6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1977 జనవరి 3 నుండి జనవరి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] విదేశీ చలన చిత్రోత్సవాలలో అవార్డులు గెలుచుకున్న భారతీయ చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా నిలిచాయి.[2] ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, లఘుచిత్రానికి సిల్వర్ పీకాక్ అవార్డులతోపాటు తొలిసారిగా ఉత్తమ లఘుచిత్రానికి కాంస్య నెమలి అవార్డను ఏర్పాటుచేసింది. ఈ ఎడిషన్ నుండి ప్రతి ఏటా జనవరి 3–17 ఈ చిత్రోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించబడింది. "ఇండియన్ మోషన్ పిక్చర్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్" (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మొదటిసారిగా ఒక ఫిల్మ్ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఎడిషన్ నుండి "ఇండియన్ పనోరమా విభాగం" స్థాపించబడింది.[3]
6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 16 జనవరి 1977 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "బ్రదర్ అండ్ సిస్టర్" |
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: తదాషి ఇమై దర్శకత్వం వహించిన "బ్రదర్ అండ్ సిస్టర్" (జపనీస్ సినిమా)
- ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఆఫ్టర్ ది సైలెన్స్" (భారతీయ సినిమా)
మూలాలు
మార్చు- ↑ "6th International Film Festival of India" (PDF). Archived from the original (PDF) on 2017-05-02. Retrieved 4 July 2021.
- ↑ "English Releases". Retrieved 4 July 2021.
- ↑ "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.