హైదరాబాదీ ముత్యాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో లభించే ముత్యాలు.

హైదరాబాదీ ముత్యాలు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో లభించే ముత్యాలు. ఈ నగరం భారతదేశంలోని ముత్యాల ప్రధాన వ్యాపార కేంద్రంలో ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ నగరాన్ని "ముత్యాల నగరం" అని కూడా అంటారు.[1] హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్న చందంపేట్ గ్రామంలోని దాదాపు మొత్తం జనాభా ముత్యాలను తయారుచేసే వృత్తిలో ఉన్నారు. తరతరాల నైపుణ్యం కలిగిన ఈ గ్రామం సమీపంలోని హైదరాబాదు నగరం భారతదేశంలో అతిపెద్ద పెర్ల్ డ్రిల్లింగ్ ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది.

సత్లాడ అనే సంప్రదాయ హైదరాబాదీ హారంలో 400 కంటే ఎక్కువ ముత్యాలు ఉన్నాయి.

చరిత్ర మార్చు

మెరిసే ఆభరణాల పట్ల ఇష్టం ఉన్న కుతుబ్ షాహీ రాజులు, అసఫ్ జాహీల ప్రోత్సాహంతో హైదరాబాదు నగరంలో ముత్యాల పరిశ్రమ అభివృద్ధి చెందింది.[2] రాచరిక వ్యవస్థ సాంప్రదాయక రీగాలియాలో మాత్రమే కాకుండా ముత్యాలకు స్వస్థతని, అందాన్ని కలిగించే లక్షణాలను ఉన్నాయని కొందరి నమ్మకం. యువరాణులు వారి పుట్టినరోజుల సమయంలో వారి ముత్యాలను ధరించేవారిని, నిజాంరాజులలో అత్యంత ధనవంతుడిగా పరిగణించబడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజభవనాల బేస్‌మెంట్‌లో ముత్యాల బస్తాలను నిల్వ చేసినట్లు చెబుతారు.[3]

హైదరాబాదులో ముత్యాల వ్యాపారానికి ముందు, ఇరాక్‌లోని బాస్రా నుండి ముత్యాలను సేకరించేవారు. ఈ నగరం నుండి వచ్చిన ముత్యాలు మృదువుగా, తక్కువ నాణ్యతలో ఉండేవి.[4] చమురు ఆవిష్కరణ తరువాత చమురు పరిశ్రమ స్థాపన వల్ల పెర్షియన్ గల్ఫ్‌ను కలుషితమై, బాస్రాలో ముత్యాల వ్యాపారం క్షీణించింది. దాంతో ముత్యాల వ్యాపారులు హైదరాబాదు నగరం వైపు ఆకర్షితులయ్యారు. శతాబ్దాల క్రితమే బాస్రా నుండి చాలామంది ముత్యాల కళాకారులు కూడా హైదరాబాదు వలస వెళ్ళారు.[2]

తయారీ మార్చు

ముత్యాలను డ్రిల్లింగ్ చేసిన తర్వాత, వాటిని బ్లీచింగ్ చేయడానికి, వాటిమీదున్న ముదురు రంగును తొలగించడానికి సుమారు నాలుగు రోజులు ఉడకబెట్టబడుతారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, నీరు, ఈథర్ కలిగిన గాజు సీసాలలో ఉంచుతారు. వాటిని అద్దం బేస్‌తో గ్లాస్ సన్ బాక్స్‌లలో నాలుగు లేదా ఐదు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తరువాత ఆకారాలు, పరిమాణాలను బట్టి వేరుచేస్తారు.[5]

ముత్యాలు రంగు ప్రకారం కూడా గ్రేడ్ చేయబడతాయి. గులాబీ ముత్యాలు, నల్ల ముత్యాలు నాణ్యమైనవిగా పరిగణించబడుతున్నప్పటికీ, తెల్ల ముత్యాలు సాంప్రదాయకంగా అత్యంత ప్రాచుర్యం పొందాయి. మంచి నాణ్యమైన తెల్లని ముత్యం అతినీలలోహిత కాంతి కింద ఒక అందమైన ఆకాశ నీలం రంగును ప్రతిబింబిస్తుంది. నాణ్యత లేనిది ఆకుపచ్చ లేదా ఆవపిండి రంగును కలిగి ఉంటుంది. ఆకుపచ్చ మెరిసే నల్లని ముత్యాలు, రంగుల హరివిల్లును ప్రతిబింబించే బరోక్ (క్రమరహిత ఆకారంలో) ముత్యాలు కూడా అత్యంత విలువైన రకాల్లో ఒకటి. నలుపు, గులాబీ ముత్యాలు కూడా అరుదైనవి, అందమైనవి. అయితే, చాలా సాంప్రదాయ హైదరాబాదు నగలు తెల్లని ముత్యాలతో తయారు చేయబడ్డాయి.[5]

ముత్యాల తయారీదారులు ప్రాసెస్ చేయబడిన ముత్యాలను యూరప్, యుఎస్‌లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ నుండి వచ్చే డబ్బుతో ఆధునిక శుద్ధీకరణ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. థర్మోఫిల్స్‌లో ఉండే ఎంజైమ్‌లను ఉపయోగించే పరికరాలు ముత్యాలను శుద్ధి చేసే ప్రక్రియను గణనీయంగా మెరుగుపరుస్తాయి.[5]

మూలాలు మార్చు

  1. "హైదరాబాద్ జిల్లా". www.hyderabad.telangana.gov.in. Retrieved 13 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Telangana Tourism - Visit for all reasons & all seasons" (in ఇంగ్లీష్). Archived from the original on 27 ఆగస్టు 2018. Retrieved 13 September 2021.
  3. Dobbie, Aline (2006). India: The Elephant's Blessing. Cambridgeshire: Melrose Press Limited. pp. 21. ISBN 1905226853.
  4. Johari, Harish (1996). The Healing Power of Gemstones: In Tantra, Ayurveda, and Astrology. Rochester, VT: Destiny Books. p. 72. ISBN 9780892816088.
  5. 5.0 5.1 5.2 Werner, Louis (1998). "City of Pearls". Saudi Aramco. Archived from the original on 10 మే 2013. Retrieved 13 September 2021.

బయటి లింకులు మార్చు