉన్నది. ఇది 8.89 మోల్ /లీటరుకు కు సమానం.హైడ్రోక్లోరిక్ఆమ్లం కన్న, హైడ్రోబ్రోమిక్ ఆమ్లం బలమైన ఆమ్లం. హైడ్రోక్లోరిక్ఆమ్లంకన్న, హైడ్రోబ్రోమిక్ ఆమ్లం బలమైన ఆమ్లం.హైడ్రోబ్రోమిక్ ఆమ్లంయొక్క pKa విలువ -9.అయితే హైడ్రోబ్రోమిక్ ఆమ్లం, హైడ్రోఅయోడిక్ ఆమ్లంకన్న బలమైనది కాదు.తెలిసిన బలమైన ఖనిజఆమ్లాలలో హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ఒకటి.
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [10035-10-6] |
పబ్ కెమ్ | 260 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-113-0 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:47266 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MW3850000 |
SMILES | Br |
| |
ధర్మములు | |
HBr | |
మోలార్ ద్రవ్యరాశి | 80.91 |
స్వరూపం | colorless/faint yellow liquid |
వాసన | acrid |
సాంద్రత | 1.49 g/cm3 (48% w/w aq.) |
ద్రవీభవన స్థానం | −11 °C (12 °F; 262 K) (47–49% w/w aq.) |
బాష్పీభవన స్థానం | 122 °C (252 °F; 395 K) at 700 mmHg (47–49% w/w aq.) |
221 g/100 mL (0 °C) 204 g/100 mL (15 °C) 130 g/100 mL (100 °C) | |
ఆమ్లత్వం (pKa) | −9[1] |
స్నిగ్ధత | 0.84 cP (-75 °C) |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-36.3 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
198.7 J/K mol |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 29.1 J/K mol |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | ICSC 0282 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R34, R37 |
S-పదబంధాలు | (S1/2), మూస:S7/9, S26, S45 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు
|
Hydrogen bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుహైడ్రోబ్రోమిక్ ఆమ్లం రంగులేని ద్రవం.కొన్ని సందర్భాలలో లేత పసుపు ఛాయలో ఉండును.హైడ్రోబ్రోమిక్ ఆమ్లం అణుభారం 80.91 గ్రాములు/మోల్.ఒకరకమైన ఘాటైన ( acrid) వాసన కల్గి ఉన్నది.సాధారణ ఉష్ణోగ్రత(25°C)వద్ద హైడ్రోబ్రోమిక్ ఆమ్లం యొక్క సాంద్రత 1.49గ్రాములు/సెం.మీ3(48%భారం/భారం,ద్రవస్థితి ).హైడ్రోబ్రోమిక్ ఆమ్లం యొక్క ద్రవీభవన స్థానం −11°C (12°F; 262K) (47–49% w/w aq).హైడ్రోబ్రోమిక్ ఆమ్లం బాష్పీభవన స్థానం 122°C (252°F; 395K)/ 700మి.మీ/పాదరసం వత్తిడిలో (47–49% w/w aq.).హైడ్రోబ్రోమిక్ ఆమ్లం యొక్కస్థిగ్నత 0.84 cP (-75 °C)
హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ద్రావణీయత
మార్చుహైడ్రోబ్రోమిక్ ఆమ్లం నీటిలో కరుగుతుంది. హైడ్రోబ్రోమిక్ ఆమ్లం 0°C వద్ద 100 మి.లీ నీటిలో 221గ్రాములు, 15°C వద్ద 204గ్రాములు, 100°C వద్ద 130 గ్రాములు కరుగుతుంది.
సంశ్లేషణ
మార్చుపరిశోధన /ప్రయోగ శాలలో బ్రోమిన్,సల్ఫర్ డయాక్సైడ్, నీటిని చర్య చెందించడం ద్వారా ఉత్పత్తి చేయుదురు.
- Br2 + SO2 + 2 H2O → H2SO4 + 2 HBr
ప్రయోగశాలలో ఉత్పత్తి అగు హైడ్రోబ్రోమిక్ ఆమ్లం అనార్ద్రరూపంలో ఉండును. దీనికి నీటిలో కరిగించి ద్రవంగా మార్చెదరు.
వాణిజ్య అవసర నిమిత్తం ,పారిశ్రామికం గా బ్రోమిన్‌ను సల్ఫర్ లేదా భాస్వరం, నీటి మధ్య రసాయనచర్య ద్వారా హైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు.విద్యుద్విశ్లేష్య (electrolytically) విధానంగా కూడా హైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును.అఆక్సీకరణ/ఆక్సీకరణలుప్త (non-oxidising)ఆమ్లాలైన ఫాస్పారిక్ ఆమ్లం,అసిటిక్ ఆమ్లం వంటి వాటితో బ్రోమైడులను చర్య జరిపించడం వలన కూడా హైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు.
ప్రత్నామ్యాయంగాసజల(5.8M)సల్ఫ్యూరిక్ఆమ్లం, పొటాషియంల రసాయనచర్య వలన కూడా హైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు.
- H2SO4 + KBr → KHSO4 + HBr
ఎక్కువ గాఢత కల్గిన సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం వలన, ద్రావణ ఉష్ణోగ్రత 75°C దాటినపుడు హైడ్రోబ్రోమిక్ ఆమ్లం ఆక్సీకరణవలన బ్రోమిన్ వాయువుగా మారుతుంది. వ్యాపార పరంగా హైడ్రోబ్రోమిక్ ఆమ్లంవివిధ గాఢతలలో,నాణ్యతలో లభిస్తుంది.
ఉపయోగాలు
మార్చుహైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్నిప్రధానంగా ఇతర అకర్బన బ్రోమైడ్ రసాయన పదార్థాలను ఉత్పత్తి కావించుటకై వినియోగిస్తారు. ప్రత్యేకంగా జింకు,కాల్షియం, సోడియం లకు చెందిన బ్రోమైడ్ రసాయన పదార్థాలను ఉత్పత్తి చెయ్యుటకై ఉపయోగిస్తారు. కొన్ని రకాల ఇథరులను హైడ్రోబ్రోమిక్ ఆమ్లంద్వారా విడగొట్టం జరుగుచున్నది.కొన్నిరకాల ఆర్గాన్ బ్రోమిన్ సమ్మేళనాలను ఉత్పత్తి చేయుటకు రసాయన కారకంగా పనిచేయును. కొన్ని రకాల ఖనిజాలను అల్కహలైసన్ (alkylation)కావించుటకు ఉత్ప్రేరకంగా పనిచేయును. పారిశ్రామికంగా అలైల్ బ్రోమైడ్, టెట్రాబ్రోమోబిస్(ఫెనాల్), బ్రోమోఅసిటిక్ ఆసిడ్ వంటి వాటిని హైడ్రోబ్రోమిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి కావింతురు.ఉత్పత్తి అయిన హైడ్రోబ్రోమిక్ ఆమ్లంను వడబోత కావించి KHSO4 ను వేరు చేసి, ఆమ్ల గాఢత 85% వచ్చు వరకు ఆమ్ల ద్రవాన్నిస్వేదన క్రియకు లోను కావించెదరు.
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ Bell, R.P. The Proton in Chemistry, 2nd ed., Cornell University Press, Ithaca, NY, 1973.