2 అవర్స్ లవ్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీప‌వార్ దర్శకత్వం వహించాడు. శ్రీ ప‌వార్‌, క్రితి గార్గ్‌, తనికెళ్ళ భరణి, నర్సింగ్ యాదవ్, అశోక్ వ‌ర్ధ‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 20 జులై 2019న నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయగా,[1] సినిమా 5 సెప్టెంబర్ 2019న విడుదలైంది.

2 అవర్స్ లవ్
దర్శకత్వంశ్రీపవార్
కథశ్రీపవార్
నిర్మాతశ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
తారాగణం
ఛాయాగ్రహణంప్రవీణ్ వనమాలి
కూర్పుశ్యామ్
సంగీతంగ్యాని
నిర్మాణ
సంస్థ
శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
విడుదల తేదీ
2019 సెప్టెంబరు 5 (2019-09-05)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా అధయ్ (శ్రీపవర్), కాఫీ షాప్‌లో పని చేసే అవికా (కృతి గర్గ్) తో ప్రేమలో పడతాడు. కానీ అవికా మాత్రం కొన్ని షరతులతో కేవలం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ప్రేమిస్తానని చెప్పి అధయ్ ను ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది చంపాలని ప్రయత్నిస్తారు, అధయ్ నయన ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ విలన్ గ్యాంగ్ ఎవరు? వారికి నయన కి మధ్య సంబంధం ఏంటి ? చివరికి నయన, అధయ్ కలిసారా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • శ్రీ ప‌వార్‌
  • క్రితి గార్గ్‌
  • తనికెళ్ళ భరణి
  • నర్సింగ్ యాదవ్
  • అశోక్ వ‌ర్ధ‌న్
  • అశోకరావు
  • శ్రీరాజ్
  • సాధు వర్మ
  • నితీష్ చంద్ర
  • అనురాగ్ చింటు
  • రాఖి
  • తేజ
  • రాము
  • లావణ్య రెడ్డి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
  • నిర్మాత: శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అఖిల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ ప‌వార్‌
  • సంగీతం: గ్యాని
  • సినిమాటోగ్రఫీ:ప్రవీణ్ వనమాలి
  • ఎడిటర్: శ్యామ్ వడవల్లి

మూలాలు మార్చు

  1. Sakshi (21 July 2019). "రెండు గంటల ప్రేమ". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. 10TV (5 September 2019). "రివ్యూ : 2 అవర్స్ లవ్" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు