హైదరాబాదు దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ
హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ
హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉంది.
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | పొగాకు |
స్థాపన | 1930 |
స్థాపకుడు | జనాబ్ మొహమ్మద్ అబ్దుస్ సత్తార్ |
విధి | వాడుకలో ఉంది |
ఉత్పత్తులు | పొగాకు |
బ్రాండ్లు | గోల్కొండ, అమర్ |
చరిత్ర
మార్చుజనాబ్ మొహమ్మద్ అబ్దుస్ సత్తార్ అనే వ్యక్తి 1930లో ఈ ఫ్యాక్టరీని స్థాపించాడు. గోల్కొండ ఫ్యాక్టరీ అని కూడా పిలువబడే ఈ ఫ్యాక్టరీలో గోల్కొండ బ్రాండ్ సిగరెట్ ని తయారుచేసేవారు. ఈ సంస్థ తయారుచేసిన బ్రాండ్ పేరుమీదుగా గోల్కొండ ఎక్స్ రోడ్స్ పేరు పెట్టారు. గోల్కొండ బ్రాండ్, అమర్ బ్రాండ్ సిగరెట్లను తయారుచేసిన ఈ ఫ్యాక్టరీ, ప్రస్తుతం ఐటిసి లిమిటెడ్ సంస్థకు సిగరెట్ల కాంట్రాక్ట్ తయారీదారుగా ఉంది.[1][2]
ఇతర వివరాలు
మార్చు1946 నుండి ఫ్యాక్టరీని సత్తార్ అల్లుడు షా ఆలం ఖాన్ నడుపుతున్నాడు.[3] 1972 సెప్టెంబరులో ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు సంస్థగా మార్చబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ Rathor, Swati (2017-07-27). "Badshahs of smoke: History of another bygone Golconda". Times of India. Hyderabad. Retrieved 2021-07-01.
- ↑ C. S. G., Krishnamacharyulu (2011). Rural Marketing: Text and Cases. Pearson Education India. p. 229. ISBN 9788177589764.
- ↑ "Educationist & industrialist Nawab Shah Alam Khan no more". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2017-10-24. Retrieved 2021-07-01.
- ↑ "HYDERABAD DECCAN CIGARETTE FACTORY PVT LTD". ZaubaCorp. Retrieved 2021-07-01.