12వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

1989 చలన చిత్రోత్సవం

12వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1989 జనవరి 10 నుండి 24 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] రాబోవుకాలంలో ఈ చిత్రోత్సవాలు సినిమా పోటీలు కాకుండా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) అనే పేరుతో నిర్వహిస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1988 ఆగస్టులో తీసుకున్న నిర్ణయం తరువాత జరిగిన చలన చిత్రోత్సవం ఇది.[2] "ఫిల్మోత్సవ్స్", ఐఎఫ్ఎఫ్ఐ 90-91-92 కలిసి 23 చిత్రోత్సవాలు నిర్వహించాయి. 24వ ఎడిషన్ నుండి, ఐఎఫ్ఎఫ్ఐని 10 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.[3]

12వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

మూలాలు

మార్చు
  1. "English Releases". Retrieved 5 July 2021.
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-12-31. Retrieved 5 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.