1962 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మద్రాసు రాష్ట్రానికి (ప్రస్తుతం తమిళనాడు) మూడవ శాసనసభ ఎన్నికలు 1962 ఫిబ్రవరి 21 న జరిగాయి. కె. కామరాజ్ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. ద్రవిడ మున్నేట్ర కజగం ఈ ఎన్నికల్లో 50 సీట్లను గెలుచుకుని రెండవ పెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జాతీయ కాంగ్రెస్ రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చిట్టచివరి ఎన్నికగా 1962 ఎన్నికలు నిలిచింది. ద్రావిడ రాజకీయ పార్టీల పెరుగుదల కారణంగా కాంగ్రెసు ఆధిపత్యం భారీగా తగ్గింది.

1962 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1957 1962 ఫిబ్రవరి 17-24 1967 →

మొత్తం 206 సీట్లన్నింటికీ
104 seats needed for a majority
Turnout70.65%
  First party Second party
 
Leader కె. కామరాజ్ సి.ఎన్. అన్నాదురై
Party భారత జాతీయ కాంగ్రెస్ ద్రవిడ మున్నేట్ర కజగం
Leader's seat సత్తూరు కాంచీపురం
(ఓటమి)
Seats won 139 50
Seat change Decrease 14[1] Increase 38[1]
Popular vote 5,848,974 3,435,633
Percentage 46.14% 27.10%
Swing Increase 0.80% స్వతంత్రులుగా పోటీచేసారు

ముఖ్యమంత్రి before election

కె. కామరాజ్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

కె. కామరాజ్
భారత జాతీయ కాంగ్రెస్

నియోజకవర్గాలు

మార్చు

ఇద్దరు సభ్యుల నియోజకవర్గాలు (రద్దు) చట్టం, 1961 ద్వారా 1961లో ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. 38 ద్విసభ్య నియోజకవర్గాలను రద్దు చేసి, అదే సమ్ఖ్యలో ఏక సభ్య నియోజకవర్గాలను ఏర్పరచారు. వాటిని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు రిజర్వు చేసారు. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 206. [2]

పార్టీలు, అంశాలు

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది. పెరియార్ EV రామసామి, కె. కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు:

నేను ముసలి వాడినయ్యాను, ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చు. నేను పోయిన తర్వాత కామరాజ్ తమిళుల ప్రయోజనాలను కాపాడతాడు. అతను నా వారసుడు. అభ్యర్థులు, ఓటర్లకు తమకు ఏది మంచిదో వాళ్ళకు ఎలాగూ తెలియదు, అది చెప్పగలిగేది కామరాజే, ఇంకెవరూ చెప్పలేరు. నా మాటకు కట్టుబడి కాంగ్రెస్‌కు ఓటు వేయండి, మీరు బాగుపడతారు. లేదంటే, తెలివైన రాజాజీ డీఎంకే గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చి కనికరం లేకుండా మీ అందరినీ తొక్కేస్తాడు.

కామరాజ్ EV రామస్వామి ప్రజాదరణను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. తమిళ జాతీయవాద ఆకాంక్షలను తనకు తాను ఆపాదించుకున్నాడు. 1962 ఫిబ్రవరిలో అతను రాష్ట్రంలో అంతర్గత సమాచారం కోసం రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును ప్రవేశపెట్టాడు. మదురైని రాజధాని నగరంగా ఏర్పాటు చేయాలని వాదించాడు. [3] 1962 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ద్రవిడ మున్నేట్ర కజగం లోని రెండు విభాగాలు ఎన్నికల పొత్తు విషయంలో మరింత దూరం జరిగాయి. EVK సంపత్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తుకు మొగ్గుచూపగా, సి. రాజగోపాలాచారి కొత్తగా ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీతో పొత్తుకు అన్నాదురై మొగ్గు చూపాడు. రాజాజీ, 1952, 1954 మధ్య మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి. డిఎంకెకు ప్రకటిత శత్రువు. ఇప్పుడు డిఎంకెతో పొత్తు కోసం ప్రయత్నించాడు. ఆయన మాటల్లో..

బహిరంగ మతోన్మాద పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీయే పెద్ద మతోన్మాద పార్టీ.

1961లో, "స్వయంప్రతిపత్తి కలిగిన తమిళ రాష్ట్రం" స్థాపనే లక్ష్యంగా సంపత్ DMKని విడిచిపెట్టి, తన స్వంత పార్టీ తమిళ్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించాడు.[4] స్వతంత్ర పార్టీని ఎన్నికల కూటమిలో చేర్చుకోలనే అన్నాదురై ఆలోచనకు డిఎంకె పార్టీలో పూర్తిగా మద్దతు లభించలేదు. రాజాజీ వ్యతిరేకించినప్పటికీ, డిఎంకె భారత కమ్యూనిస్ట్ పార్టీతో జతకట్టింది. ఇది ముత్తురామలింగ తేవర్ కు చెందినఫార్వర్డ్ బ్లాక్, మహమ్మద్ ఇస్మాయిల్ కు చెందిన ముస్లిం లీగ్‌తో కూడా సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది.[3][4]

తమిళ చిత్ర పరిశ్రమ మద్దతు

మార్చు

ప్రముఖ తమిళ సినీ నటుడు MG రామచంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం కోసం చురుకుగా ప్రచారం చేశాడు. మరొక నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్, తేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. శివాజీ గణేశన్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ఇచ్చి, చురుకుగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సినీ నటులతో తీసిన వక్కురిమై సినిమా తమిళనాడు అంతటా ఆడింది.[3][4]

మూలం : భారత ఎన్నికల సంఘం [5]

ఫలితాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
  • తమిళనాడులో ఎన్నికలు
  • తమిళనాడు శాసనసభ
  • తమిళనాడు ప్రభుత్వం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Madras Legislative Assembly, 1957-1962, a review" (PDF). assembly.tn.gov.in. March 1962. Archived from the original (PDF) on 17 February 2022.
  2. "The State Legislature - Origin and Evolution". Tamil Nadu Government. Archived from the original on 13 April 2010. Retrieved 27 November 2009.
  3. 3.0 3.1 3.2 Robert L. Hardgrave Jr.. "The DMK and the Politics of Tamil Nationalism".
  4. 4.0 4.1 4.2 Lloyd I. Rudolph. "Urban Life and Populist Radicalism: Dravidian Politics in Madras".Lloyd I. Rudolph (May 1961).
  5. "1962 Madras State Election Results, Election Commission of India" (PDF). Archived from the original (PDF) on 27 Jan 2013. Retrieved 19 April 2009.