11వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

1987 చలన చిత్రోత్సవం

11వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1987 జనవరి 10 నుండి జనవరి 24 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఈ చిత్రోత్సవంలో "ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ విభాగాన్ని" ఏర్పాటు చేయడం ద్వారా కమర్షియల్ సినిమాకు పురోగతిని ఇచ్చింది.[2] 1986లో అకాడమీ పురస్కారాలులో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగానికి భారతదేశం నుండి అధికారిక ప్రవేశం పొందిన "స్వాతిముత్యం" సినిమా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది.[3]

11వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on24 జనవరి 1987
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ఫేర్వెల్ గ్రీన్ సమ్మర్"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: ఎలీర్ ఇష్ముఖామెడోవ్ దర్శకత్వం వహించిన "ఫేర్వెల్ గ్రీన్ సమ్మర్" (రష్యన్ సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: అవార్డు ఇవ్వలేదు
  • ఉత్తమ నటుడు: సిల్వర్ పీకాక్ అవార్డు: "మాస్సే సాహిబ్" భారతీయ సినిమాలో నటించిన " రఘుబీర్ యాదవ్[7]

మూలాలు

మార్చు
  1. "English Releases". Retrieved 5 July 2021.
  2. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
  3. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2016-04-15. Retrieved 5 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.
  7. Nair, Nithya (23 September 2017). "Raghubir Yadav's Oscars Connection: With Newton, He Is Part Of Six Indian Movies Sent For The Academy Awards". Retrieved 5 July 2021.