హైదర్ అలీ (క్రికెటర్)

పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు

హైదర్ అలీ (జననం 2000 అక్టోబరు 2) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[2][3] 2019 సెప్టెంబరులోఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4] 2020 సెప్టెంబరు 1న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[5]

హైదర్ అలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2000-10-02) 2000 అక్టోబరు 2 (వయసు 24)
అటెక్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. (183 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 226)2020 నవంబరు 1 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2020 నవంబరు 3 - జింబాబ్వే తో
తొలి T20I (క్యాప్ 87)2020 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 అక్టోబరు 27 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentNorthern
2020–2022Peshawar Zalmi (స్క్వాడ్ నం. 12)
2023–Karachi Kings (స్క్వాడ్ నం. 46)
2023–డెర్బీషైర్ (స్క్వాడ్ నం. 12)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 31 11 21
చేసిన పరుగులు 42 497 978 708
బ్యాటింగు సగటు 21.00 19.88 54.33 33.71
100లు/50లు 0/0 0/3 3/4 1/4
అత్యుత్తమ స్కోరు 29 68 206 118
క్యాచ్‌లు/స్టంపింగులు 1/— 7/— 6/— 10/—
మూలం: Cricinfo, 27 October 2022

తొలి జీవితం

మార్చు

హైదర్ అలీ టేప్ బాల్స్‌తో క్రికెట్‌ను ప్రారంభించి, ఆ తరువాత క్రికెట్ బాల్స్‌తో ఆడటం ప్రారంభించాడు. క్రికెట్ ఆటలో మెళకువలు నేర్చుకోవడానికి అల్ ఫైసల్ క్రికెట్ అకాడమీలో చేరాడు.

దేశీయ, ఫ్రాంచైజీ కెరీర్

మార్చు

2018 డిసెంబరు 10న 2018–19 నేషనల్ టీ20 కప్‌లో రావల్పిండి తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6] 2019 సెప్టెంబరులో 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం నార్తర్న్ జట్టులో ఎంపికయ్యాడు.[7][8] 2019 సెప్టెంబరు 14న 2019–20 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో నార్తర్న్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[9]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2019 నవంబరులో బంగ్లాదేశ్‌లో జరిగిన 2019 ఏసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[10] 2019 నవంబరు 14న ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.[11] 2019 డిసెంబరులో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[12]

2020 ఆగస్టు 21న ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కి కూడా పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టుకి ఎంపికయ్యాడు.[13] 2020 సెప్టెంబరు 1న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన టీ20లోకి అరంగేట్రం చేసాడు.[14] ఇందులో 54 పరుగులు చేశాడు. అరంగేట్రంలో టీ20లో యాభై పరుగులు చేసిన పాకిస్తాన్ తరపున మొదటి క్రికెటర్ గా రికార్డు సాధించాడు.[15]

2020 అక్టోబరు 31న సిరీస్‌లోని రెండవ మ్యాచ్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు.[16] 2020 నవంబరు 1న జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు.[17] 2020 నవంబరులో న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[18]

మూలాలు

మార్చు
  1. Husain, Amir (12 July 2019). "Talent Spotter : Haider Ali". PakPassion. Retrieved 26 November 2022.
  2. "Haider Ali". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  3. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 2023-09-03.
  4. "Haider Ali: Rohit Sharma is my 'role model'". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  5. "3rd T20I: England opt to bowl as Pakistan's Haider Ali makes debut". Times of India. Retrieved 2023-09-03.
  6. "1st Match, National T20 Cup at Multan, Dec 10 2018". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  7. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  8. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  9. "3rd Match, Quaid-e-Azam Trophy at Abbottabad, Sep 14-17 2019". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  10. "Saud Shakeel named Pakistan captain for ACC Emerging Teams Asia Cup 2019". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  11. "Group B, Asian Cricket Council Emerging Teams Cup at Cox's Bazar, Nov 14 2019". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  12. "Pakistan squad for ICC U19 Cricket World Cup 2020 named". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  13. "Pakistan shortlist 17 players for England T20Is". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
  14. "3rd T20I (N), Manchester, Sep 1 2020, Pakistan tour of England". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  15. "Haider Ali becomes 1st Pakistani to score 50 on T20I debut". Geo Super. Retrieved 2023-09-03.
  16. "Pakistan Announce 15-Man Squad For The Second ODI Against Zimbabwe". Cricket Addictor. Retrieved 2023-09-03.
  17. "2nd ODI (D/N), Rawalpindi, Nov 1 2020, Zimbabwe tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  18. "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.

బాహ్య లింకులు

మార్చు