హొన్నికేరి అభయారణ్యం
హొన్నికేరి అభయారణ్యం
మార్చుహొన్నికేరి అభయారణ్యం పశ్చిమాన ఉన్న- కర్ణాటక రాష్ట్రం, అటవీ ప్రాంతంలో హొన్నికేరి అభయారణ్యం ఉంది.[1] నగర రణగొణలకి దూరంగా పక్షుల కిలకిలలు తప్ప మరేమీ వినిపించని స్వచ్ఛమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదించవచ్చు.
విశేషాలు
మార్చు- కర్ణాటకలో ప్రసిద్ధమైన గంధపుచెట్ల సువాసనల మధ్య రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవచ్చు.
- అభయారణ్యంలో ఉన్న- విలాస్పూర్ చెరువు ఒడ్డున యాత్రికుల కోసం ప్రత్యేకంగా బ్లాక్బక్ రిసార్ట్ ఉంది. పర్యాటకులకు చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
- రాత్రివేళ వన్యమృగాలకి సంబంధించిన సినిమా ప్రదర్శన ఉంటుంది.
- దట్టమైన అడవుల్లో సాహసయాత్రలు చేసిన సిబ్బందితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేస్తారు.
- హొన్నికేరి అభయారణ్యంలో కృష్ణ జింకలను, వివిధ రకాల పక్షి జాతులను చూడవచ్చు.
రవాణా సౌకర్యం
మార్చుహైదరాబాద్ నుంచి సుమారు 155 కిలోమీటర్ల దూరంలో హొన్నికేరి అభయారణ్యం ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సులో బీదర్ పట్టణానికి రావొచ్చు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొన్నికేరి అభయారణ్యానికి చేరుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ "కొమ్మల్లో కుహూలూ... కొండల్లో 'ఎకో'లు". EENADU. Retrieved 2024-03-31.