2013
2013 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 21:హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
- జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
- ఆగస్టు 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
- సెప్టెంబరు 21: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్లో ప్రారంభమైంది.
- సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
- అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
- డిసెంబరు 17: లోక్‌పాల్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
మరణాలు
మార్చు- జనవరి 6: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
- ఫిబ్రవరి 24: షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950)
- మార్చి 5: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)
- మార్చి 11: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
- మార్చి 14: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
- మార్చి 19: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)
- మార్చి 21: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (జ.1930)
- ఏప్రిల్ 14: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930)
- ఏప్రిల్ 17: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
- ఏప్రిల్ 21: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త (జ. 1940)
- మే 17: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.
- మే 18: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915)
- మే 24: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928)
- జూన్ 7 : జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు. [జ. ]
- జూన్ 20: ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. (జ.1928)
- జూలై 4: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
- జూలై 13: కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
- జూలై 21: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)
- ఆగష్టు 1: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)
- ఆగష్టు 3: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)
- ఆగష్టు 3: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)
- ఆగష్టు 15: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956)
- ఆగష్టు 21: మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)
- ఆగష్టు 30: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939)
- సెప్టెంబరు 5: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (జ.1925)
- సెప్టెంబరు 16: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ. 1920)
- సెప్టెంబరు 20: ఛాయరాజ్, కవి, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (జ. 1948)
- అక్టోబర్ 9: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (జ.1964)
- అక్టోబర్ 18: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)
- నవంబర్ 8: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1957)
- నవంబర్ 21: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)
- నవంబర్ 27: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
- డిసెంబరు 5: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (జ.1918)
- డిసెంబరు 7: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)
- డిసెంబరు 9: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)
- డిసెంబరు 10: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1927)