5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

1975 చలన చిత్రోత్సవం

5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1974 డిసెంబరు 30 నుండి 1975 జనవరి 12 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] భారత జాతీయ పక్షి నెమలిని సూచించే శాశ్వత చిహ్నాం ఈ ఐదవ చిత్రోత్సవంలో ఏర్పాటుచేశారు. "వసుధైవ కుటుంబకం" (ప్రపంచం మొత్తం ఒక కుటుంబం) శాశ్వత నినాదంతో ఈ చిత్రోత్సవం జరిగింది. అదే సంవత్సరంలో భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రత్యామ్నాయంగా "ఫిల్మోత్సవ్" పేరుతో పోటీలేకుండా సినిమా ప్రదర్శన కూడా నిర్వహించాలని నిర్ణయించారు.[2]

5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on12 జనవరి 1975
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"డ్రీమింగ్ యూత్"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[3][4] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[5]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: జెనోస్ రోజ్సేస్ దర్శకత్వం వహించిన "డ్రీమింగ్ యూత్" (హంగేరియన్ సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: ఆటోమేటిక్ (చెకోస్లోవాకిన్ సినిమా)

మూలాలు

మార్చు
  1. "English Releases". Retrieved 4 July 2021.
  2. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
  3. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
  4. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
  5. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.