2017 లాస్ వెగాస్ షూటింగ్ ఘటన

2017 అక్టోబరు 1న అమెరికాలోని నెవాడా ప్రాంతంలోనున్న లాస్ వెగాస్ లోని ఒక సంగీత కచేరీలో సామూహిక కాల్పులు జరిగాయి.[2] ఒక సాయుధ వ్యక్తి జనం మీదకు కాల్పులు జరిపాడు. ఈ ఘటన లాస్ వెగాస్ బొలెవర్డ్ లోని మాండలె బే రిసార్ట్ అండ్ కసినో భవనంలోని 32వ అంతస్తు నుండి జరిగింది. సంగీత కచేరీ ఆఖరి ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సాయుధ వ్యక్తిని 64 యేళ్ళ స్టీఫన్ ప్యాడక్ గా గుర్తించారు. నేరం వెనుక ఆ వ్యక్తికున్న ఉద్దేశం ఇంకా తెలియలేదు. ఘటనానంతరం అతను అతని గదిలో, గన్ వలన ఐన గాయంతో చనిపోయి దొరికాడు.[3] మొత్తం 59 మంది చనిపోయిన ఈ ఘటనలో, మరో 530 మంది గాయాలపాలయ్యారు. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద మారణహోమం.[4]

2017 లాస్ వెగాస్ షూటింగ్ ఘటన
1
2
1
Mandalay Bay Hotel
2
Route 91 Harvest country music festival grounds
ప్రదేశంలాస్ వెగాస్ స్ట్రిప్, పారడైజ్,యునైటెడ్ స్టేట్స్
భౌగోళికాంశాలు36°5′42″N 115°10′18″W / 36.09500°N 115.17167°W / 36.09500; -115.17167
తేదీఅక్టోబరు 1, 2017 (2017-10-01)
సుమారు 10:05 – 10:15 p.m. (PDT; UTC−07:00)
లక్ష్యం91 హార్వస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ - 91వ మార్గం
దాడి రకం
మాస్ షూటింగ్, హత్య-ఆత్మహత్య
ఆయుధాలు24 తుపాకులు,వాటిలో:[1]
మరణాలు59 (including the perpetrator)
ప్రాణాపాయ గాయాలు
851 (422 by gunfire)
నేరస్తుడుస్టీఫెన్ పాడక్

పూర్వరంగం

మార్చు

2014 నుండి లాస్ వెగాస్ లో సంగీత సంబరాలు జరుగుతూ ఉన్నాయి. 15 ఎకరాల స్థలంలో బాహ్యప్రదేశంలో సంగీత కచేరీ జరుగుతుంది. కాల్పులు జరిపిన ప్రదేశానికి ఈ స్థలం 450 మీటర్ల దూరంలో ఉంది. అక్టోబరు 1 న ఈ సంబరాల ఆఖరి రోజున ఆఖరి ప్రదర్శన జరుగుతున్న సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. 2017 సంబరాలకు 22,000 మంది హాజరయ్యారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Las Vegas shooting: This is what investigators found in Stephen Paddock's hotel room". KTNV-TV. January 19, 2018. Retrieved January 31, 2018.
  2. లాస్ వెగాస్‌లో కాల్పులు.. 50 మంది మృతి - సాక్షి పత్రిక వార్త[permanent dead link]
  3. తెలుగు విశేష్ లో వార్త[permanent dead link]
  4. "ఈనాడు వార్త". Archived from the original on 2017-10-05. Retrieved 2017-10-04.