సెల్ సైట్
సెల్ సైట్ అనగా సెల్యులార్ టెలీఫోన్ల యొక్క యాంటీనాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ పరికరాలు వుంచు ప్రదేశము,సాధారణంగా ఎత్తు ప్రదేశాలలో లేదా టవర్ల పైన అమర్చిపడి వుంటాయి. సెల్ సైట్ అనే పదాన్ని కొంతమంది తప్పుగా సెల్ టవర్ అంటారు, కానీ చాలా వరకు యాంటీనాలు టవర్ల మీద కన్నా ఎత్తైన భవనాలు పైన అమర్చబడి వుంటాయి.[1]
ఆపరేషన్
మార్చు- రేంజ్
సెల్ సైట్ పని చేసే రేంజ్ (మొబైల్ పరికరాలు నమ్మకంగా అందుబాటులో పనిచేయగల రేంజ్) అనేది చాలా వాటి మీద ఆధార పడి వుంటుంది, ముఖ్యంగా-
- యాంటీనా యొక్క పొడుగు.
- ఉపయోగించే సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ.
- కొన్ని టెక్నోలోజీలలో సమయానుకుల హద్దులు మీద కూడా ఆధార పది వుంటుంది, ఉదాహరణకు- జిఎస్ ఏం 30 km వరకు మాత్రమే ఉపయోగపడుతుంది,కొన్ని కొత్త పరికరాలుతో 70 km వరకు సాధ్యం అవుతుంది
- ట్రాన్స్మిటర్ పనిచేయగల శక్తి .
- చందాదారుల పరికరం యొక్క అవసరమైన అప్లింక్ / డౌన్ లింక్ డేటా రేటు .[2]
- సైట్ యాంటెన్నా శ్రేణి దిశాత్మక లక్షణాలు.
- భవనాలు లేదా వృక్షాలు ప్రతిబింబించే రేడియో శక్తి.
- ఇది స్థానిక భౌగోళిక లేదా నియంత్రణ కారణాలు, వాతావరణ పరిస్థితులు ద్వారా పరిమితమై ఉండవచ్చు.
సాధారణంగా, ఒక విస్తృత ప్రాంతం కవర్ చేయడానికి తగినంత సెల్ సైట్లు ఉన్నా ప్రాంతాల్లో, వాటన్నిటికీ ఈ విధంగా పరిధి అమర్చబడుతుంది- "హ్యాండోవర్" కోసం ఇతర సైట్ల నుండి తగినంత సారూప్యత వుండేటట్టు, ఇతర సైట్లతో జోక్యం సమస్యలు తగ్గించడానికి రెండింటికి వున్న అనుకూల ప్రాంతాన్ని తక్కువుగా వుండేటట్టు పరిమితిస్తారు. సెల్ సైట్లు అత్యంత వినియోగదారులతో, అధిక జనాభా సాంద్రత ప్రాంతాల్లో అమర్చబడతాయి . ఒక సైట్ ద్వారా కలిగే సెల్ ఫోన్ ట్రాఫిక్ బేస్ స్టేషను యొక్క సామర్థ్యం మీద అదరపడి వుంటుంది, ఒక బేస్ స్టేషను ఒకేసారి నిర్వహించగల కాల్స్ లేదా డేటా ట్రాఫిక్ ఒక పరిమిత సంఖ్య వుంటుంది. సెల్ మాస్ట్ సైట్లు అమర్చబడగల ప్రాంతం కూడా ఈ పరిమితి మీద ఆధారపడి వుంటుంది . పట్టణ ప్రాంతాలలో ఈ మాస్ట్ సైట్లు 2 km-3 km దూరంలో అమర్చబడి వుంటాయి . కానీ దట్టమైన నగర ప్రాంతాలలో 400m-800 m దూరంలో వుంటాయి .[3][4]
ఛానల్ పునర్వినియోగం
మార్చుసెల్యులార్ నెట్వర్క్లు కొన్ని పరిమిత సంఖ్య గల రేడియో ఛానళ్లు ఉపయోగించి అనేక సంభాషణలు జరిగేటట్టు రూపొందించబడ్డాయి ఒక సెల్యులర్ సర్వీస్కు కొన్ని కచ్చితమైన రేడియొ ఛానళ్ళు అనుమతి ఇవ్వబడతాయి . కానీ ఉపయోగపడే ఫ్రీక్వెన్సీ స్పెక్టృమ్ పరిమితమై వుండటం వలన అవే చానల్లు వేరు వేరు ప్రదేశాలలో ఉపయోగించబడతాయి . దీన్నినే ఛానల్ పునర్వినియోగం అంటారు . కొన్ని సార్లు మాస్ట్ నుంచి దూరంగా వుండటం వలన లేదా సెల్ ఫోన్ సిగ్నల్స్ కొండల వలన,ఎత్తైన బావనాల వలన అందకపోతే సెల్ ఫోన్ పనిచేయకపోవొచ్చు.అనేక మంది ఒకే సమయంలో సెల్ మాస్ట్ ఉపయోగించడానికి ప్రయత్నిచినప్పుడు, ఉదా: ఒక ట్రాఫిక్ జామ్ లేదా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ సమయంలో, అప్పుడు ఫోను ప్రదర్శనపై ఒక సిగ్నల్ ఉంటుంది కానీ అది ఒక కొత్త కనెక్షన్ ప్రారంబించడానికి అనుమతి ఇవ్వదు. సాధారణంగా చాలా సెల్ ఫోన్లు తక్కువ బ్యాటరీ వున్నపుడు తగినంత సిగ్నల్ మాస్ట్కు అందించలేవు . బేస్ స్టేషను కంట్రోల్లర్ (ఫోన్ కనెక్షన్లు నియంతరణ చేయగల ఒక కేంద్ర కంప్యూటర్), సెల్ఫోన్ను యొక్క తెలివి,సిగ్నల్స్ గమణించి, ఫోన్ సంభాషణ సమయంలో ఒక మాస్ట్ నుండి తర్వాతి మాస్ట్కు మారడానికి అనుమతిస్తుంది. ఏ మాస్ట్ నుండి సిగ్నల్ శక్తి ఎక్కువుగా వుందో దానికి సెల్ ఫోన్ అందుబాటులో వుంచబడుతుంది, వేరే మాస్ట్ ను వేరొక వినియోగదారులుకు అందుబాటులో వుంచుతుంది .
భౌగోళిక స్థానం
మార్చుసెల్యులార్ భౌగోళిక స్థానం "జిపిఎస్" ద్వారా కంటే తక్కువ కచ్చితమైనది, కానీ "జిపిఎస్" గ్రాహకాలు లేనిచోట, "జిపిఎస్" అందుబాటులో లేనిచోట పరికరాలుకు అందుబాటులో ఉంటుంది .ఆధునిక ఫార్వర్డ్ లింక్ పద్ధతులు అవకాశమున్నచోట కచ్చితత్వము అత్యధికంగా వుంటుంది . ఒకే సెల్ సైట్ చేరుకోగల చోట అత్యల్ప కచ్చితత్వము వుంటుంది . యునైటెడ్ స్టేట్స్ లో 31 డిసెంబర్ 2005 న,అత్యవసర కాలింగ్ కోసం కనీసం 95% ఉపయోగంలో ఉన్న సెల్యులార్ ఫోన్లు, ప్రదేశం యొక్క డేటా ఉపయోగించి (స్థానికంగా పిలవబడే "ఎన్హన్స్డ్ 911 ") అత్యవసర కాలింగ్ కోసం ఉపయోగించబడతాయి .
సెల్ సైట్ల యొక్క రకములు
మార్చు- తాత్కాలిక సైట్లు
సాధారణంగా సెల్ యాంటెనాలు శాశ్వత నిర్మాణాలుకు జత ఉన్నప్పటికీ,తాత్కాలిక సేవలందించేందుకు సెల్స ఆన్ వీల్స్ (COWs) అనే వాహనాల నౌకాదళాలు తాత్కాలిక సెల్ యాంటెనాలు ఉపయోగంలో ఉన్నాయి .నెట్వర్క్ విద్యుత్ శక్తి అందుబాటులో లేనిచోట జనరేటర్ ఉపయోగించబడుతుంది, వైర్డు లింక్ అందుబాటులో లేనిచోట వైర్ లెస్స్ బాకప్ లింక్ ఉపయోగించబడుతుంది . COWs అనేవి శాశ్వత సెల్ సైట్ల లాగా కూడా ఉపయోగిస్తారు - శాశ్వత సెల్ సైట్ యొక్క పరికరాలు పాడాయనప్పుడు తాత్కాలికంగా వీటిని వాడుతారు .
- స్పై ఏజెన్సీ సెటప్
dyeస్పీగల్ కు అందజేయబడిన పత్రాలు ప్రకారం, NSA 40,000$ విలువచేయగల "ఏక్టివ్ జిఎస్ఎం బేస్ స్టేషను" ఒక మొబైల్ ఫోన్ టవర్ అనుకరించేందుకు ఒక సాధనంగా ఉపయోగించి సెల్ ఫోన్లు మానిటర్ చేసేందుకు వినియోగిస్తారు .
- ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్
ఒక ఆఫ్ గ్రిడ్ సెల్ సైట్ ప్రభుత్వ విద్యుత్తు అనుసంధానించి ఉండదు .సాధారణంగా కష్టసాధ్యమై ఉన్న యాక్సెస్ లేదా అవస్థాపన లేకపోవడం ఇది ఆఫ్ -గ్రిడ్ స్టేట్ లో ఉంటుంది .ఇలాంటి క్లిష్టమైన సైట్లుకు అత్యవసర సమయాలలో శక్తి అందించడానికి ఇంధన సెల్ లేదా ఇతర బ్యాకప్ పవర్ విధానాలతో సైట్లు జోడించబడ్డాయి. చాలా వరుకు సెల్ సైట్లు ఇంటర్నల్ -కంబసన్ -ఇంజిన్ ద్వారా నడపబడే జెనరేటర్లతో పనిచేస్తాయి . కానీ ఇది సాధారణంగా అందుబాటులో ఉన్న పవర్ కన్నా తక్కువ సమర్ద్యం గలది . ఆపరేటింగ్ కరీదు పెంచడానికి, కాలుష్యనికి ఇది ఒక మూలం.
సెల్ సైట్లు ఉన్న చోట సౌర శక్తి, వాయు విద్యుత్ వంటి తరగని శక్తి, అందుబాటులో ఉంటుంది.ఈ శక్తి సరిపోనప్పుడు వేరొక శక్తి ఆధారము కోసం ఒక ఇందన -జనరేటర్ తో బేకప్ చేయబడి ఉంటుంది.అలాంటి ఒక శక్తి ఉత్పత్తి వ్యవస్థ వీటిని కలిగి ఉంటుంది:
- సౌర- శక్తి జనరేటర్
- వాయు -శక్తి జనరేటర్
- విద్యుత్- రసాయన జెనరేటర్ ఇంధన సెల్స్ .
- కమౌఫ్లెగ్
భద్రత, ప్రదర్శన యొక్క కారణాల వల్ల కొత్త స్తంభాల నిర్మాణానికి స్థానిక ప్రతిపక్షం ఒక పెద్ద కారణం . ప్రదర్శన కారణం మాస్ట్ను, ఒక జెండా పోల్ లేదా ఒక చెట్టు లాగా అగ్రిగేట్ చేసి పరిష్కారించవచ్చు . ఇలాంటి సెల్ సైట్లు వాటి ఆకులు ఆకారం, బెరడు రకం చూసి గుర్తించవచ్చు .ఇలాంటి యాంటెనాల యొక్క ఆకులు అచ్చం చెట్ల యొక్క ఆకులు లాగా ఉండేటట్టు ప్లాస్టిక్ తో తయారీ చేయబడతాయి . ఈ మెటీరియల్ రేడియో విద్యుత్ పారదర్శకత, UVA కిరణాలు నిరోధాన్ని పటిస్తుంది . తాటి చెట్టు లాగా అగ్రిగేట్ చేయబడ్డ మోనో పోల్ను మోనోపాల్మ్ అని, పైన్ చెట్టు లాగా అగ్రిగేట్ చేయబడ్డ మస్ట్ ను సూడో పైనస్ టెలిఫోనీయేనిసిస్ అని పిలుస్తారు. మోనో పోల్స్ లో యాంటెనాను పోల్ పైన ఒక ప్లాస్టిక్ బాక్స్ వంటి దానిలో దాచి ఉంచబడుతుంది . 6m నుండి 12m ఎత్తులో ఉన్న పొగ గొట్టాలు లేదా పలకలు వంటి రూఫ్ టాప్ నిర్మలాలలో ఒకే స్టేషను మీద వేరు వేరు ఆపరేటర్లు సెల్ సైట్లు అమర్చిబడి ఉంటాయి . సెల్ సైట్లు నిర్మాణానికి ప్రస్తుతం చాలా ఆధునిక పద్ధతులు ఉన్నాయి,అంతేకాకుండా ఈ సెల్ సైట్లు మనం రోజూ ఉపయోగించే సెల్ ఫోన్లతో అనుసందానంగా ఉండటానికి చాలా ఆధునిక సాంకేతిక విజ్ఞానం అవసరం .
మూలాలు
మార్చు- ↑ Learn about what is on a cell tower: Without the Cat Archived 2020-06-24 at the Wayback Machine undated, URL retrieved 9 December 2010.
- ↑ J. Andrews, A. Gohsh (2007). Fundamentals of WiMAX, p. 43
- ↑ Frequently Asked PCS Questionsundated, URL retrieved 14 August 2007. Archived 2006-05-09 at the Wayback Machine
- ↑ NTIA Seeks Input on Broadband Stimulus Moneyundated, URL retrieved 3 March 2009. Archived 2009-11-22 at the Wayback Machine
ఇతర లింకులు
మార్చు- Maps of All Towers Across the United States Archived 2012-10-14 at the Wayback Machine
- Maps of All Towers Across the United Kingdom
- Maps of All Towers Across Canada
- Searchable map of cell (and all other) towers in Australia
- FCC: Universal Licensing Information Archived 2014-03-28 at the Wayback Machine
- FCC: Information On Human Exposure To Radio frequency Fields From Cellular and PCS Radio Transmitters
- Australian Radiation Protection and Nuclear Safety Agency (ARPANSA) Base Station Survey 2007- 2011