28వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
28వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1997 జనవరి 10 జనవరి 20 వరకు తిరువనంతపురంలో జరిగింది.[1] అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి జె.హెచ్. పటేల్, కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను ఆరోపించిన తరువాత హిందీ చిత్ర పరిశ్రమ వారు ఈ చిత్రోత్సవంను బహిష్కరించారు. పండుగకు ఆతిథ్యమిచ్చిన కె. కరుణకరన్ ద్వారా ముఖ్య అతిథిగా వచ్చాడు.[2]
28వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 10-20 జనవరి 1997 |
కనకక్కున్న ప్యాలెస్‌లో కేరళ ముఖ్యమంత్రి ఇ.కె. నాయనర్ ఈ చిత్రోత్సవాన్ని ప్రారంభించాడు. అమెరికన్ బయోపిక్ మైఖేల్ కాలిన్స్ సినిమా మొదటి చిత్రంగా ఎంపికవ్వగా,[3] ఇటాలియన్ నటుడు మార్సెల్లో మాస్ట్రోయాని చివరగా నటించిన త్రీ లైవ్స్ అండ్ ఓన్లీ వన్ డెత్ సినిమా ప్రదర్శనతో ఆయనకు నివాళి అర్పించారు.[1] మైక్ లీ డ్రామా సీక్రెట్స్ అండ్ లైస్ సినిమా ప్రదర్శనతో చిత్రోత్సవం ముగిసింది.[4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]
అధికారిక ఎంపికలు
మార్చుప్రారంభ సినిమా
మార్చు- మైఖేల్ కాలిన్స్
ముగింపు సినిమా
మార్చు- సీక్రెట్స్ అండ్ లైస్
భారతీయ పనోరమా
మార్చుపేరు | దర్శకుడు | భాష |
---|---|---|
డాటర్స్ ఆఫ్ సెంచరీ | దీపా మెహతా | హిందీ |
ఫైర్ | తపన్ సిన్హా | హిందీ |
లాల్ దర్జా | బుద్ధదేవ్ దాస్‌గుప్తా | బెంగాలీ |
క్రౌర్య[8] | గిరీష్ కాసరవల్లి | కన్నడ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Bamzai, Kaveree (11 January 1997). "FFI boycott fails to diminish global film fest". The Indian Express. Archived from the original on 14 June 1997. Retrieved 3 July 2021.
- ↑ Desai, M. S. M. (21 December 1996). "Bollywood to boycott international film festival". The Indian Express. Archived from the original on 22 April 1997. Retrieved 3 July 2021.
- ↑ Bamzai, Kaveree (12 January 1997). "Lukewarm response to film on Gandhi". The Indian Express. Archived from the original on 22 April 1997. Retrieved 3 July 2021.
- ↑ "Classic end to poorly managed film festival". The Indian Express. 21 January 1997. Archived from the original on 22 April 1997. Retrieved 3 July 2021.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ "Kasaravalli ploughs a lonely furrow in a commercial arena". The Indian Express. 14 January 1997. Archived from the original on 22 April 1997. Retrieved 3 July 2021.