హైదరాబాద్ క్రికెట్ జట్టు (పాకిస్థాన్)

పాకిస్తాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు
(హైదరాబాదు క్రికెట్ జట్టు (పాకిస్తాన్) నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాద్ క్రికెట్ జట్టు (పాకిస్థాన్) అనేది పాకిస్తాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. పాకిస్తాన్ లోని సింధ్, హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ ఉన్న నియాజ్ స్టేడియం అనేది వారి సొంత మైదానం. ఈ జట్టు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీలో పాల్గొంటారు. నేషనల్ టీ20 కప్, నేషనల్ వన్-డే ఛాంపియన్‌షిప్‌లో ట్వంటీ 20, లిస్ట్ ఎ క్రికెట్ టోర్నమెంట్‌లను హైదరాబాద్ హాక్స్ అని పిలుస్తారు.

హైదరాబాద్ క్రికెట్ జట్టు (పాకిస్థాన్)
cricket team
క్రీడక్రికెట్ మార్చు
దేశంపాకిస్తాన్ మార్చు

చరిత్ర

మార్చు

హైదరాబాద్ 1958-59లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి 2015-16 వరకు చాలా సీజన్లలో ఆడింది. 2013-14 సీజన్ ముగిసే సమయానికి వారు 177 మ్యాచ్‌లు ఆడారు, ఇందులో 24 విజయాలు, 90 ఓటములు, 63 డ్రాలు ఉన్నాయి.[1] సాధారణంగా బలహీనమైన పాకిస్తాన్ జట్లలో ఒకటి. 1968-69లో క్వాయిడ్-ఐ-అజామ్ ట్రోఫీలో క్వార్టర్-ఫైనల్‌కు, 1971-72లో బిసిసిపి ట్రోఫీలో క్వార్టర్-ఫైనల్‌కు, 2005-06లో క్వాయిడ్-ఐ-అజామ్ ట్రోఫీ సిల్వర్ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు.[2]

1973-74లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌పై బషీర్ షానా చేసిన వారి అత్యధిక వ్యక్తిగత స్కోరు 208.[3] 1964-65లో హైదరాబాద్ ఎడ్యుకేషన్ బోర్డ్‌పై మక్సూద్ హుస్సేన్ 50 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం వారి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[4] అదే మ్యాచ్‌లో హుస్సేన్ 91 పరుగులకు 13 వికెట్లు తీయడం, హైదరాబాద్ అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలుగా ఉన్నాయి.[5]

ఇతర జట్లు

మార్చు

1969-70లో హైదరాబాద్ వైట్స్, హైదరాబాద్ బ్లూస్ అనే రెండు జట్లను హైదరాబాద్ రంగంలోకి దించింది. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ప్రతి జట్టు రెండు మ్యాచ్‌లు ఆడింది. హైదరాబాద్ వైట్స్ తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా,[6] హైదరాబాద్ బ్లూస్ ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.[7]

మూలాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు