2009 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం

సెప్టెంబర్ 2, 2009 న కర్నూలు నుండి 40 నాటికల్ మైళ్ళ (74 కిలోమీటర్లు) దూరంలో ఉన్న రుద్రకొండ కొండ సమీపంలో ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఈ హెలికాప్టర్ బెల్ 430 హెలికాప్టర్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, VT-APG నమోదు చేయబడింది.

2009 ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదం
A Bell 430 similar to the helicopter involved in
the accident
సంఘటన సారాంశం సారాంశం
తేదీSeptember 2, 2009 (2009-09-02)
సారాంశంస్థితి నిర్ధారణ రాహిత్యము ఫలితంగా యాంత్రిక వైఫల్యం, పైలట్ తప్పిదం
ప్రదేశంకర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణాలు5
బ్రతికున్నవారు0
విమానం రకంBell 430
ఆపరేటర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విమాన రిజిస్ట్రేషన్VT-APG

ప్రమాదంసవరించు

ఈ బెల్ 430 హెలికాప్టర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొంత సమయానికే అననుకూల వాతావరణానికి గురైంది. అధికారిక ప్రమాద నివేదిక ప్రకారం విమానం యొక్క వాతావరణ రాడార్ ఎరుపు రంగుని సూచించింది, దీని అర్థం వాతావరణం ప్రమాదభరితంగా ఉన్నదని. విమాన సిబ్బంది వారి అనుకున్న మార్గమునకు కొద్దిగా ఎడమ వైపున ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నారు. పైలట్లు వాతావరణం మరీ అధ్వాన్నంగా మారడాన్ని గమనించి కృష్ణానది దాటిన తరువాత మలుపు తిరిగేందుకు నిశ్చయించుకున్నారు. ఉదయం 9:02 కి బేగంపేట, శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి, ఈ సమయానికి హెలికాప్టర్ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తున్నది. అయితే, కొంత సమయానికి 09:20 తరువాత ఫ్లైట్ సిబ్బంది ఆయిల్ ఒత్తిడి సరఫరా లో ఏర్పడిన సమస్యలను ఎదుర్కొవలసి వచ్చింది. పైలట్లు ఆయిల్ ఒత్తిడి సరఫరా లో ఏర్పడిన సమస్యలను నిలువరించేందుకు అత్యవసర తనిఖీ జాబితా విధానాలలోని ఆయిల్ ఒత్తిడి సరఫరా విభాగాన్ని కనుగొన్నారు, కానీ ఏర్పడిన సమస్యకు సరైన పరిష్కారమార్గం గుర్తించడం వారికి సాధ్యం కాలేదు. తరువాత వెంటనే సహ పైలట్ హెలికాప్టర్ ఏదో ప్రమాదానికి గురవబోతున్నదని భావించి ప్రమాద సూచికగా నిరంతరంగా గో ఆరౌండ్ అని అరిచాడు. ఆఖరి 14 సెకన్ల సమయంలో ఈ అరుపుల, కేకల పరంపరలు చాలా అధికంగా ఉన్నాయి. అ తరువాత హెలికాప్టర్ నియంత్రణ కోల్పోవడం వలన దాని ఫలితంగా అధిక వేగంగా తటాలున కిందికి దుమకడంతో క్రాష్ అయ్యింది. ఈ హెలికాప్టర్ నేలను ఢీకొన్న ప్రభావంతో పేలిపోయి తునాతునకలయ్యింది, అందులో ఉన్న వారంతా గాయాల పాలై మరణించారు.

అనంతర పరిణామంసవరించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం దేశం యొక్క చరిత్రలో అతిపెద్ద శోధన, రెస్క్యూ కార్యకలాపాలు ఒకటి ప్రారంభించింది. రాష్ట్ర భద్రతా అధికారులు అననుకూల వాతావరణం శోధన, రెస్క్యూ ప్రయత్నాలకు ప్రతిబంధకంగా ఉందని పేర్కొనడం జరిగింది. ఈ ఆపరేషన్ కోసం భారతదేశం యొక్క హోం మంత్రిత్వ శాఖ 5000 మంది CRPF సైనికులను పంపింది, ఇదే సమయంలో భారతదేశం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ కూంబ్ ప్రాంతానికి తక్కువ ఎత్తులో ఉపయోగించగల విమానాలను, థెర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు కలిగియున్న సుఖోయ్-30MKI విమానాన్ని పంపించమని భారత వైమానిక దళానికి ఆదేశాలిచ్చారు. అదనంగా, ఆరు జిల్లాలు నుండి పోలీసు సిబ్బంది గ్రౌండ్ శోధనలో నిమగ్నమయ్యారు. అక్కడి అడవి భూభాగంతో బాగా పరిచయమున్న ఆంధ్రప్రదేశ్ యాంటీ నక్సల్ దళాలు కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళాయి. రాష్ట్రం యొక్క ఈ భాగం నుండి స్థానిక గిరిజన నివాసితులు శోధన మిషన్ కు సహాయకులుగా ఉన్నారు. గస్తీ పార్టీలు కూడా హెలికాప్టర్ అవశేషాల కోసం కృష్ణా నదిలో గాలించారు. ఇస్రో యొక్క RISAT-2 ఉపగ్రహాన్ని కూడా అన్వేషణ ప్రాంతంలో మోహరించారు, కానీ ఇది అందించిన ఈ ప్రాంత అధిక రిజల్యూషన్ చిత్రాలతో హెలికాప్టర్ కనిపెట్టడం సాధ్యం కాలేదు. చివరకు హెలికాప్టర్ తో సంబంధాలు కోల్పోయిన 24 గంటల కంటే తక్కువ సమయంలోనే 08:20 కు IAF Mi-8 హెలికాప్టర్ సిబ్బంది కూలిపోయిన హెలికాప్టర్ శిధిలాల ప్రదేశంను కనుగొన్నారు.

ఇవి కూడా చూడండిసవరించు

వై.యస్. రాజశేఖరరెడ్డి

పావురాల గుట్ట

బయటి లింకులుసవరించు