1914 సిమ్లా ఒప్పందం

టిబెట్‌పై, 1914 లో భారత్, టిబెట్, చైనాలు కుదుర్చుకున్న ఒప్పందం

సిమ్లా ఒప్పందం, 1914 లో గ్రేట్ బ్రిటన్, చైనా, టిబెట్ ల మధ్య సిమ్లాలో టిబెట్ యొక్క స్థితికి సంబంధించి కుదిరిన అస్పష్టమైన ఒప్పందం. [1] మూడు దేశాల ప్రతినిధులు 1913, 1914 ల్లో సిమ్లాలో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు.

1914 లో సిమ్లా ఒప్పందానికి టిబెట్, బ్రిటిషు, చైనా ప్రతినిధులు, స్వతంత్ర నిర్ణయాధికారం గల రాయబారులు

టిబెట్‌ను "ఔటర్ టిబెట్", "ఇన్నర్ టిబెట్" గా విభజించాలని సిమ్లా ఒప్పందం భావించింది. సుమారుగా యు-త్సాంగ్, పశ్చిమ ఖాం లను కలిగి ఉండే ఔటర్ టిబెట్, "చైనా సార్వభౌమత్వం కింద లాసా లోని టిబెట్ ప్రభుత్వం పాలన లోనే ఉంటుంది" కానీ, చైనా దాని పరిపాలనలో జోక్యం చేసుకోదు. అమ్డో, తూర్పు ఖామ్‌ తో కలిసి "ఇన్నర్ టిబెట్" ఏర్పడుతుంది. ఇది చైనా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈఒప్పందం, దాని అనుబంధాలతో సహా, టిబెట్, చైనాల మధ్య సరిహద్దునూ, టిబెట్ బ్రిటిష్ ఇండియాల మధ్య సరిహద్దునూ కూడా నిర్వచిస్తుంది (ఈ రెండో సరిహద్దునే తరువాతి కాలంలో మెక్ మహోన్ రేఖ అన్నారు).[2][3][a]

1914 ఏప్రిల్ 27 న ముసాయిదా ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేసాయి. కాని చైనా వెంటనే దానిని తిరస్కరించింది. [4] [5] కొద్దిగా సవరించిన ఒప్పందంపై 1914 జూలై 3 న సంతకం చేసారు. కానీ బ్రిటన్, టిబెట్లు మాత్రమే చేసాయి. చైనాకు చెందిన స్వతంత్ర నిర్ణయాధికారం గల ప్రతినిధి (ప్లీనిపొటెన్షియరీ) అయిన ఇవాన్ చెన్, సంతకం చేయడానికి నిరాకరించాడు. [5] ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామనీ, ఈ ఒప్పందం కింద చైనాకు ఎటువంటి హక్కులూ ఉండవనీ బ్రిటిషు, టిబెటన్ ప్రతినిధులు ఒక ద్వైపాక్షిక ప్రకటనను ఒప్పందానికి జతచేసారు.

మక్ మహోన్ చేసిన పనిని 1907 ఆంగ్లో-రష్యన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ బ్రిటిషు ప్రభుత్వం తిరస్కరించింది. 1921 లో ఆంగ్లో-రష్యన్ ఒప్పందం ముగిసిపోయింది. బ్రిటిష్ వారు 1937 లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లపై మెక్‌మహన్ లైన్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. సిమ్లా ఒప్పందాన్ని 1938 లో అధికారికంగా ప్రచురించారు. [b]

నేపథ్యం

మార్చు

సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు 1904 లో టిబెట్‌లోకి ప్రవేశించి టిబెటన్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. [6] 1906 లో, టిబెట్‌పై జరిగిన ఆంగ్ల-చైనా సదస్సులో టిబెట్‌పై ఆధిపత్యాన్ని (సుజరెయిన్టీ) అంగీకరించాలని బ్రిటిషు ప్రభుత్వం చైనాను కోరింది. కాని సార్వభౌమాధికారం (సావరీన్టీ) కావాల్సిందేనని నొక్కిచెప్పిన చైనా రాయబారి బ్రిటిషు ప్రతిపాదనను తిరస్కరించాడు. [7] 1907 లో, బ్రిటన్ రష్యాలు టిబెట్ పై చైనా "సుజరైన్టీ" ని అంగీకరించాయి. [8]

చైనాలో క్వింగ్ రాజవంశ పతనం తరువాత, లాసాలోని టిబెట్ ప్రభుత్వం చైనా దళాలను బహిష్కరించి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది (1913), [9] అయితే, దీనిని కొత్తగా స్థాపించబడిన రిపబ్లిక్ ఆఫ్ చైనా అంగీకరించలేదు.

సమావేశం

మార్చు

1913 లో, టిబెట్ స్థితి గురించి చర్చించడానికి బ్రిటిషు వారు సిమ్లాలోని వైస్రాయి లాడ్జిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. [10] ఈ సమావేశంలో బ్రిటన్ ప్రతినిధులు, కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రతినిధులు, లాసాలోని టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులూ పాల్గొన్నారు. [1] బ్రిటిషువారి తరపున వచ్చిన స్వతంత్రాధికార ప్రతినిధి సర్ హెన్రీ మక్ మహోన్, టిబెట్ ప్రాంతాలను "ఇన్నర్ టిబెట్", "ఔటర్ టిబెట్" గా విభజించి, విభిన్న విధానాలను వర్తింపజేసే ప్రణాళికను ప్రవేశపెట్టాడు. కింగ్‌హాయి, గాన్సు, సిచువాన్, యునాన్ ప్రావిన్సులలో టిబెటన్ల నివాస ప్రాంతాలన్నీ కలిసి "ఇన్నర్ టిబెట్" చైనా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. "ఔటర్ టిబెట్", ఆధునిక " టిబెట్ అటానమస్ రీజియన్ " లాగా దాదాపుగా అదే ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ ఒప్పందంలో చేర్చిన మ్యాప్‌లో టిబెట్‌కు, బ్రిటిష్ ఇండియాకూ మధ్య గీసిన సరిహద్దునే తరువాత మక్ మహోన్ లైన్ అని పిలుస్తున్నారు.

చైనా ప్రతినిధి లేనప్పుడు బ్రిటన్, టిబెట్ ప్రతినిధులు మధ్య సిమ్లాలో చర్చలు జరిపి టిబెటన్ భారత సరిహద్దుపై ఒక నిర్ణయానికి వచ్చారు. సిమ్లా సమావేశంలో భారత టిబెట్ సరిహద్దు మ్యాపును ప్రతిపాదిత ఒప్పందానికి అనుబంధంగా చేర్చారు.[11][12][a][c]

ఒప్పందానికి అనుబంధంగా ఉన్న షెడ్యూల్‌లో మరిన్ని గమనికలు ఉన్నాయి. వాటిలో కొన్ని: "టిబెట్ చైనా భూభాగంలో భాగం" అని అర్థం చేసుకోవాలి. టిబెటన్లు దలైలామాను ఎన్నుకున్న తరువాత, చైనా ప్రభుత్వానికి తెలియజేయాలి. అపుడు లాసాలోని చైనా కమిషనరు, చైనా ప్రభుత్వం ప్రదానం చేసే "బిరుదులను పతకాలనూ" అందజేస్తారు. "ఔటర్ టిబెట్" లోని అధికారులను టిబెట్ ప్రభుత్వమే నియమించుకుంటుంది. చైనా పార్లమెంటులో గానీ, ఏదేనీ అసెంబ్లీలో గానీ "ఔటర్ టిబెట్" కు ప్రాతినిధ్యం ఉండదు. [1]

చైనా-టిబెట్ సరిహద్దుపై చైనా, టిబెట్‌లు అంగీకారానికి రాలేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. చైనా స్వతంత్రాధికార ప్రతినిధి, ఇవాన్ చెన్, తన ప్రభుత్వం దీన్ని అంగీకరించాలనే షరతుపై ఒప్పందంపై సంతకం చేసాడు. ఆ ఒప్పందాన్ని తిరస్కరించాలని చైనా ప్రభుత్వం అతన్ని ఆదేశించింది. [7] 1914 జూలై 3 న, బ్రిటిషు, టిబెట్ స్వతంత్రాధికార ప్రతినిధులు చైనా సంతకం లేకుండానే ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాలనీ, ఒప్పందంపై సంతకం చేసేవరకు చైనాకు ఎటువంటి హక్కులూ ఉండవనీ వారిద్దరూ అదనంగా ఒక ద్వైపాక్షిక ప్రకటనపై సంతకం చేశారు. అదే సమయంలో బ్రిటిషు వారు, లోచెన్ షాత్రా లు 1908 నాటి స్థానంలో కొత్త వాణిజ్య నిబంధనలపై కూడా సంతకం చేశారు. [13]

అనంతర పరిణామాలు

మార్చు

1907 నాటి ఆంగ్లో-రష్యన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నందున సిమ్లా ఒప్పందాన్ని బ్రిటిషు భారత ప్రభుత్వం మొదట తిరస్కరించింది. అధికారిక ఒప్పంద రికార్డు, సియు అట్చిసన్ రాసిన ఎ కలెక్షన్ ఆఫ్ ట్రీటీస్ లో ప్రచురించారు. సిమ్లాలో శిరోధార్యమైన ఒప్పందమేదీ కుదుర్చుకోలేదనే గమనికతో దీన్ని ప్రచురించారు. ఒప్పందంలో పేర్కొన్న షరతు (చైనాతో ఒప్పందం) నెరవేరనందున, టిబెటన్ ప్రభుత్వం మక్ మహోన్ లైన్‌ను ఆమోదించలేదు.

ఆంగ్లో-రష్యన్ ఒప్పందాన్ని 1921 లో రష్యా, బ్రిటన్‌లు సంయుక్తంగా త్యజించాయి. [14] కాని 1935 వరకు మక్ మహోన్ లైన్ సంగతిని మర్చిపోయారు. [15]  1937 లో సర్వే ఆఫ్ ఇండియా మక్ మహోన్ లైన్‌ను అధికారిక సరిహద్దుగా చూపించే మ్యాప్‌ను ప్రచురించింది.   1938 లో, బ్రిటిష్ వారు సిమ్లా ఒప్పందాన్ని అట్చిసన్ ఒప్పందాలలో ప్రచురించారు. [16] ఇంతకుముందు ప్రచురించబడిన ఒక వాల్యూమ్ గ్రంథాలయాల నుండి తీసేసి దాని స్థానంలో సిమ్లా ఒప్పందాన్ని కూడా చేర్చిన సంచికను పెట్టారు. టిబెట్, బ్రిటన్‌లు మాత్రమే - చైనా కాదు - ఈ ఒప్పందాన్ని శిరోధార్యంగా అంగీకరించాయనే ఒక ఎడిటర్ నోట్‌తో దీన్ని ప్రచురించారు. [17] ఈ కొత్త సంచికలో ప్రచురణ తేదీని తప్పుగా, 1929 అని వేసారు.

1938 ఏప్రిల్‌లో, కెప్టెన్ జి.ఎస్. లైట్‌ఫుట్ నేతృత్వం లోని బ్రిటిషు సైనిక దళం తవాంగ్ చేరుకుని, ఈ జిల్లా భారత భూభాగం లోనిదని అక్కడి బౌద్ధవిహారానికి తెలియ జేసాడు.[18] టిబెటన్ ప్రభుత్వం దీనిపై నిరసన వ్యక్తం చేసింది. లైట్‌ఫుట్ అక్కడినుండి వెళ్ళిపోగానే తన అధికారాన్ని పునరుద్ధరించుకుంది. 1951 వరకు ఈ జిల్లా టిబెట్ చేతిలోనే ఉంది.

టిబెట్ స్పందన

మార్చు

సిమ్లా సదస్సుకు చైనా అంగీకారం పొందనందున టిబెటన్లు కొత్త భారత-టిబెట్ సరిహద్దును అంగీకరించలేదని బ్రిటిషు రికార్డులు చూపిస్తున్నాయి. బ్రిటీషు వారు చైనీయుల ఆమోదాన్ని పొందలేక పోయినందున, టిబెటన్లు మెక్ మహోన్ లైన్ చెల్లదని భావించారని అలస్టెయిర్ లాంబ్ పేర్కొన్నాడు.

1950 లో భారత చైనా వివాదాలు

మార్చు

1950 ల చివరలో, మెక్ మహాన్ రేఖ భారత చైనాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. [19] టిబెట్ ఎప్పుడూ స్వతంత్ర రాజ్యం కాదని, అందువల్ల అంతర్జాతీయ సరిహద్దును వివరించే ఒప్పందంపై చైనా తరపున అది సంతకం చేయజాలదని చైనా వాదించింది. భారత చైనాలు 1962 లో యుద్ధం చేసుకున్నాయి. అయినప్పటికీ యుద్ధపూర్వ స్థితి ఏమీ మారలేదు. ఆస్ట్రేలియా జర్నలిస్టు, చరిత్రకారుడు నెవిల్ మాక్స్‌వెల్ ఒక రహస్య భారత యుద్ధ నివేదికను బహిర్గతం చేశాడు. ఆ సమయంలో భారతదేశంలో అత్యున్నత స్థాయి నేతలను ఆ నివేదిక తీవ్రంగా విమర్శించింది. చైనా ఎదురు తిరిగితే ఎదుర్కొనే సాధన సంపత్తి లేకపోయినా, దాన్ని రెచ్చగొట్టే దోషపూరిత వ్యూహం అనుసరించడాన్ని అది తీవ్రంగా విమర్శించింది. మాక్స్వెల్ సంపాదించిన ఆ నివేదిక, న్యూ ఢిల్లీ పనుపున భారత సైనిక పరాజయంపై తయారైన హెండర్సన్ బ్రూక్స్-భగత్ నివేదిక. 1963 లో లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్, బ్రిగేడియర్ ప్రీమీంద్ర సింగ్ భగత్ ఈ నివేదికను తయారు చేసారు. దీనిని బహిర్గతపరచాలని అనేక విజ్ఞప్తులు వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం ఈన్ని రహస్యంగానే ఉంచింది [20] [21] కొన్ని సంవత్సరాల తరువాత, అప్పుడు ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ అనే పేరున్న ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ గా భారత రాష్ట్ర హోదాను పొందింది. [22]

2008 లో బ్రిటిషు విధానంలో వచ్చిన మార్పు

మార్చు

టిబెట్ పై చైనాకు ఆధిపత్యమే తప్ప, సంపూర్ణ సార్వభౌమాధికారం ఉండరాదనే అభిప్రాయం, బ్రిటిషు ప్రభుత్వానికి 2008 వరకు అలాగే ఉండిపోయింది. ఈ అభిప్రాయం కలిగి ఉన్న ఏకైక దేశం ఇది. [23] బ్రిటిషు విదేశాంగ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్, ఇది 20 వ శతాబ్దం ప్రారంభంలో భౌగోళిక రాజకీయాలలో ఉద్భవించిన కాలవైపరీత్యం (అనాక్రోనిజం) అని పేర్కొన్నాడు. [24] 2008 అక్టోబరు 29 న టిబెట్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించి, తదనుగుణంగా తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన విడుదల చేయడంతో బ్రిటన్ ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లైంది.. [d] బ్రిటిషు విదేశాంగ కార్యాలయం వెబ్‌సైటులో సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ, విదేశాంగ కార్యాలయ అధికారులు "బ్రిటన్‌కు సంబంధించినంతవరకూ, టిబెట్ చైనాలో భాగం. ఫుల్ స్టాప్." అని అన్నారని ది ఎకనామిస్ట్ పత్రిక రాసింది.

బ్రిటిషు ప్రభుత్వం తమ కొత్త వైఖరిని తమ అభిప్రాయాన్ని నవీకరించడంగా చూస్తుంది, మరికొందరు దీనిని బ్రిటిష్ అభిప్రాయంలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పుగా భావించారు. [e] టిబెటాలజిస్ట్ రాబర్ట్ బార్నెట్, ఈ నిర్ణయం విస్తృత ప్రభావాలుంటాయని భావించాడు. ఉదాహరణకు, ఈశాన్యంలో కొంత భాగం విషయంలో భారతదేశం చేసే వాదన చాలావరకు భారత, టిబెట్‌ల సరిహద్దును నిర్ణయించిన 1914 సిమ్లా ఒప్పందంలో మార్పిడి చేసుకున్న గమనికల పైనే ఆధారై ఉంటుంది. బ్రిటిషు వారు వాటిని పక్కకు పెట్టేసినట్లే కనిపిస్తుంది. [19] అంతర్జాతీయ ద్రవ్య నిధికి చైనా ఎక్కువ నిధులు ఇస్తున్నందున దానికి బదులుగా బ్రిటన్, తన అభిప్రాయంలో ఈ మార్పు చేసుకుందని భావించారు [25] [26]

మ్యాపులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. 1.0 1.1 బ్రిటిషు, టిబెట్ ప్లీనిపొటెన్షియరీలు ఈ మ్యాపుకు 1914 మార్చి 24/25 తేదీల్లో తుది రూపాన్నిచ్చారు. భారత వర్గాలు ఇప్పుడూ ఏం చెబుతున్నాయంటే, ఈ రేఖ గురించి చెప్పినపుడు, చైనా ప్లీనిపొటెన్షియరీ అసమ్మతి ఏమీ తెలుపలేదు.[3]

    సరిహద్దులను వివరించే రెండు పటాలపై (1914 ఏప్రిల్ 27, 1914 జూలై 3) టిబెటన్ ప్లీనిపోటెన్షియరీ పూర్తి సంతకాలు ఉన్నాయి; మొదటి దానిపై చైనా ప్లీనిపోటెన్షియరీ పూర్తి సంతకం కూడా ఉంది; రెండవ దానిపై టిబెటన్, బ్రిటిష్ ప్లీనిపోటెన్షియరీల సంతకాలతో పాటు ముద్రలు కూడా ఉన్నాయి. (V. అట్లాస్ ఆఫ్ ది నార్త్ ఫ్రాంటియర్ ఆఫ్ ఇండియా ', న్యూ ఢిల్లీ: విదేశాంగ మంత్రిత్వ శాఖ 1960 లోని రెండు పటాల ఫోటోగ్రాఫిక్ పునరుత్పత్తి)

    సిన్హా (1966), p. 37

    (గోల్డ్‌స్టీన్ (1991), p. 80 భారత కార్యాలయ రికార్డులు IOR/L/PS/10/344 ను ఉటంకిస్తూ).

    భారత ప్రభుత్వం 1914 ఫిబ్రవరి-మార్చి లో టిబెటన్లతో డేలిలో ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించింది (సిమ్లా శీతాకాలం నుండి వెనక్కి తగ్గారు) ప్రతిపాదిత ఎలైన్‌మెంటుకు టిబెట్ సమ్మతిని పొందాలనే ఉద్దేశ్యంతో.

    —గుప్తా, కరుణాకర్, ది మెక్‌మహాన్ లైన్ 1911–45: ది బ్రిటిష్ లెగసీ
  2. స్మిత్ (1996), p. 201 (note 163), స్మిత్ (2019), p. 212 (note 163): "సిమ్లా ఒప్పందం, దాని అనుబంధిత ఇండో-టిబెటన్ ఒప్పందం 1929 చివరి ఎడిషన్తో సహా ఐచిసన్ ఒప్పందాలలో (అధికారిక GOI రికార్డ్) కనిపించలేదు. ఎందుకంటే ధృవీకరణ కాకుండా సిమ్లా ఒప్పందం అంతర్జాతీయంగా చెల్లుబాటు అయ్యే ఒప్పందం కాజాలదు. భారత-టిబెట్ ఒప్పందమేమో రహస్యమైనది. 1929 ఎడిషన్‌ను బ్రిటిష్ భారతీయ అధికారి ఓలాఫ్ కారో 1938 లో ఉపసంహరించి, సిమ్లా ఒప్పందం, మెక్‌మహన్-షర్త్రా నోట్స్ (కానీ ఆంగ్లో-టిబెటన్ ఒప్పందం గానీ, మెక్‌మహన్ రేఖ మ్యాప్ గానీ కాదు) తో కూడిన కొత్త ఎడిషన్‌ను జారీ చేసాడు. లాంబ్, మక్ మహోన్ లైన్, 546."
  3. కాల్విన్ (1984): "ఈ రేఖను పెద్ద స్కేలు మ్యాపు మీద (అంగుళానికి ఎనిమిది మైళ్ళు) గుర్తించారు. ఇన్నర్ టిబెట్- ఔటర్ టిబెట్ సరిహద్దుపై చర్చలలో ఉపయోగించిన చాలా చిన్న-స్కేలు మ్యాప్‌లో, మక్ మహోన్-టిబెటన్ సరిహద్దును (ఇది మక్ మహోన్ రేఖ అవుతుంది) ఇన్నర్ టిబెట్, చైనాల మధ్య సరిహద్దుకు ఒక విధమైన అనుబంధంగా మాత్రమే చూపారు."
  4. మిలిబాండ్, డేవిడ్, "Written Ministerial Statement on Tibet (29/10/2008)", బ్రిటిషు విదేశాంగ శాఖ వెబ్‌సైటు, archived from the original on 2 December 2008: "20 వ శతాబ్దం ప్రారంభంలో టిబెట్ యొక్క స్థితిపై UK తీసుకున్న స్థానం వలన మా అభిప్రాయాన్ని చెప్పగల మా సామర్థ్యం కొన్నిసార్లు మసకబారింది. అప్పటి భౌగోళిక-రాజకీయాలపై ఆధారపడి ఆ స్థానం తీసుకున్నాం. టిబెట్‌లో చైనా యొక్క "ప్రత్యేక స్థానం" గురించి మా గుర్తింపు "సుజరైంటీ" అనే పాతబడిపోయిన భావన నుండి వచ్చింది. కొంతమంది మేము పెట్టుకున్న లక్ష్యాలపై సందేహాలు కలిగించడానికి, చైనా స్వంత భూభాగంలోని చాలా భాగంపై దాని సార్వభౌమత్వాన్ని నిరాకరిస్తున్నామని చిత్రీకరించడానికీ కొందరు దీనిని ఉపయోగించారు. మేము టిబెటన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వడం లేదని చైనా ప్రభుత్వానికి, బహిరంగంగా స్పష్టం చేశాం. ఇతర EU సభ్యదేశాల్లాగానే, యునైటెడ్ స్టేట్స్ మాదిరిగానే, మేము కూడా టిబెట్‌ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా భావిస్తాం. దీర్ఘకాలిక స్థిరత్వమే మా ఆసక్తి. మానవ హక్కుల పట్ల గౌరవం వలన, టిబెటన్లకు ఎక్కువ స్వయంప్రతిపత్తి ఇవ్వడం వలనా మాత్రమే ఇది సాధ్యం."
  5. లున్ (2009), p. 7: ""అయితే, 2008 అక్టోబరులో, బ్రిటిషు అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పుగా కొందరు భావించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక తాజాకరణగా చూసింది. 'చైనీస్ సుజరైంటి' అనే భావన అస్పష్టంగా ఉంది కాబట్టి, కాలదోషం పట్టింది కాబట్టీ దాన్ని వదిలేస్తున్నట్లుగా ఇందులో ఉంది."

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Convention Between Great Britain, China, and Tibet, Simla (1914)", Tibet Justice Center. Retrieved 20 March 2009
  2. "Convention Between Great Britain, China, and Tibet, Simla (1914)", Tibet Justice Center. Retrieved 20 March 2009
  3. 3.0 3.1 Sinha (1974), p. 12
  4. Banerji, Borders (2007).
  5. 5.0 5.1 Hoffmann (1990).
  6. "Convention Between Great Britain and Tibet (1904)", Tibet Justice Center Archived 10 మార్చి 2009 at the Wayback Machine. Retrieved 20 March 2009
  7. 7.0 7.1 Zhu, Yuan Yi (2020). "Suzerainty, Semi-Sovereignty, and International Legal Hierarchies on China's Borderlands". Asian Journal of International Law. Cambridge University Press: 1–28. doi:10.1017/S204425132000020X.
  8. Convention Between Great Britain and Russia (1907) Article II, Tibet Justice Center Archived 10 మార్చి 2009 at the Wayback Machine
  9. "Proclamation Issued by His Holiness the Dalai Lama XIII (1913)", Tibet Justice Center Archived 10 మార్చి 2009 at the Wayback Machine. Retrieved 20 March 2009
  10. Maxwell 1970
  11. Calvin, James Barnard, "The China-India Border War", Marine Corps Command and Staff College, April 1984
  12. Maxwell 1970
  13. McKay, Alex, The History of Tibet: The modern period: 1895–1959, the Encounter with modernity, p. 136.
  14. UK relations with Tibet Archived 2012-05-05 at the Wayback Machine, Free Tibet Campaign. Retrieved 20 March 2009. "... in 1917, the Communist Government in Russia repudiated all the international engagements of the tsars, ... in 1921, the 1907 Treaty was cancelled by agreement."
  15. Guruswamy, Mohan, "The Battle for the Border", Rediff, 23 June 2003.
  16. Banerji, Arun Kumar, "China, The British And Tawang", The Statesman, 24 April 2011.
  17. Schedule of the Simla Convention, 1914 Archived 12 సెప్టెంబరు 2006 at the Wayback Machine
  18. Goldstein 1991, p. 307.
  19. 19.0 19.1 Robert Barnett, Did Britain Just Sell Tibet?, The New York Times, 24 November 2008
  20. "Neville Maxwell discloses document revealing that India provoked China into 1962 border war". South China Morning Post. 6 July 2017.
  21. "Border games. Rectifying an inconvenient history". TibetInfoNet. 8 November 2009. Archived from the original on 2 సెప్టెంబరు 2010. Retrieved 14 August 2010.
  22. China revives claims on Indian territory IRNA, Islamic Republic News Agency (IRNA No.035 05/04/2005 14:22) republished under the same name, globalsecurity.org,
  23. Staff, Britain's suzerain remedy, The Economist, 6 November 2008
  24. Lunn (2009).
  25. Forsyth, James (the web editor of The Spectator). Have Brown and Miliband sold out Tibet for Chinese cash? Archived 3 డిసెంబరు 2008 at the Wayback Machine, website of The Spectator, 25 November 2008.
  26. Editorial The neglect of Tibet, The Daily Telegraph, 11 March 2009.