53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఆంగ్లం: 53rd International Film Festival of India) అనేది 2022 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరగబోయే చలనచిత్రోత్సవం. ఇందులో హదినెలెంటు (Hadinelentu) ప్రారంభ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా, ది షో మస్ట్ గో ఆన్ (The Show Must Go On) ఇండియన్ నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా ప్రారంభమవుతుంది.[1][2][3]
ఐ.ఎఫ్.ఎఫ్.ఐ - 2022 వార్షిక చలన చిత్రోత్సవంలో 79 దేశాల నుంచి 280 సినిమాలు ప్రదర్శించనున్నారు. భారతదేశానికి చెందిన 25 ఫీచర్ ఫిల్మ్ లతో పాటు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్ లను ఇండియన్ పనోరమలో ప్రదర్శిస్తారు. కాగా, 183 చలన చిత్రాలు అంతర్జాతీయ ప్రోగ్రామింగ్‌లో భాగంగా సిద్ధంగా ఉన్నాయి.
ఈ చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో శంకరాభరణం (1980) మూవీని ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు.[4]
జ్యూరీ
మార్చుఫీచర్ ఫిల్మ్‌లు
మార్చుభారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2022లో పన్నెండు మంది సభ్యులతో కూడిన ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రఖ్యాత దర్శకుడు, ఎడిటర్, చైర్‌పర్సన్ వినోద్ గణత్ర నేతృత్వం వహించారు. విభిన్నమైన భారతీయ సోదరభావాన్ని సమష్టిగా సూచిస్తూ, వివిధ ప్రశంసలు పొందిన చలనచిత్రాలు, చలనచిత్ర సంబంధిత వృత్తులకు వ్యక్తిగతంగా ప్రాతినిధ్యం వహించే కింది సభ్యులతో ఫీచర్ జ్యూరీ ఏర్పాటు చేయబడింది:[1]
- ఎ. కార్తీక్ రాజా - సినిమాటోగ్రాఫర్
- ఆనంద జ్యోతి - సంగీతకారుడు, రచయిత, చిత్రనిర్మాత
- డా. అనురాధ సింగ్ - ఫిల్మ్ మేకర్, ఎడిటర్
- అశోక్ కశ్యప్ - నిర్మాత, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్
- ఎనుముల ప్రేమరాజ్ - దర్శకుడు, స్క్రీన్ రైటర్
- గీతా ఎం గురప్ప - సౌండ్ ఇంజనీర్
- ఇమో సింగ్ - నిర్మాత, దర్శకుడు, రచయిత
- జుగల్ డిబాట - నిర్మాత, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్
- శైలేష్ దవే - నిర్మాత
- శిబు జి సుశీలన్ - నిర్మాత
- వి. ఎన్. ఆదిత్య - నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్
- విష్ణు శర్మ - రచయిత, సినీ విమర్శకుడు
పురష్కార గ్రహితలు
మార్చు53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది.[5] కాగా
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ప్రత్యేక జ్యూరీ అవార్డు, జీవితకాల సాఫల్య పురష్కారాలు ప్రకటించాల్సి ఉంది.
ఈ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "53RD IFFI 2022 official". Retrieved 22 October 2022.
- ↑ "IFFI 2022 Indian Panorama line-up includes Jai Bhim, RRR, The Kashmir Files". 22 October 2022.
- ↑ "S.S. Rajamouli's RRR, Dev-starrer Tonic to be screened at 53rd International Film Festival of India". www.telegraphindia.com.
- ↑ "sankarabharanam: శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం". web.archive.org. 2022-11-21. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం". web.archive.org. 2022-11-21. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chiranjeevi: అప్పుడు చాలా బాధపడ్డా.. కానీ ఇప్పుడు: చిరంజీవి". web.archive.org. 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)