2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్ 2021-2023 రెండవ ఎడిషన్, 2023 జూన్ 7 నుండి 11 వరకు ఆస్ట్రేలియా & భారత్ మధ్య ది ఓవల్, లండన్, ఇంగ్లాండ్ లో జరిగింది.[1][2][3]

ఫైనల్‌కు రూట్ మార్చు

 ఆస్ట్రేలియా రౌండ్  భారతదేశం
ప్రత్యర్థి ఫలితం లీగ్ స్టేజ్ ప్రత్యర్థి ఫలితం
 ఇంగ్లాండు (H) ఆస్ట్రేలియా 4 – 0 ఇంగ్లాండ్ సిరీస్ 1  ఇంగ్లాండు (A) భారత్ 2 – 2 ఇంగ్లాండ్
 పాకిస్తాన్ (A) ఆస్ట్రేలియా 1 – 0 పాకిస్తాన్ సిరీస్ 2 న్యూజీలాండ్ (H) భారత్ 1 – 0 న్యూజీలాండ్
 శ్రీలంక (A) ఆస్ట్రేలియా 1 – 1 శ్రీలంక సిరీస్ 3  దక్షిణాఫ్రికా (A) భారత్ 1 – 2 దక్షిణాఫ్రికా
 వెస్ట్ ఇండీస్ (H) ఆస్ట్రేలియా 2 – 0 వెస్టిండీస్ సిరీస్ 4  శ్రీలంక (H) భారత్ 2 – 0 శ్రీలంక
 దక్షిణాఫ్రికా (H) ఆస్ట్రేలియా 2 – 0 దక్షిణాఫ్రికా సిరీస్ 5  బంగ్లాదేశ్ (A) భారత్ 2 – 0 బంగ్లాదేశ్
 భారతదేశం (A) ఆస్ట్రేలియా 1 – 2 భారత్ సిరీస్ 6  ఆస్ట్రేలియా (H) భారత్ 2 – 1 ఆస్ట్రేలియా
లీగ్ స్టేజ్ మొదటి స్థానం
స్థానం జట్టు ఆడినవి గెలుపు ఓటమి డ్రా PC పాయింట్స్ %
1  ఆస్ట్రేలియా 6 4 1 1 228 152 66.67
In reference to number of series played
ఫైనల్ లీగ్ స్టాండింగ్స్ లీగ్ స్టేజ్ రెండో స్థానం
స్థానం జట్టు P W L D PC Pts PCT
2  భారతదేశం 6 4 1 1 216 127 58.80
In reference to number of series played
2023

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్

జట్టు సభ్యులు మార్చు

ఆస్ట్రేలియా[4] భారత్[5]
  • పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌)
  • స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్‌)
  • స్కాట్ బొలాండ్
  • ఆలిస్ క్యారీ (వికెట్ -కీపర్)
  • కామెరాన్ గ్రీన్
  • మార్కస్ హర్రీస్
  • జోష్ హేజిల్‌వుడ్
  • ట్రావిస్ హెడ్
  • జోష్ ఇంగ్లిస్
  • ఉస్మాన్ ఖజా
  • మారన్స్ లబుషేన్‌
  • నాథన్ లియోన్
  • టాడ్ ముర్ఫి
  • మైఖేల్ నెజర్
  • మిచెల్ స్టార్క్‌
  • డేవిడ్ వార్నర్‌

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ వివరాలు మార్చు

  • మొదటి రోజు : టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (43; 8 ఫోర్లు), మార్నస్‌ లబుషేన్‌ (26), ఉస్మాన్‌ ఖవాజా (0) డకౌటయ్యాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్‌, శార్దూల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ట్రావిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146 బ్యాటింగ్‌; 22 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్టీవ్‌ స్మిత్‌ (227 బంతుల్లో 95 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) క్రీజ్ లో ఉన్నారు. టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్లో మొదటి సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా ట్రావిస్‌ హెడ్‌ రికార్డు సృష్టించాడు.[7][8]
  • రెండో రోజు: ఆస్ట్రేలియా 469 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, మహ్మద్ షమీ, థాకూర్ చెరో 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 తీయగా, మరో వికెట్ రనౌట్ రూపంలో ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 151/5 స్కోరుతో నిలిచింది. రోహిత్‌ (15), గిల్‌ (13), పుజార (14), కోహ్లీ (14), జడేజా (48) ఔటవ్వగా, క్రీజులో రహానె (29 బ్యాటింగ్‌), భరత్‌ (5 బ్యాటింగ్‌) ఉన్నారు.[9]
  • మూడో రోజు : భారత తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయింది. రహానే 129 బంతుల్లో 89 పరుగులు, శార్దూల్ ఠాకూర్ (51) చేయడంతో భారత జట్టు స్కోర్ 270 పరుగులు దాటడంతో ఫాలోఆన్ గండం తప్పించారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్ల వద్ద 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా హెడ్ 18, స్మిత్ 34, డేవిడ్ వార్నర్ 1, ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు ఔటవ్వగా, లబుషేన్ 41, కామెరూన్ గ్రీన్ 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యంతో కలిపి 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.[10]
  • నాల్గొవ రోజు : ఆస్ట్రేలియా 123/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి 270/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. దీనితో ఆస్ట్రేలియా భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో 40 ఓవర్లలో 164/3 పరుగులు చేసింది. గిల్‌ (18), పుజార (27), రోహిత్‌ (43) ఔటవ్వగా విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌), రహానె (20 బ్యాటింగ్‌) చేస్తూ క్రీజులో ఉన్నారు.[11][12]
  • ఐదో రోజు: చివరి రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వరుస వికెట్లను కోల్పోయి 234పరుగులకు ఆలౌట‌య్యింది. దీనితో 209 పరుగుల తేడాతో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి 2023 ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ గెలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌లో లియాన్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, క‌మిన్స్ ఒక వికెట్ తీశారు.[13]

ప్రైజ్ మ‌నీ మార్చు

  • ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియాకు టెస్టు గ‌ద‌తో పాటు రూ. 13 కోట్లు (1.6 మిలియ‌న్ డాల‌ర్లు), ర‌న్న‌ర‌ప్‌గా భార‌త జ‌ట్టుకు రూ. 6.5 కోట్లు(8 ల‌క్ష‌ల డాల‌ర్లు) బ‌హుమ‌తిగా ల‌భించాయి.[14]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (7 June 2023). "ఈసారైనా దక్కేనా?". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  2. Eenadu (7 June 2023). "అందేనా గద.. ఈసారైనా". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  3. Mana Telangana (7 June 2023). "టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  4. "Hazlewood in as Aussies trim WTC final squad". Cricket Australia. Retrieved 29 May 2023.
  5. "India squad for ICC World Test Championship 2023 Final". Board of Control for Cricket in India. Retrieved 25 April 2023.
  6. Eenadu (6 June 2023). "ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్.. షెడ్యూల్‌, ప్రైజ్‌మనీ...?". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  7. Andhra Jyothy (8 June 2023). "ఆ ఇద్దరూ ఆడేసుకున్నారు!". Archived from the original on 8 June 2023. Retrieved 8 June 2023.
  8. Eenadu (8 June 2023). "తొలి రోజు కంగా'రూల్‌'". Archived from the original on 8 June 2023. Retrieved 8 June 2023.
  9. Andhra Jyothy (9 June 2023). "బ్యాటింగ్‌లోనూ అదే తీరు." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  10. Eenadu (10 June 2023). "సవాలుకు సిద్ధమా?". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  11. Andhra Jyothy (11 June 2023). "అద్భుతం చేస్తారా?". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  12. Eenadu (11 June 2023). "ఓవల్‌లో అద్భుతం జరగాలి". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  13. Andhra Jyothy (12 June 2023). "పోరాటమే లేకుండా." Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  14. Namasthe Telangana (11 June 2023). "భార‌త్, ఆస్ట్రేలియాకు ద‌క్కిన‌ ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?". Retrieved 11 June 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)