హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం)

హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం) నిజాం నవాబులనే పేరుతో ప్రఖ్యాతులైన హైదరాబాద్ రాజ్య పూర్వ పరిపాలకులు ఆసిఫ్ జాహీ వంశీకుల గురించి వివరించే చారిత్రిక గ్రంథం. ఎమెస్కో సంస్థ ప్రచురించిన ఈ అనువాద గ్రంథానికి ఆంగ్లమూలం రచించినవారు రచయిత రాజేంద్రప్రసాద్. పలువురు అనువాదకులు ఆంగ్లమూలం నుంచి ఈ గ్రంథాన్ని అనువదించారు.

హైదరాబాదు నిజాం నవాబులు:ఆసఫ్ జాహీల ఉత్థాన పతనాల కథ
కృతికర్త: రాజేంద్ర ప్రసాద్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): The Asif Jahs of Hyderabad:Their rise and decline
సంపాదకులు: డా. డి.చంద్రశేఖరరెడ్డి
ముద్రణల సంఖ్య: 2
దేశం: భారత దేశం
భాష: అనువాదం: తెలుగు
మూలం:ఆంగ్లం
ప్రక్రియ: చరిత్ర గ్రంథం
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల: డిసెంబర్ 2011
పేజీలు: 373

రచన నేపథ్యం

మార్చు

హైదరాబాదు నిజాం నవాబులు:అసఫ్ జాహీల ఉత్థాన పతనాల కథ అనే అనువాద గ్రంథానికి ఆంగ్లమూలాన్ని చారిత్రికుడు, రచయిత రాజేంద్ర ప్రసాద్ రచించగా 1984లో తొలి ముద్రణ పొందింది.[1] అనంతర కాలంలో పునశ్చరణ (revison)తో పునర్ముద్రితమైంది. ఈ గ్రంథాన్ని తెలుగులోకి డా.కాకాని చక్రపాని, డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, డా.గోవిందరాజు చక్రధర్, ఆచార్య జి.వెంకటరాజాలు అనువదించగా డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వం వహించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ఈ గ్రంథాన్ని డిసెంబరు 2011, మార్చి 2013ల్లో ప్రచురించారు.[2]

ప్రధానాంశం

మార్చు

ఆసిఫ్ జాహీ వంశస్థులైన నిజాములు హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించడం, ఉత్థానస్థితిని అందుకోవడం, పతనం ప్రారంభమవడం, తుదకు భారత ప్రభుత్వం పోలీసుచర్య ద్వారా రాజ్యం భారతసమాఖ్యలో బేషరతుగా విలీనం కావడం వరకూ జరిగిన చారిత్రిక పరిణామాలను ఈ గ్రంథం పరిశీలిస్తుంది. ఈ పరిణామాల్లో పాలుపంచుకున్న వ్యక్తులందరి చరిత్రనీ వివరిస్తుంది.[3]

గ్రంథంలోని అంశాలు

మార్చు

హైదరాబాదు నిజాంనవాబులు గ్రంథంలోని అధ్యాయాలు, శీర్షికలు ఇవి:[4]

 • తెరలు
రోడ్డుకు చివర - పెద్దవాళ్ళూ-చిన్నవాళ్ళూ - చిల్లర దేవుళ్లు - ఇల్లొదిలి పోయిన కుర్రాడు - దేశీయ ఆదర్శవాది
అనంతకాలం వరకు - పిచ్చి ఆనందం - వ్యాకులత్వం
 • ఐదు రొట్టెలు
శక్తిమంతుడైన ఆసిఫ్ జా - వ్యాజ్యపు దారులు - జారుడు కాళ్ల మిత్రుడు - ఓ అంతర్జాతీయ కలయిక
అంతులేని కుశీదకత్వం - పరతంత్రపు లోతులు - మా విశ్వసనీయ మిత్రుడు - ఒక్కరాత్రి అద్భుతం
 • ఉజ్జ్వల అపర్నాహం - ఆరో రొట్టె
ప్రేమపాత్రుడి రాక - ప్రేమ పాత్రుడు - వివేకి అయిన దివాను - ఆహా!మహబూబ్ - నిమ్నవర్గపు గొంతులు
ఒక ఇతిహాస పురుషుడు - వారి వైభవోపేత జనం - రికార్డర్ పత్రిక నమోదు చేసింది - ఖుషీ ఖుషీగా ఫకీరు
దేశీ దివాను ప్రతిగా ఆర్థికమంత్రి - ఓ భయంకర వరద - ఆరో నిజాముకూ కాలమొచ్చింది - ప్రేమాస్పదుడి నిష్క్రమణ
 • ఏడో రొట్టె
తరువాతి వ్యక్తి ఆగమనం - నిజాంగా రూపుదిద్దుకోటం - సంస్కర్త - నేనే రాజును, నా దివానును నేనే
మహాఘనత వహించిన ప్రభువు - మార్పు ఛాయలు - నిరంకుశుడు - సుపరిపాలన దిశగా
 • అస్థిరత
మాయాదుస్తుల మనిషి - మరింత మార్పు - మేఘాలు కమ్ముకొస్తున్నాయి - ఓ సర్వాధీశా! మీ సారధ్యంలో
ఆర్యసమాజ ప్రవేశం - ఎక్కిళ్ళు, నిట్టూర్పులు... ఇవీ నాయకుడి పెదాలపై నర్తించేవి!
మట్టి గుడిసెలు, మారాజులు, మెత్తటి సేనాపతులు - ప్రేమాభ్యర్థన కారణంగా... - రాత్రికి ఆవల వేకువ
హైదరాబాదుకు ప్రముఖుల రాకపోకలు - బలపడిన సెంటిమెంట్లు
 • వాలుతున్న పొద్దు
అశుభఛాయల నడుమ - వందేమాతరం - వారి ఆత్మ శాంతించుగాక! - పొదుపు చేయాలి
తీవ్ర పరిణామాల మధ్య రాతిగోడ కట్టడం - 1946 - కాలానుగణంగా నడుచుకో - బ్రేక్ అంగ్ బస్ట్ విరామం
అందరూ పోరాటవీరులే
 • సంధ్యాసమయం
నవశక నిర్మాత వైస్రాయ్ - తన సొంత కక్ష్యలో.. - ఓ బీరార్, నా బీరార్ - నేను తోడ్పడేదా?
 • ఉపసంహారం
పోలో మొదలైంది - సంతోషకరమైన యుద్ధం - స్నేహితులుగా ఉందాం - 1948 సెప్టెంబరు 18
 • మలిపలుకు
మూడుచెక్కలు

విశిష్టత

మార్చు

గ్రంథకర్త రాజేంద్రప్రసాద్ అసఫ్ జాహీల చరిత్రపై ఆంగ్లంలో వెలువడ్డ ప్రామాణిక రచనలన్నీ పరిశోధించి సప్రమాణికంగా ఈ గ్రంథాన్ని రచించారు. హైదరాబాద్ చరిత్రపై వచ్చిన గ్రంథాల్లో, ఈ గ్రంథం అత్యంత ప్రామాణికమని మా పరిశీలనలో తేలిందని ప్రముఖ చారిత్రికుడు వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నారు. ఇది ప్రామాణికమని పేర్కొనేందుకు రెండు ప్రాతిపదికలను వారు వివరించారు. రాగద్వేషాలకతీతంగా వస్తుగత దృక్పథంతో రచించడం ఒక ప్రాతిపదికగా, కేవలం తారీఖుల, దస్తావేజుల, చారిత్రిక ఘటనల సమాహారంగా కాక హైద్రాబాదు రాజ్య నేపథ్య వివరణలో ఆంగ్లేయుల ఆధిపత్యం, అంతర్గత ఒత్తిళ్ళు, ఘర్షణలు, 1947 తర్వాత సంస్థానం విలీనంలో పెక్కుకోణాలు సునిశితంగా వర్ణించడం మరో ప్రాతిపదికగా ఈ గ్రంథ ప్రామాణ్యాన్ని నిశ్చయించినట్లుగా రామకృష్ణ పేర్కొన్నారు.[5]

మూలాలు

మార్చు
 1. ఆముఖం: రాజేంద్రప్రసాద్: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-xii
 2. గ్రంథ వివరాలు: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013
 3. పుస్తకం వెనుక అట్టపై: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-
 4. విషయసూచిక: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ,ii
 5. ముందుమాట:వకుళాభరణం రామకృష్ణ:హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-viii