1890 బ్రిటిషు చైనా ఒడంబడిక
1890 బ్రిటిషు చైనా ఒడంబడిక,[1] టిబెట్, సిక్కిం రాజ్యాలకు సంబంధించి బ్రిటన్‌కు క్వింగ్ చైనాకూ మధ్య జరిగిన ఒప్పందం. దీన్ని కలకత్తా ఒడంబడిక[2] అని, అధికారికంగా సిక్కిం, టిబెట్‌కు సంబంధించి గ్రేట్ బ్రిటన్, చైనాల మధ్య ఒడంబడిక అనీ అంటారు. 1890 మార్చి 17న భారత వైస్రాయ్ లార్డ్ లాన్స్‌డౌన్, టిబెట్‌లోని షెంగ్ తాయ్‌లోని చైనా అంబన్ లు కలకత్తాలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.[3] ఈ సమావేశం, సిక్కింను బ్రిటిష్ రక్షిత ప్రాంతం గాను, సిక్కిం-టిబెట్ సరిహద్దునూ గుర్తించింది.
టిబెట్‌ను సంప్రదించకుండానే చైనా ఈ ఒప్పందంపై చర్చలు జరిపిందని చెబుతూ, టిబెటన్లు దానిని గుర్తించడానికి నిరాకరించారు.[1] ఒప్పందాన్ని అమలు చేయడంలో చైనా విఫలమవడంతో, చివరికి 1904లో బ్రిటిషు భారతదేశం, టిబెట్‌పై దండయాత్ర చేయాల్సి వచ్చింది. ఇది టిబెట్ చరిత్రలో సుదీర్ఘ పరిణామాలకు దారితీసింది. టిబెట్‌లో చైనా 'చేతగానితనాన్ని' ఈ సమావేశం బయటపెట్టిందని ఆధునిక అంతర్జాతీయ న్యాయనిపుణులు పేర్కొన్నారు.[4]
ఈ ఒప్పందంలో సిక్కిం, టిబెట్‌ల మధ్య ఏర్పాటైన సరిహద్దు, చైనా-భారత సరిహద్దులో భాగంగా నేటికీ మనుగడలో ఉంది.[5] చైనా, భారతదేశం, భూటాన్ ల మధ్య ఏర్పడిన ఆధునిక డోక్లామ్ ప్రతిష్ఠంభనపై ప్రభావం చూపింది.[6]
నేపథ్యం
మార్చుభారతదేశంలో తయారైన వస్త్రాలు, పొగాకు, ధాన్యం, పనిముట్లు, తేయాకులను టిబెట్ మార్కెట్లకు, తద్వారా చైనా మార్కెట్లకూ తెరవడం, ఈశాన్య భారతదేశంలో బ్రిటిషు వారి అవసరం.[7]
నిబంధనలు
మార్చుఆర్టికల్ 1 ప్రకారం, సిక్కింలోని తీస్తా నదిలోకి ప్రవహించే జలాలను, దాని ఉపనదులను టిబెట్ మోచు నదిలోకి, ఉత్తరంవైపు టిబెట్‌లోని ఇతర నదుల్లోకి ప్రవహించే జలాలను వేరుచేసే పర్వత శ్రేణిని సిక్కిం, టిబెట్ సరిహద్దులుగా నిర్వచించారు. ఈ రేఖ భూటాన్ సరిహద్దులో ఉన్న గిప్మోచి పర్వతం వద్ద ప్రారంభమై, పై వాటర్‌షెడ్‌ను అనుసరించి, నేపాలీ భూభాగాన్ని కలిసే వరకూ ఉంది.
అనంతర పరిణామాలు
మార్చు1893 డిసెంబరులో ఈ ఒప్పందానికి ఒక ప్రోటోకాల్‌ను చేర్చారు. "1890 నాటి సిక్కిం-టిబెట్ ఒడంబడికకు అనుబంధించబడే వాణిజ్యం, కమ్యూనికేషన్లు, పచ్చికబయళ్ళకు సంబంధించిన నిబంధనల" ప్రకారం, టిబెట్‌లోని ఓల్డ్ యాతుంగ్‌లో బ్రిటీష్ ట్రేడింగ్ పోస్ట్‌ను స్థాపించడానికి ఇది అనుమతించింది అలాగే పచ్చిక బయళ్ళకు, కమ్యూనికేషన్‌లకూ సంబంధించిన నిబంధనలను నిర్దేశించింది.[8] [3]
1904 లాసా కన్వెన్షన్ "థిబెట్ ప్రభుత్వం 1890 నాటి బ్రిటిషు-చైనా ఒడంబడికను గౌరవించడం, అందులో నిర్వచించిన సిక్కిం, థిబెట్‌ల సరిహద్దును గుర్తించడం, తదనుగుణంగా సరిహద్దు స్తంభాలను నిర్మించడంలో నిమగ్నమై ఉంది." అని పేర్కొంది.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Norbu, China's Tibet Policy (2001).
- ↑ Green, L. C. (July–September 1960), "Legal Aspects of the Sino-Indian Border Dispute", The China Quarterly, vol. 3, no. 3, pp. 42–58, doi:10.1017/S0305741000026230, JSTOR 763286
- ↑ 3.0 3.1 Younghusband, India and Tibet (1910).
- ↑ International Commission of Jurists (1959).
- ↑ Prescott (1975)
- ↑ Ankit Panda (13 July 2017), "The Political Geography of the India-China Crisis at Doklam", The Diplomat, archived from the original on 14 July 2017
- ↑ Arora, Vibha (2008). "Routing the Commodities of Empire through Sikkim (1817-1906)". Commodities of Empire: Working Paper No.9 (PDF). Open University. pp. 4–5. ISSN 1756-0098.
- ↑ Joshi, H. G. (2004). Sikkim: Past and Present. Mittal Publications. p. 89. ISBN 978-81-7099-932-4.