హోషంగాబాద్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

హోషంగాబాద్ మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని నర్మదాపురం అని కూడా అంటారు ఇది నర్మదాపురం డివిజన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది మధ్య భారతదేశంలో, నర్మదా నదికి దక్షిణ ఒడ్డున ఉంది. రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 76.7 కి.మీ. దూరంలో ఉంది.

హోషంగాబాద్
నర్మదాపురం
పట్టణం
సేఠానీ ఘాట్
సేఠానీ ఘాట్
Nickname: 
నర్మదాపురం
హోషంగాబాద్ is located in Madhya Pradesh
హోషంగాబాద్
హోషంగాబాద్
Coordinates: 22°45′N 77°43′E / 22.75°N 77.72°E / 22.75; 77.72
దేశంభారతదేసం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాహోషంగాబాద్
స్థాపన1406
Founded byమాళ్వా సుల్తాను హోషంగ్ షా
Elevation
278 మీ (912 అ.)
Population
 (2011)[1]
 • Total1,17,988
 • Rank17
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
461001
టెలిఫోన్ కోడ్07574
Vehicle registrationMP-05

చరిత్ర మార్చు

మాళ్వా ప్రాంత మొదటి పాలకుడైన గోండు రాజు హోషంగ్ షా పేరిట నగరానికి ఈ పేరు వచ్చింది. హోషంగాబాద్ జిల్లా కేంద్ర ప్రావిన్స్, బెరార్ యొక్క నెర్బుద్దా (నర్మదా) విభాగంలో భాగంగా ఉండేది. 1947 లో స్వాతంత్ర్యం వచ్చాక, మధ్య భారత్ రాష్ట్రంగాను ఆ తరువాత మధ్యప్రదేశ్ గానూ మారింది. [2]

నర్మదా నది ఒడ్డున ఉన్న అందమైన ఘాట్లకు ఈ నగరం ప్రసిద్ది చెందింది. సేథాని ఘాట్ ఒక ప్రధాన ఆకర్షణ. నర్మదా జయంతి సందర్భంగా నగరంలో రంగురంగుల వేడుకలు ఉన్నాయి. ఈ సంవత్సరం వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి, ఈ పట్టణం పేరు మార్చే ప్రతిపాదనను ప్రకటించారు. ఘాట్ వద్ద ఉన్న సత్సంగ్ భవన్ లో మత ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి.

భౌగోళికం మార్చు

హోషంగాబాద్ 22°45′N 77°43′E / 22.75°N 77.72°E / 22.75; 77.72 వద్ద [3] సముద్ర మట్టం నుండి 278 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి మార్చు

హోషంగాబాద్ జిల్లా శీతోష్ణస్థితి సాధారణంగా మధ్య భారతదేశ శీతోష్ణస్థితి లాగానే ఉంటుంది. కర్కటరేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత గరిష్టంగా 40 - 42 డిగ్రీల సెల్సియస్ (ఏప్రిల్ - జూన్) ఉంటుంది. దీని తరువాత వర్షాకాలం వర్షాలు కురుస్తాయి. శీతాకాలం పొడిగా, తేలిగ్గా ఉంటుంది (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు). సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 331 మీ. ఉంటుంది. సగటు వర్షపాతం 134 సెం.మీ.

రవాణా సౌకర్యాలు మార్చు

హోషంగాబాద్ నుండి రాష్ట్ర రాజధాని భోపాల్ కు చక్కటి రైలు రోడ్డు సౌకర్యాలున్నాయి. హోషంగాబాద్ రైల్వే స్టేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళున్నాయి. జిల్లా లోని తహసీళ్లలో ఒకటైన ఇటార్సి జంక్షన్ ద్వారా నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. ఈ కూడలి భారత రైల్వేల ప్రధాన మార్గాల్లో ఉంది. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 18 కి.మీ. దూరంలో ఉంది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్ పచ్‌మఢీ హోషంగాబాద్ జిల్లాలోనే ఉంది. నగరానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం భోపాల్.

జనాభా వివరాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హోషంగాబాద్ జనాభా 1,17,988; వీరిలో 61,716 మంది పురుషులు, 56,272 మంది మహిళలు. హోషంగాబాద్ అక్షరాస్యత 87.01%. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 91.79%, స్త్రీల అక్షరాస్యత 81.79%.[1]

హోషంగాబాద్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
75%
ఇస్లాం
  
20%
జైన మతం
  
3.7%
ఇతరాలు†
  
1.3%
ఇతరాల్లో
సిక్కుమతంs (0.2%), బౌద్ధమతం (<0.2%).

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Hoshangabad District Census Handbook
  2. Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
  3. Falling Rain Genomics, Inc - Hoshangabad