1993 లాతూర్ భూకంపం
1993 లాతూర్ భూకంపం, భారతదేశంలో సెప్టెంబరు 30 ఉదయం 3:56 కు సంభవించింది. పశ్చిమ భారతదేశం లోని మహారాష్ట్ర ఈ భూకంపానికి ప్రధాన ప్రాంతము. ఈ భూకంపం ప్రాథమికంగా లాతూర్, ఒసామాబాద్ లో ప్రధాన కేంద్రంగా యేర్పడినది.[4] అంతర ఫలకల భూకంపంలో 52 గ్రామాలు పూర్తిగా నాశనం అయ్యాయి. మాగ్నిట్యూడ్ స్కేలుపై ఈ భూకంపం 6.2గా నమోదైనది. ఈ భూకంపం సందర్భంగా సుమారు 10,000 ప్రజలు మరణించారు. సుమారు 30,000 మంది గాయపడ్డారు. ఈ భూకంపం యొక్క హైపోకేంద్రము చుట్టూ సుమారు 10 కి.మీ. లోతునుకలిగి - సాపేక్షంగా లోతులేని - షాక్ తరంగాలను అనుమతించడం వలన అధికంగా నష్టం వాటిల్లింది. ఈ ప్రదేశం ప్లేట్ బౌండరీ పై లేని కారణంగా ఈ భూకంపానికి కారణంపై కొంత చర్చ జరిగింది. భూఫలకాలు మారడం మూలంగా వచ్చినదని ఒక సూచన చేయడం జరిగింది. భారతదేశ ఉపఖండం ఆసియా ఖండాన్ని నెట్టడం మూలంగా ఒత్తిడి యేర్పడినది. ఈ ఒత్తిడి ఫాల్ట్ రేఖల గుండా ఉత్పత్తి అయే అవకాశం ఉంది. మరొక వాదనగా టెర్నా అనే రిజర్వాయరు నిర్మాణం మూలంగా భూకంపం యేర్పడినది. ఈ రిజర్వాయరు మూలంగా ఫాల్ట్ రేఖలపై ఒత్తిడి పెరిగిందని కొందరి అభిప్రాయం.
తేదీ | సెప్టెంబరు 30 2013 |
---|---|
తీవ్రత | 6.2 Mw [1] |
లోతు | 10 కి.మీ. (6.2 మై.) [1] |
భూకంపకేంద్రం | 18°04′N 76°37′E / 18.07°N 76.62°E [1] |
రకం | Reverse [2] |
ప్రభావిత ప్రాంతాలు | India |
మొత్తం నష్టం | $280 million–1.3 billion [2] |
అత్యధిక తీవ్రత | VIII (Severe) [3] |
ప్రమాద బాధితులు | 9,748 dead [2] 30,000 injured [2] |
సహాయక చర్యలు
మార్చుచాలామంది విదేశీయులు, స్థానిక దాతలు వెంటనే స్పందించి ఆ భూకంప బాధితుల సహాయార్థం రెస్క్యూ బృందాలను పంపాయి. సోలాపూర్ లోని రైల్వే హాస్పటల్, వి.ఎం.మెడికల్ కళాశాల (సోలాపూర్) లకు చెందిన వైద్యులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు వైద్య సేవలనందించడమే కాక అనేక వారాల పాటు గాయపడిన వారికి వైద్యసేవలనందించారు. సహాయ సామాగ్రితో కూడిన 120 ట్రక్కులను మొదటి సారిగా అంతర్జాతీయ దాతలు పంపించారు. వీటిలో టెంటులు, దుప్పట్లు, ఆహారం, బట్టలు, వైద్య సామాగ్రై, తాత్కాలిక నివాసాలు వంటి వాటిని బాధితులకు పంపించారు. వీటిని 1993 అక్టోబరు 2 నాటికి బాధితులకు పంపించారు. భారతీయ సైన్యం, రాష్ట్ర రిజర్వ్ పోలీసు దళం, కేంద్ర రిజర్వు పోలీసు దళం, యితర సంస్థలు వెంటనే స్పందించే బాధితులకు రక్షణ, సహాయ సహకారాలను అందించారు.
అమెచ్యూర్ రేడియో పాత్ర
మార్చుమొట్టమొదటిసారిగా ముంబై, హైదరాబాద్ నుండి ఔత్సాహిక రేడియో ఆపరేటర్లు స్పందించిన వారిలో ఉన్నారు, వీరు లాతూర్ సమీపంలోని ఒమెర్గా అనే పట్టణానికి చేరుకున్నారు, అక్కడ నుండి భూకంపం సంభవించిన ప్రాంతాలన్నింటినీ రహదారి ద్వారా చేరుకోవచ్చు. ముంబైకి చెందిన జెఎన్‌ఎ వైర్‌లెస్ అసోసియేషన్ ప్రత్యేక మిషన్ ఈ భూకంపం గురించి పూర్తి సమాచారం.సంఘటనా వివరాలు చేపట్టింది. మహీంద్రా, మహీంద్రా ఈ ప్రయోజనం కోసం ఇచ్చిన వాహనాలతో, ముంబైకి చెందిన ఎనిమిది రేడియో హామ్‌ల బృందం ముంబై నుండి ఒమెర్గాకు బయలుదేరి వెళ్లింది. తరువాత, రేడియో ఆపరేటర్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి, వినాశనానికి గురైన ప్రతి గ్రామాలను సందర్శించారు, ఒమెర్గాలో ఏర్పాటు చేసిన ఒక కంట్రోల్ స్టేషన్‌కు వ్యాధుల వ్యాప్తి, ఆహార సరఫరా, వినాశనం వంటి ముఖ్యమైన సమాచారాన్ని ప్రసారం చేశారు. దాదాపు 1గ రోజుల పర్యటనలో, ఈ రేడియో హామ్స్ ఇచ్చిన సమాచారం, భారత ప్రభుత్వం, ప్రైవేట్ సహాయ సంస్థలు విపత్తు తగ్గించే ప్రయత్నాలకు చేపట్టిన చర్యలుకు విజయవంతంగా సహాయపడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 ISC (2016), ISC-GEM Global Instrumental Earthquake Catalogue (1900-2009), Version 3.0, International Seismological Centre
- ↑ 2.0 2.1 2.2 2.3 USGS (September 4, 2009), PAGER-CAT Earthquake Catalog, Version 2008_06.1, United States Geological Survey, archived from the original on 2015-03-28, retrieved 2016-05-06
- ↑ National Geophysical Data Center / World Data Service (NGDC/WDS), Significant Earthquake Database, National Geophysical Data Center, NOAA, doi:10.7289/V5TD9V7K
- ↑ "Earth Quake". Archived from the original on 9 ఫిబ్రవరి 2014. Retrieved 26 August 2014.