33వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
33వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2002 అక్టోబరు 1 నుండి 10 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2][3] ఫెస్టివల్ డైరెక్టర్ దీపక్ సంధు ఆధ్వర్యంతో ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[4] దేవదాస్ రెట్రోస్పెక్టివ్ (జ్ఞాపకార్థం) ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి.[5] ఈ ఫెస్టివల్ నుండి "ఫిల్మ్ బజార్" స్థాపించబడింది.
33వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 10 అక్టోబరు 2002 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "లెటర్స్ టు ఎల్జా" |
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[6][7] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[8]
విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: ఇగోర్ మస్లెనికోవ్ దర్శకత్వం వహించిన "లెటర్స్ టు ఎల్జా" (రష్యన్ సినిమా)
- మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "జిర్ ఇ నూర్ ఇ మాహ్" ("అండర్ ది మూన్లైట్") ఇరానియన్ సినిమా దర్శకుడు రెజా మిర్కారిమి
- స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: రేవతి దర్శకత్వం వహించిన "మితర్, మై ఫ్రెండ్ ", మాగ్డి అహ్మద్ అలీ దర్శకత్వం వహించిన ఈజిప్టు సినిమా "అస్రార్ ఇఎల్-బనాట్"[4]
దేవదాసు రెట్రోస్పెక్టివ్
మార్చు- దేవదాస్ (1935 బెంగాలీ) ప్రమతేష్ బారువా
- దేవదాసు (1953 తెలుగు) వేదాంతం రాఘవయ్య
- దేవదాస్ (1955 హిందీ) బిమల్ రాయ్ చేత
- దేవదాస్ (2002 హిందీ) సంజయ్ లీలా భన్సాలీ
మూలాలు
మార్చు- ↑ "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2017-12-23. Retrieved 2021-07-02.
- ↑ "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 2021-07-02.
- ↑ "The Hindu Business Line : It's actually not so panoramic". www.thehindubusinessline.com. Retrieved 2021-07-02.
- ↑ 4.0 4.1 Gopalakrishnan, Amulya (8 November 2002). "Tame fare at the festival". frontline.in. Retrieved 2021-07-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Loved Devdas? See 7 versions at 33rd IFFI". 27 September 2002. Retrieved 2021-07-02 – via The Economic Times.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.