అమ్మోనియం డైక్రోమేట్
అమ్మోనియం డైక్రోమేట్ అనునది ఒక రసాయన సమ్మేళనం.
పేర్లు | |
---|---|
IUPAC నామము
అమ్మోనియం డైక్రోమేట్
| |
ఇతర పేర్లు
Ammonium bichromate
Ammonium pyrochromate | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7789-09-5] |
పబ్ కెమ్ | 24600 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | HX7650000 |
SMILES | [O-][Cr](=O)(=O)O[Cr]([O-])(=O)=O.[NH4+].[NH4+] |
| |
ధర్మములు | |
(NH4)2Cr2O7 | |
మోలార్ ద్రవ్యరాశి | 252.07 g/mol |
స్వరూపం | Orange-red crystals |
సాంద్రత | 2.115 g/cm3 |
ద్రవీభవన స్థానం | 180 °C (356 °F; 453 K) decomposes |
18.2 g/100ml (0 °C) 35.6 g/100ml (20 °C) 40 g/100ml (25 °C) 156 g/100ml (100 °C) | |
ద్రావణీయత | insoluble in acetone soluble in alcohol |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | ICSC 1368 |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [1] |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H272, H301, H312, H314, H317, H330, H334, H340, H350, H360, H372, H410[1] |
GHS precautionary statements | P201, P220, P260, P273, P280, P284[1] |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R45, మూస:R46, R60, R61, మూస:R2, R8, R21, R25, R26, R34, మూస:R42/43, మూస:R48/23, R50/53 |
S-పదబంధాలు | S53, S45, S60, S61 |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
190 °C (374 °F; 463 K) |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
Potassium dichromate Sodium dichromate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుఅమ్మోనియం డైక్రోమేట్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం. రసాయనిక ఫార్ములా (NH4)2Cr2O7. అన్ని డైక్రోమేట్, క్రోమేట్‌లలో ఉన్న విధంగానే అమ్మోనియం డైక్రోమేట్ సంయోగ పదార్థంలో కుడా క్రోమియం హెక్సా వేలంట్ క్రోమియం అనబడు +6 ఆక్సీకరణ స్థాయిలో బంధం కలిగున్నది. అమ్మోనియం డైక్రోమేట్ సంయోగ పదార్థం అమ్మోనియం, డైక్రోమేట్ అయానులను కలిగున్నది. సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత, వత్తిడి వద్ద ఈ సంయోగ పదార్థం ఆరెంజి రంగులో ఉండును.ఆమ్ల గుణంకలిగి యుండును. నీటిలో, ఆల్కహాల్‌లలో కరుగును. అణుభారం 252.07 గ్రాములు/మోల్, సాంద్రత 2.115గ్రాములు/సెం.మీ3, ద్రవీభవన స్థానం 180 °C (356 °F;453 K), ఈ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం డైక్రోమేట్ వియోగం చెందును. అసిటోన్ లో కరుగదు.
అమ్మోనియం డైక్రోమేట్ స్పటికం (C2/c, z=4) ఒకే రకమైన అమ్మోనియం అయానును కల్గి ఉండి (C1 (2,3) ) ప్రతి NH4+ అయాన్ కేంద్రం క్రమరహితమైన 8 ఆక్సిజన్ పరమాణులచే ఆవృతమై ఉండును. నత్రజని-ఆక్సిజన్ పరమాణువుల బంధ దూరం ca. 2.83 to ca. 3.17 Å.
రసాయన చర్యలు
మార్చుపరిశోధన శాలలో అగ్నిపర్వతాల ప్రేలే విధానాన్నిప్రత్యక్షంగా మాదిరి చూపుటకు అమ్మోనియం డైక్రోమేట్ ను ఉపయోగిస్తారు.
- (NH4)2Cr2O7(s) → Cr2O3(s) + N2(g) + 4 H2O(g) (ΔH=−429.1 ± 3 kcal/mol)
అమ్మోనియం నైట్రేట్ వలె అమ్మోనియం డైక్రోమేట్ కూడా థెర్మోడైనమికల్లి అస్థిరమైనది.
ఆక్సీకరణ చర్యలు
మార్చుఅమ్మోనియం డైక్రోమేట్ శక్తి వంతమైన ఆక్సీకరణ కారకం. ఎటువంటి క్షయికరణ కారకంతోనైనా తీవ్రంగా ప్రతి చర్య జరుపును. క్షయికరణ కారకం శక్తి వంతమైయ్యే కొలది చర్యకుడా అంటే తీవ్రస్థాయిలో ఉండును. నూనెలను, ఆల్కహాలుల ఆక్సీకరణను ఉద్దిపం చెయ్యుట కుపయోగిస్తారు.
ఉత్పత్తి
మార్చుక్రోమిక్ ఆమ్లాన్ని అమ్మోనియం హైడ్రాక్సైడ్ తో చర్య జరగడం వలన అమ్మోనియం డైక్రోమేట్ ఏర్పడును.
ఆరోగ్యము పైప్రభావం
మార్చుఅమ్మోనియం డైక్రోమేట్ మిగతా క్రోమియం (VI) సమ్మేళనాలవలె విషపూరితమైనది, క్యాన్సరును ప్రేరేపించే గుణాలను కలిగియున్న ది. అలాగే శరీర నొప్పిని ప్రేరెపించును, చికాకు కలిగించును.
ఉపయోగాలు
మార్చుఅమ్మోనియం డైక్రోమేట్ సం యోగ పదార్థాన్ని బాణసంచు/టపాసులు తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పోటోగ్రపిని కనుగొన్న మొదటి రోజుల్లో పోటోగ్రపిలో, లిథోగ్రఫిలో ఉపయోగించే వారు. అలాగే పరిశోధన/ప్రయోగశాలలో శుద్ధమైన నత్రజని వనరుగా ఉపయోగిస్తారు. అలాగే ఉత్పేరకంగా కుడా ఉపయోగిస్తారు. రంగుల అద్దకంలో అమ్మోనియం డైక్రోమేట్‌ను వర్ణాకర్షణిగా ఉపయోగిస్తా రు.అలిజరిన్, క్రోమ్ ఆలంలను తయారు చేయుటకు, తోళ్ళు పదును చేయుటకు, తైలాలను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తా రు. టెలివిజన్ స్క్రీన్‌ల ఫాస్ఫార్ రోస్టరు తయారీలో వాడెదరు.