51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2021 జనవరి 16 నుండి 24 వరకు గోవాలో జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రోత్సవం హైబ్రిడ్‌గా జరిగింది, వివిధ విభాగాలలో 224 సినిమాలలో 50 సినిమాలు భౌతిక, వర్చువల్ స్క్రీనింగ్ జరిగింది.[1][2][3] ఈ చిత్రోత్సవం 'కంట్రీ ఆఫ్ ఫోకస్' విభాగంలో నాలుగు సినిమాలతో బంగ్లాదేశ్ దేశం ఉంది.[4]
51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
2021 జనవరి 18న ఇండియన్ పనోరమా విభాగంలో నాన్-ఫీచర్ ఫిల్మ్‌లో శ్రీధర్ రూపొందించిన ఫిల్మ్ ఇన్ అవర్ వరల్డ్‌ను ప్రీమియర్ చేయడం ద్వారా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ని హైలైట్ చేసింది[1]
చిత్రోత్సవంలో 2021 జనవరి 16న ప్రారంభ, 2021 జనవరి 24న ముగింపు వేడుకలు డిడి ఇండియా, డిడి నేషనల్ ఛానల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి.[5]
నివాళి
మార్చుప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రే శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు నివాళిగా రే తీసిన క్లాసిక్ సినిమాలను ప్రదర్శించారు:[6]
- చారులత (1964)
- ఘరే బైరే (1984)
- పథేర్ పాంచాలి (1955)
- శత్రంజ్ కే ఖిలారి (1977)
- సోనార్ కెల్లా (1974)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా కొన్ని సినిమాలను ప్రదర్శించారు:
- నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో (శ్యామ్ బెనెగల్)[7]
విజేతలు
మార్చు51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విజేతలు:[8][9]
- గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం) : ఇంటు ది డార్క్‌నెస్
- వెండి నెమలి:
- ఉత్తమ దర్శకుడు అవార్డు: చెన్-నియెన్ కో (ది సైలెంట్ ఫారెస్ట్, తైవాన్ సినిమా)
- ఉత్తమ నటుడు అవార్డు: త్జు-చువాన్ లియు (ది సైలెంట్ ఫారెస్ట్)
- ఉత్తమ నటి అవార్డు: జోఫియా స్టాఫీజ్ (ఐ నెవర్ క్రై, పోలిష్ సినిమా)
- ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: కాసియో పెరీరా డాస్ శాంటోస్ (వాలెంటినా)
- సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డు: ఫిబ్రవరి (కామెన్ కలేవ్)
- ప్రత్యేక ప్రస్తావన: కృపాల్ కలిత (బ్రిడ్జ్)
ప్రత్యేక అవార్డులు
మార్చు- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు - విట్టోరియో స్టోరారో[10]
- గాంధీ మెడల్: 200 మీటర్లు (అమీన్ నయ్ఫెచే)
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - బిస్వజిత్ ఛటర్జీ[11][12]
అధికారిక ఎంపికలు
మార్చు51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక ఎంపికలు:[10][13][14]
ప్రారంభ సినిమా
మార్చు- అనదర్ రౌండ్ (దర్శకుడు: థామస్ వింటర్‌బర్గ్, డెన్మార్క్, ఇది 2020లో ఆస్కార్‌కి డెన్మార్క్ అధికారిక ప్రవేశం పొందింది.[15]
మధ్య సినిమా
మార్చు- మెహ్రునిసా (దర్శకుడు: సందీప్ కుమార్, ఆస్ట్రియా)
ముగింపు సినిమా
మార్చు- వైఫ్ ఆఫ్ ఎ స్పై (దర్శకత్వం: కియోషి కురోసావా, జపాన్). 77వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ లయన్‌ను గెలుచుకుంది.[10]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Swati Mathur (15 January 2021). "First hybrid edition of IFFI to go live from January 16; of 224 films, nearly 50 to be available online". Times of India. Retrieved 2023-05-25.
- ↑ "Film Guide - 51st IFFI". IFFI. Retrieved 16 January 2021.
- ↑ Tushar Jadhav (15 January 2021). "51st International Film Festival of India to begin from Jan 16". News on Air: All India Radio. Archived from the original on 2021-01-28. Retrieved 2023-05-25.
- ↑ Tushar Jadhav (11 January 2021). "Bangladesh to be country of focus at 51st International Film Festival of India". DD News: GOI. Retrieved 2023-05-25.
- ↑ "51st edition of IFFI set to start in a hybrid mode for the first time: Opening Ceremony tomorrow". PIB GOI. 15 January 2020. Retrieved 2023-05-25 – via Press release.
- ↑ "Dhritiman Chatterjee inaugurates special segment on celebrating 100 years of Satyajit Ray at 51st IFFI".
- ↑ "Film fest to pay tribute to Netaji on Jan 23 - Times of India". The Times of India.
- ↑ "Danish film 'Into the Darkness' wins Golden Peacock award at IFFI". WION. 24 January 2021. Retrieved 2023-05-25.
- ↑ "51st International Film Festival of India: Winners list". Indian Express. 24 January 2021. Retrieved 2023-05-25.
- ↑ 10.0 10.1 10.2 Shekhar, Mimansa (16 January 2021). "IFFI 2021: Everything to know about the film festival". Indian Express.
- ↑ "Biswajit Chatterjee has been conferred Indian Personality of the Year Award at 51st IFFI". Times of India. 16 January 2021. Retrieved 2023-05-25.
- ↑ "Veteran actor Biswajit Chatterjee crowned as Indian Personality of Year at IFFI 51 Closing Ceremony".
- ↑ "IFFI 2020: Regional films dominate Indian Panorama line-up". Deccan Herald. 20 December 2020 – via PTI.
- ↑ "Indian Panorama announces official selection for 51st International Film Festival of India, 2020". PIB GOI. 19 December 2020 – via Press release.
- ↑ "51st International Film Festival of India in Goa from Jan 16, to open with Vinterberg's 'Another Round'". Business World. 2 January 2021 – via ANI.