2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు

న్యూజీలాండ్ మసీదు కాల్పులు 2019 మార్చి 15న న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం ప్రకారం 13:40 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.10 నిమిషాలు) న్యూజీలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ సెంటర్లలో జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం 40 మంది మరణించారని ఖచ్చితంగా తెలుస్తోంది.[1] అనేక కారు బాంబులు ఉన్నట్టు, వాటిని పట్టుకుని విజయవంతంగా డిఫ్యూజ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.[4] 1997 రౌరిము ఊచకోత తర్వాత న్యూజీలాండ్ లో ఇంతటి భారీ కాల్పుల ఘటన మళ్ళీ ఇదే.[5][6][7] నలుగురు కలిసి ఈ దాడుల్లో పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నారు. వారిలో 28-సంవత్సరాల ఆస్ట్రేలియన్ అయిన బ్రెంటాన్ టరాంట్ ఉన్నాడు. అతని తుపాకుల మీద, ఇంటర్నెట్ పోస్టుల్లోనూ నియో-నాజీ గుర్తులు, శ్వేత జాతి ఆధిక్య భావనకు చెందిన నినాదాలు రాసుకున్నాడు.[8][9] న్యూజీలాండ్ హెరాల్డ్ ప్రకారం దుండగుడు రాసుకున్న మేనిఫెస్టోలో వలసవాద వ్యతిరేక విధానానికి సంబంధించిన అంశాలున్నాయి.[10]

2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు
అల్ నూర్ మసీదు, 2006
పటం
అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ కేంద్రాల లొకేషన్
ప్రదేశంక్రైస్ట్ చర్చ్ నగరం, న్యూజీలాండ్
భౌగోళికాంశాలు43°31′58″S 172°36′42″E / 43.5329°S 172.6118°E / -43.5329; 172.6118
తేదీ2019 మార్చి 15
13:40 (న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం)
దాడి రకం
సామూహిక కాల్పులు
మరణాలు40+[1]
ప్రాణాపాయ గాయాలు
50+[2]
Suspected perpetrators
4 [3][4]

అల్ నూర్ మసీదు

మార్చు

రికార్టన్ ప్రాంతంలోని అల్ నూర్ మసీదు దాడులకు గురైన ప్రదేశాల్లో ఒకటి.[11]

చర్యలు

మార్చు

స్పందన

మార్చు

న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్‌డెర్న్ ఈ సంఘటనను ఖండిస్తూ ఇది న్యూజీలాండ్ చరిత్రలోని చీకటిరోజుల్లో ఒకటని పేర్కొన్నది.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Christchurch shootings left 40 people dead, New Zealand PM Jacinda Ardern says". 15 March 2019. Retrieved 15 March 2019.
  2. "Christchurch mosque shootings: Police respond to New Zealand incident, reports 9 dead". www.news.com.au. Retrieved 15 March 2019.
  3. "Four people arrested over Christchurch mosque attacks, 'significant' number of fatalities - police". 1NewsNow. Retrieved 15 March 2019.
  4. 4.0 4.1 "Watch: Christchurch mosque shooting - Four in custody". Radio New Zealand. 15 March 2019. Retrieved 15 March 2019.
  5. Leask, Anna (3 February 2017). "Raurimu 20 years on: the madman, the massacre and the memories". The New Zealand Herald (in New Zealand English). ISSN 1170-0777. Retrieved 15 March 2019.
  6. Graham-McLay, Charlotte; Ramzy, Austin (14 March 2019). "New Zealand Police Say Multiple Deaths in 2 Mosque Shootings in Christchurch". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 15 March 2019.
  7. "Mass shootings at New Zealand mosques". www.cnn.com. 15 March 2019. Retrieved 15 March 2019.
  8. "Australian man named as NZ mosque gunman". The West Australian (in ఇంగ్లీష్). 15 March 2019. Retrieved 15 March 2019.
  9. Times, The Washington (15 March 2019). "Brenton Tarrant, New Zealand mosque shooter, used Facebook Live record attack". The Washington Times. Retrieved 15 March 2019.
  10. 10.0 10.1 "న్యూజీలాండ్‌లో రెండు మసీదులపై కాల్పులు; పలువురి మృతి". బీబీసీ తెలుగు. 15 March 2019. Retrieved 15 March 2019.
  11. Sharman, Jon (15 March 2019). "Armed police deployed after shots fired at New Zealand mosque" (in ఇంగ్లీష్). The Independent. Retrieved 15 March 2019.