1955 ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు 1955 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. శాసనసభ లోని 167 స్థానాలకు గాను 581 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రంలో 29 ద్విసభ్య నియోజకవర్గాలు, 138 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.[1] మామూలుగా ఏ రాష్ట్ర శాసనసభలోనైనా సభ్యుల పదవీకాలం రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు. కానీ, తొలి శాసనసభ (1955–62) సభ్యులకు ఏడేళ్ల పదవీ కాలం అనుమతించబడింది. తొలి శాసనసభ ఏర్పడిన మరుసటి సంవత్సరమే (దాదాపు 20 నెలల తరువాత) కొత్త రాష్ట్రంలో విలీనమై అక్కడ ఎన్నికలు రావడం వలన ఈ ఏర్పాటు చేసారు. అంటే 1957లో కొత్తగా చేరిన తెలంగాణలో ఒక్క ప్రాంతంలోనే ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత 1962లో రాష్ట్రం మొత్తానికి సాధారణ ఎన్నికలు జరిపారు.[2]
మొత్తం 196 సీట్లన్నిటికీ 99 seats needed for a majority | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||
|
నేపథ్యం
మార్చు1953 అక్టోబరు 1న, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, 190 శాసనసభ స్థానాలతో 167 నియోజకవర్గాలతో ఏర్పడింది. 1956 నవంబరు 1న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్‌లో విలీనం చేసి, ఒకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విలీనమైనప్పుడు రాయచూర్, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేసారు. సిరుగుప్ప తాలూకా, బళ్లారి తాలూకా, హోస్పేట్ తాలూకా, మల్లాపురం ఉప తాలూకాలోని ఒక చిన్న ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసారు. రాయచూర్, గుల్బర్గా జిల్లాలు మైసూర్ రాష్ట్రానికి, మరఠ్వాడా జిల్లా బొంబాయి రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాయి.[3] కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో 85 నియోజకవర్గాలు, శాసనసభలో 105 అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి.
పార్టీల వారీగా ఫలితాలు
మార్చుపార్టీలు సంకీర్ణాలు | జనాదరణ పొందిన ఓటు | సీట్లు | |||||
---|---|---|---|---|---|---|---|
ఓటు | % | +/- | పోటీ చేశారు | గెలిచింది | +/- | ||
భారత జాతీయ కాంగ్రెస్ | 33,94,109 | 39.35% | 142 | 119 | |||
కృషికర్ లోక్ పార్టీ | 6,25,827 | 7.26% | 37 | 22 | |||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 26,85,251 | 31.13% | 169 | 15 | |||
ప్రజా సోషలిస్ట్ పార్టీ | 4,81,666 | 5.58% | 45 | 13 | |||
ప్రజా పార్టీ | 2,40,884 | 2.79% | 12 | 5 | |||
స్వతంత్రులు | 11,88,887 | 13.78% | 170 | 22 | |||
మూలం: భారత ఎన్నికల సంఘం [4] |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1955 : To the Legislative Assembly of Andhra Pradesh" (PDF). Election Commission of India. Retrieved 2014-11-17.
- ↑ p. 281, Rise of the Plebeians?: The Changing Face of the Indian Legislative Assemblies (), Christophe Jaffrelot, Sanjay Kumar, Routledge Taylor & Francis Group, 2009.
- ↑ "Reorganisation of States, 1955" (PDF). The Economic Weekly. 15 October 1955. Retrieved 25 July 2015.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1955". Election Commission of India. Retrieved 18 May 2022.