హై అండ్ లో (1963 సినిమా)

హై అండ్ లో 1963లో విడుదలైన జపాన్ చలనచిత్రం. పోలీస్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అకిరా కురొసావా దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అవ్వడమేకాకుండా ఇతర అవార్డులను పొందింది.

హై అండ్ లో
దర్శకత్వంఅకిరా కురొసావా
స్క్రీన్ ప్లేర్యుజో కికుషిమా, హిడియో ఓగుని, ఎజిరో హియైత, అకిరా కురోసావా
నిర్మాతఅకిరా కురొసావా
తారాగణంతోషిరో మిఫ్యూన్, టట్సుయ నకడై, క్యోకో కగవ, టట్సుయ మిహాషి, యుతకా సదా
ఛాయాగ్రహణంఅసాకజు నకి, టాకో సైటో
కూర్పుఅకిరా కురొసావా
సంగీతంమసరు సతో
విడుదల తేదీ
1 మార్చి 1963 (1963-03-01)(జపాన్)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్

చిత్ర ప్రధాన పాత్రధారి అయిన తోషిరో మిఫునే నష్టాల్లో ఉన్న నేషనల్ షూ కంపెనీ బాధ్యతలు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మెడికల్ ఇంటర్న్ చేసే ఒక యువకుడు డబ్బుల కోసం కథానాయకుడి డ్రైవర్ కొడుకు అయిన బాలుడిని కిడ్నాప్ చేస్తాడు. కంపెనీని కాపాడుకోవడంకోసం దాచుకున్న డబ్బును కిడ్నాపర్ కు ఇచ్చి బాలుడిని కాపాడాలా లేదా వందలమందికి ఉపాధిని కలిగించే కంపెనీని కాపాడాలా అనే డైలమాలో ఉన్న కథానాయకుడు విధి ఆడే వింత నాటకాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథాoశం. అకిరా కురసోవా ఈ కథాంశాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాడు.

నటవర్గం

మార్చు
  • తోషిరో మిఫ్యూన్
  • టట్సుయ నకడై
  • క్యోకో కగవ
  • టట్సుయ మిహాషి
  • కంజిరో ఇషియమా
  • ఇసో కిమురా
  • తకేషి కాటో
  • యుతకా సదా
  • సుతోము యమజాకి
  • తకాషి షిమూరా
  • జున్ టాజాకీ
  • నోబువో నకమురా
  • యునుసెక్ ఇటో
  • మైనరు చికికి
  • ఎజీరో టోనో
  • యోషియో సుచియా
  • మసహికో షిమిజు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: అకిరా కురొసావా
  • నిర్మాత: అకిరా కురొసావా
  • స్క్రీన్ ప్లే: ర్యుజో కికుషిమా, హిడియో ఓగుని, ఎజిరో హియైత, అకిరా కురోసావా
  • ఆధారం: కింగ్ రాన్సమ్ (రచయిత: ఎడ్ మక్బైన్)
  • సంగీతం: మసరు సతో
  • ఛాయాగ్రహణం: అసాకజు నకి, టాకో సైటో
  • కూర్పు: అకిరా కురొసావా
  • నిర్మాణ సంస్థ: కురోసావ ఫిల్మ్స్, టోవో

మూలాలు

మార్చు
  1. Galbraith IV 1996, p. 213.

ఇతర లంకెలు

మార్చు