కర్ణాటక

భారతదేశంలోని రాష్ట్రం
(కర్ణాటక రాష్ట్రం నుండి దారిమార్పు చెందింది)

కర్ణాటక (కన్నడ: ಕರ್ನಾಟಕ) భారతదేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. విస్తీర్ణ ప్రకారం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, భారతదేశంలో ఆరవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదంతో ఇది 1956 నవంబరు 1న ఏర్పడింది. నిజానికి మైసూర్ రాష్ట్రంగా తొలిగా పిలిచినా,1973లో కర్ణాటకగా పేరు మార్చారు. దీని రాజధాని, అతిపెద్ద నగరం బెంగళూరు.

కర్ణాటక
Coat of arms of కర్ణాటక
కర్ణాటక పటం
కర్ణాటక పటం
Coordinates (బెంగళూరు): 12°58′N 77°30′E / 12.97°N 77.50°E / 12.97; 77.50
దేశం India
రాజధానిబెంగళూరు
జిల్లాల పేర్లు
Government
 • Bodyకర్ణాటక ప్రభుత్వం
 • కర్ణాటక గవర్నర్వాజుభాయ్ వాలా
 • ముఖ్యమంత్రిసిద్ధరామయ్య ([[ భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) ]])
విస్తీర్ణం
 • Total1,91,791 కి.మీ2 (74,051 చ. మై)
 • Rank6వ
Highest elevation
1,925 మీ (6,316 అ.)
Lowest elevation
0 మీ (0 అ.)
జనాభా
 (2011)[2]
 • Total6,11,30,704
 • Rank8th
 • జనసాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
Demonymకన్నడిగులు
GDP (2018-19)
 • Total14.08 లక్ష కోట్లు (US$180 billion)
 • Per capita1,46,416 (US$1,800)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-KA
Official languages కన్నడ[4]
అక్షరాస్యత75.60% (2011 census)[5]
HDIIncrease 0.6176 (medium)
HDI rank8th (2015)[6]
Symbols of కర్ణాటక
Emblemగండభేరుండ[7]
Songజయభారత జననియ తనుజాతే[8]
BirdIndian Roller[9]
Flowerకలువ[9]
Treeశ్రీగంధం[9]

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయవ్యాన గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన తెలంగాణ, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. మిగతా 4 దక్షిణ భారత సోదరి రాష్ట్రాలతో భూ సరిహద్దులు ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం ఇది. రాష్ట్రం 191,791 చదరపు కిలోమీటర్లు (74,051 చ. మై.). ఇది భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 5.83 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 61,130,704 మంది నివాసితులతో, జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన కన్నడ, రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే అధికారిక భాష. అల్పసంఖ్యాకులు మాట్లాడే ఇతర భాషలలో ఉర్దూ, కొంకణి, మరాఠీ, తులు, తమిళం, తెలుగు, మలయాళం, కొడవ, బేరీ ఉన్నాయి . కర్ణాటకలో భారతదేశంలో సంస్కృతం ప్రధానంగా మాట్లాడే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి.[10][11][12]

కర్ణాటక అనే పేరు కన్నడ పదాలైన కరు, నాడు నుండి ఉద్భవించింది. కరు అంటే "ఎత్తైన" అనే అర్ధంతో "ఎత్తైన భూమి" అని, "నలుపు" అనే అర్ధంతో "నల్లనిప్రాంతం" (బయలు సీమ ప్రాంతంలో కనిపించే ప్రత్తి పంటకు అనువైన నల్లమట్టి ) అనే అర్ధాలను సూచిస్తుంది. కృష్ణానదికి దక్షిణంగా భారతదేశం రెండు వైపులా వున్న ప్రాంతానికి బ్రిటిష్ పాలకులు కొన్నిసార్లు కర్ణాటక్ అనే పదాన్ని ఉపయోగించారు.[13]

పురాతన పాతరాతియుగం కాలంనాటి చరిత్రతో కర్నాటక ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన పురాతన, మధ్యయుగ భారతదేశం సామ్రాజ్యాల రాజులు పరిపాలించారు. ఈ సామ్రాజ్యాలు పోషించిన తత్వవేత్తలు, సంగీతకారులు సామాజిక-మత, సాహిత్య ఉద్యమాలను ప్రారంభించారు. ఇవి నేటి వరకు కొనసాగుతున్నాయి. కర్ణాటక, హిందూస్థానీ సంప్రదాయాల భారతీయ శాస్త్రీయ సంగీతానికి కర్ణాటక గణనీయంగా దోహదపడింది.

స్థూల రాష్ట్ర ఉత్పత్తి ₹16.99 ట్రిలియన్ తో, తలసరి రాష్ట్ర ఉత్పత్తి ₹ 231,000 తో కర్ణాటక భారతదేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రం. మానవ అభివృద్ధి సూచికలో భారత రాష్ట్రాలలో పంతొమ్మిదవ స్థానంలో ఉంది.రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు మైసూరు, మంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి, బెల్గాం

భౌగోళికం

మార్చు

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయవ్యాన గోవా రాష్ట్రం, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తూర్పున, ఆగ్నేయాన తమిళనాడు, నైరుతిన కేరళ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళికంగా రాష్ట్రం మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది.

  • సన్నని తీర ప్రాంతం, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
  • పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతం ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం.
  • దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతంలోనే ఉంది. ప్రాంతం పొడిగా వర్షాభావంతో సెం-అరిద్ స్థాయిలో ఉంది.

కర్ణాటక పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చిందని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది. [1]

కర్ణాటక, భాష ఆధారితంగా ఏర్పడిన రాష్ట్రం. అందుకే రాష్ట్రం ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళం, కొడవ, తులు, ఇతర భాషలు.

ఆర్ధిక రంగం

మార్చు

కర్ణాటక భారతదేశంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశంలో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రం. భారతదేశంలోని 90% బంగారం ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజం వెలికితీత పనులు బళ్ళారి, హోస్పేట జిల్లాలలో ముమ్మరంగా సాగుతున్నాయి.

చరిత్ర

మార్చు
 
బేలూరులో హొయసల శిల్పకళ.

కర్ణాటక చరిత్ర పురాణ కాలంనాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు, 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసం చేయుచున్న కాలంలో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతంలో నివసించుచుండేవాడని కథనం. అశోకుని కాలంనాటి శిలాశాసనాలు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.

సా.శ.పూ. 4వ శతాబ్దంలో శాతవాహనులు ఈ ప్రాంతం అధికారానికి వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశం క్షీణించడంతో ఉత్తరాన కాదంబులు, దక్షిణాన గాంగులు అధికారానికి వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహం గాంగుల కాలంనాటి కట్టడమే. బాదామి చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరంనుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలం (609 - 642) నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్, పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పం విధించారు. ఈ కాలంలో కన్నడ సాహిత్యం ఎంతగానో అభివృద్ధి చెందింది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానంలో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు, వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యం మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథం రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యం దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతం, సంస్కృత, కన్నడ, తెలుగు, తమిళ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యం అభివృద్ధి చెందింది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు, బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడాలు కట్టించారు, ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠా పీష్వా, టిప్పూ సుల్తాన్ల పతనంతో మైసూరు రాజ్యం (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చింది.

 
మైసూరు ప్యాలెస్

భారత స్వాతంత్ర్యానంతరం, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రంగా అవతరించడంతో, పూర్వపు మహారాజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనం తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వం 1975 వరకు భత్యం ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యాలెస్ లోనే నివసిస్తున్నారు.

1956 నవంబరు 1 న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు, బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రం విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకుంది. ఆ రోజును రాజ్యోత్సవ దినంగా ఆచరిస్తారు. 1973 నవంబరు 1 న రాష్ట్రం పేరు కర్ణాటకగా మార్చబడింది.

పకృతి సిద్ధ ప్రదేశాలు

మార్చు

కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలం. అందులో ముఖ్యమైనవి

ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు, అభయారణ్యాలు ఉన్నాయి.

రాజకీయ నాయకులు

మార్చు

జిల్లాలు

మార్చు

విమానాశ్రయాలు

మార్చు

బెంగళూరు, మంగుళూరు, మైసూరు, బెల్గాం, హుబ్లీ

ఆనకట్టలు

మార్చు

పుణ్యక్షేత్రాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Protected Areas of India: State-wise break up of Wildlife Sanctuaries" (PDF). Wildlife Institute of India. Government of India. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2016. Retrieved 31 మే 2018.
  2. "Figures at a glance" (PDF). 2011 Provisional census data. Ministry of Home Affairs, Government of India. Archived (PDF) from the original on 24 అక్టోబరు 2011. Retrieved 17 సెప్టెంబరు 2011.
  3. "Karnataka Budget 2018-19" (PDF). Karnataka Finance Dept. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 31 మే 2018.
  4. 50th Report of the Commission for Linguistic Minorities in India (PDF). p. 123. Archived from the original (PDF) on 8 July 2016. {{cite book}}: Unknown parameter |agency= ignored (help)
  5. "Population and Literacy Rate of cities in Karnataka". Archived from the original on 7 జనవరి 2019. Retrieved 31 మే 2018.
  6. "Inequality- Adjusted Human Development Index for India's States". Archived from the original on 10 మే 2017.
  7. Shankar, Shiva (7 February 2018). "State flag may be a tricolour with Karnataka emblem on white". The Times of India. The Times Group.
  8. "Poem declared 'State song'". The Hindu. The Hindu Group. 11 January 2004.
  9. 9.0 9.1 9.2 9.3 Huq, Iteshamul, ed. (2015). "Introduction". A Handbook of Karnataka (PDF) (in ఇంగ్లీష్) (Fifth ed.). Karnataka Gazetteer Department. p. 48. Archived from the original (PDF) on 2018-05-23. Retrieved 2018-05-31.
  10. "Seven Indian villages where people speak in Sanskrit". 24 September 2017. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  11. "Know about these 4 Indian villages where SANSKRIT is still their first language". Archived from the original on 6 January 2019. Retrieved 7 April 2019.
  12. "Five Indian villages where sanskrit is spoken". Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  13. See Lord Macaulay's life of Clive and James Talboys Wheeler: Early History of British India, London (1878) p.98.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కర్ణాటక&oldid=4226127" నుండి వెలికితీశారు