29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1998 జనవరి 10 నుండి జనవరి 20 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[2][3]
29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 10-20 జనవరి 1998 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ది కింగ్ ఆఫ్ మాస్క్స్" |
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "వు టియాన్మింగ్" దర్శకత్వం వహించిన "ది కింగ్ ఆఫ్ మాస్క్స్" (చైనీస్ సినిమా)
- ఉత్తమ చిత్రం: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఫర్హాద్ మెహ్రాన్ఫర్" దర్శకత్వం వహించిన "పేపర్ ఎయిర్ ప్లేయిన్స్" (ఇరానియన్ సినిమా)
- స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ నెమలి: " సంత్వానా బార్డోలోయ్" అస్సామీ సినిమా "అదజ్య"[3]
మూలాలు
మార్చు- ↑ "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 3 July 2021.
- ↑ "Light In The Haze". Retrieved 3 July 2021.
- ↑ 3.0 3.1 http://www.frontline.in/static/html/fl1503/15030800.htm
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.