హైదరాబాద్ వరదలు (2020)

బంగాళఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడటం వల్ల హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.[1][2]

హైదరాబాద్ వరదలు 2020
తేదీ2020 అక్టోబర్ 14
ప్రదేశంతెలంగాణ,హైదరాబాద్

సహాయక చర్యలు

మార్చు
 
ఒక వీధిలో వరదలు సంభవించిన తరువాత

భారీ వర్షాలు హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రమంతటా వరదలు వచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సైన్యం బండ్లగూడ ప్రాంతంలో అక్టోబర్ 14న సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిరాశ్రయులైన వారికి ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రభావం

మార్చు

భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో పలు చోట్ల గోడలు కూలాయి.రోడ్లు, కాలనీలు వరద నీటితో జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనాలు,కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి.రోడ్లపై పెద్దగా నీరు లేని చోట కూడా సెల్లార్లు మునిగిపోయాయి. దీంతో అక్కడ పార్కింగ్ లో ఉన్న వాహనాలన్నీ దెబ్బతిన్నాయి.

ఆర్థిక సహాయం

మార్చు

తెలంగాణ ప్రభుత్వం వరదలకు నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం ప్రకటించింది. వర్షాలు, వరదనీటి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేలు,వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది.పేదలకు సాయం అందించేందుకు పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.[3]

విరాళాలు

మార్చు
  • తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం పళనిస్వామి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు.[4]
  • ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు.[5]
  • పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు.
  • జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.

సినీ ప్రముఖుల విరాళాలు

మార్చు
  • నందమూరి బాలకృష్ణ రూ. కోటి 50 లక్షలను విరాళంగా ప్రకటించారు.[6]
  • ప్రభాస్‌ కోటీ 50 లక్షలు, చిరంజీవి, మహేష్ బాబు, పవన్‌ కల్యాన్‌ తలా కోటి రూపాయలు, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్‌టీఆర్‌ చెరో 50 లక్షలు, రామ్‌ 25 లక్షలు, విజయ్‌ దేవరకొండ 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.[7]

మూలాలు

మార్చు
  1. "Death toll rises to 50 in Telengana,1305 crore plea to CM". Ei Samay.[permanent dead link]
  2. "BULLETIN NO.:18 (BOB/01/2020)" (PDF). October 13, 2020. Retrieved October 14, 2020.
  3. "ప్రతి ఇంటికి ₹10వేల ఆర్థిక సాయం: కేసీఆర్‌". www.eenadu.net. Archived from the original on 2020-10-22. Retrieved 2020-10-20.
  4. prasanna (2020-10-19). "తెలంగాణకు తమిళనాడు రూ.10 కోట్లు విరాళం". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
  5. Sumitra (2020-10-20). "తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం చేయూత.. రూ. 15 కోట్ల విరాళం". www.hmtvlive.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
  6. Velugu (2020-10-18). "వ‌ర‌ద బాధితుల‌కు నంద‌మూరి బాల‌య్య భారీ విరాళం". V6 Velugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-20.
  7. "హైద‌రాబాద్ వరద బాధితులకు భారీ విరాళాలు". T News (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-21. Archived from the original on 2020-10-30. Retrieved 2020-10-27.