34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

2003 చలన చిత్రోత్సవం

34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2003 అక్టోబరు 9 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఫెస్టివల్ డైరెక్టర్ నీలమ్ కపూర్ ఆధ్వర్యంతో ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[2] ఈ కార్యక్రమాలనికి నటుడు కమల్ హసన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు.[3][4]

34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on19 అక్టోబరు 2003
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ఎట్ ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్ నూన్"
Lifetime achievement"లివ్ ఉల్మాన్"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు

మార్చు
  • జీవన సాఫల్య పురస్కారం: "లివ్ ఉల్మాన్"
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "సమీరా మఖ్మల్‌బాఫ్" దర్శకత్వం వహించిన "ఎట్ ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్ నూన్" (ఇరానియన్ సినిమా)
  • మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "జేమ్స్ జర్నీ టు జెరూసలేం" ఇజ్రాయెల్ సినిమా దర్శకుడు "రానన్ అలెగ్జాండ్రోవిచ్"
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: "సుభద్రో చౌదరి" దర్శకత్వం వహించిన "ప్రోహోర్" (బెంగాలీ సినిమా)[8]

మూలాలు

మార్చు
  1. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2017-12-23. Retrieved 2021-07-02.
  2. "Premieres save the day for IFFI". 14 October 2003. Retrieved 2021-07-02.
  3. https://timesofindia.indiatimes.com/india/New-films-to-premiere-at-34th-IFFI/articleshow/222173.cms Deepak Sandhu served as the director for the festival.
  4. "...But It's IFFI". Retrieved 2021-07-02.
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
  8. "Iranian film gets Golden Peacock at IFFI 2003". 19 October 2003. Retrieved 2021-07-02.

బయటి లింకులు

మార్చు