సృజనాత్మక కవులు - పగటి కలలు

(Creative Writers and Daydreaming నుండి దారిమార్పు చెందింది)


సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ శాస్త్ర పితామహుడిగా తన పరిశోధన జీవితంలో ఎక్కువ కాలాన్ని మనిషి అతని కలల విశ్లేషణకు కేటాయించారు . అయన సిద్దాంతాలు చాల వరకు వివాదాస్పదం అయినప్పటికీ, మానసిక స్థితిని అర్థం చేసుకొనుటకు ఇవి అద్భుతమైన ప్రమాణాలుగా ఉన్నవి .1908 వ సంవత్సరంలో ఈయన సృజనాత్మక కవుల స్ఫూర్తిని తమ పగటి కలలకు అలానే పిల్ల వాడి చేష్టలకు అనుసంధానపరుస్తూ "సృజనాత్మక కవులు - పగటి కలలు" అనే వ్యాసాన్ని రాసారు

మన వంటి సమాన్యులకు ఎప్పుడు ఒక విషయం తెలుసుకొవడానికి ఎంతో ఆతృత ఉంతుంది. ఒక మతాధిపతి ఆరిఒస్టొ వంటి శృజనాత్మక కవిని (భావకవి) ఇలాంటి ప్రశ్నే ఆడిగాడు - ఏక్కడ నుంచి ఇంత విచిత్రమైన, శృజనాత్మకమైన కథను - అదీ ఎలాంటిది ఎంటే, మనిషి ఊహల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుంది అంటె, మన నిజ జీవితంలో ఆసంభవమయినది కూడా సంభవం అవుతుంది, మనకు తెలియని ఊహాతీతమయిన భావాలని మన హృదయంలో ముద్రిస్తుంది రాయగలుగుతున్నారు. భహుశ దీనికు అతని దగ్గర కూడా సరియైన సమధానము లెదనుకుంతాను. ఒక వెళ ఉన్నా, అది మన తెలివికి ఆ కథను అంత ఊహాత్మకంగా చిత్రీకరించగలమా అని సమాధాన పర్చలేదు. భహుశ మనం లెదా మనలాంటి వాళ్ళకోసం ఒక అభ్యాసం, ఈ భావకవుల ఊహలకి ఎలా కథరూపం ఇస్తారో తెలిసేలా ఉంటే బాగుంటుంది. కనీసం అప్పుడైన మనం వీళ్ళ రచనలను అర్థం చేసుకుంటామనుకుంటాను. వళ్ళుకూడా వళ్ళకి, సామన్య మానవులకి మధ్యగల దూరాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తూ వాళ్ళు చెప్పెది కూడా - ప్రతి మనిషి హృదయంలో ఒక కవి ఉన్నాడు, మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఆ కవి అనె వాడు చనిపోడు. మొదట ఈ భావుకత అనేది మన బాల్యంలోనే కనిపిస్తుంది. ఫ్రతి పిల్లవాడి అతిప్రియమైన వ్యాపకం అతని ఆటలు. ప్రతి పిల్లవాడు తన ఆటల్లో మనకి ఒక భావకవిలా కనిపిస్తాడు. తను ఆడే ఆటల్లో తనదైన ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. తనకి నచ్చిన విధంగా దానిలో పాత్రలను కొత్త తరహాలో సృష్టిస్తాడు. మనం దాని తెలికగా తీసిపారెస్తాము. కని దీనికి విరుధంగా అతడు తన ఆటని ఎంతో ఏకగ్రతతొ హృదయపూర్వకంగ అతని లోని గొప్ప ఊహలని అందులో చూపిస్తాడు. తన ఆటలో ప్రతి వస్తువుని నిజ జీవితంలో ఉన్న వస్తువులకు ముడిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఫిల్లవాడి ఆటకి నిజ జీవితానికి ఇదె తెడ. ఒక భావకవికూడా పిల్లవాడి ఆటలగే తనది అయిన ఊహాజనిత ప్రపంచాన్ని స్రుష్టిస్తరు. భావకవి కూడా తన శృజనాత్మక కథను ఎంతో ప్రధాన్యత ఇస్తాడు. దానిలో ఏన్నో భావాలను నింపుతూ వాస్తవానికి ఊహకి తేడాను చూపిస్తాడు. తన భాష ద్వారా పిల్లల ఆటకి ఒక భావ కవిత్వానికి సంబంథం సృష్టిస్తడు. కవి రాసిన హాస్యరచనలుగాని విషాద రచనలు గాని చదువుతున్నప్పుడు కలిగే భావనలు నిజ జీవితంలో అటువంతి భావాలు రేకెత్తించకిపోవచ్చు కాని అదే పిల్లవడికి ఎంతో సంతొషాన్ని ఉత్సాహాన్ని ఇస్తయి. నిజానికి ఆటకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికి ఇంకొక కారణం కూడా ఉంది . పిల్లవాడు పెద్దవాడై ఆటలు ఆడటం మానేసి బ్రతుకు తెరువు కోసం ఏళ్ళ తరబడి కష్టపడతున్నప్పుడు తన ఆటలకి నిజ జీవితానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకొంటాడు . పెద్దవాడైన తరువాత తన చిన్న నాటి ఆటలను ఎంత ఏకాగ్రతతో ఆదేవాడో గుర్తు తెచుకుని నేటి తన క్లిష్టమైన పరిస్థితులను హృదయ భారాన్ని ఆ ప్రియమైన జ్ఞాపకాలతో మరచిపోగలడు.

మనిషి పెద్దవాడు అవ్తున్నా కొద్దీ తన ఆటల వల్ల కలిగే ఆనందానికి దూరం అవుతుంటాడు . కాని మనకు తెలిసిన విషయం ఏమనగా మనకి ఆహ్లాదాన్ని ఇచ్చేదాన్ని వదులుకోవటం చాల కష్టమైనా పని అని . నిజానికి మనము ఏది వదులుకోము . ఒక దాన్ని బదులు ఇంకొకటిగా రూపాంతరం చేస్తాము . కొత్తది పొందాము అని అనుకుంటాం కానీ అది పాత దాని యొక్క రూపాంతరమే అని గ్రహించము.పిల్ల వయసు నుంచి ఎదుగుతున్న క్రమంలో మెల్లగా ఆటలు ఆడడం తగ్గించి నిజమైన వస్తువుల మీద దృష్టి సారింపు మొదలవతుంది.ఆటలు ఆడటం బదులు ఆ పిల్లవాడు ఊహించటం మొదలు పెడతాడు .గాలిలో మేడలు కట్టి పగటి కలలు కంటాడు . మనలో చాల మంది ఇలా చేసి ఉంటాము . కాని ఈ రుపాన్థరనికి మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వము.

పెద్దవారి ఊహలు పిల్లల ఆటలంత తేలికగా కనిపెట్టటం కష్టం.

పిల్ల వాడు తనతో తాను ఆడుకుంటాడు లేదంటే తన తోటి పిల్లలు, తన ఆలోచనలకూ సరిపడే పిల్లల తోటి ఆడతారు . పెద్ద వాళ్ళ ముందు ఆడుటకు కొంత భయపడినా తన ఆటలను వాళ్ళ ముందు దాచిపెట్టడు. దీనికి విరుద్దంగా పెద్దవాళ్ళు తమ ఊహల గూర్చి తనే సిగ్గు పడుతూ వాటిని వేరే వారి ముందు దాచుటకు ప్రయత్నిస్తారు . తమ ఊహలు తమకు ఎంతో ప్రియమైనవిగా భావిస్తారు . వాటిలో తప్పులకు పశ్చాత్తాప పడతారు కాని ఎవరికీ చెప్పారు. ఇటువంటి ఊహలు తమకు ఒక్కరికే వస్తాయని అనుకుంటారు . ఈ విధంగా ఆటలాడే మనుషులు, ఊహించుకొని బ్రతికే మనుషుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవచ్చు . పిల్లవాడి ఆటలు వాడి కోరికలకు అనుగుణంగా ఉంటాయి . వాడేప్పుడు పెద్దవాడు అవ్వాలని ఆరాట పడతాడు . వాడి చుట్టుపక్కల గమనించిన పెద్ద వాళ్ళ హావభావాలను, ప్రతి రోజు తారసపడే ఘట్టాలను తన ఆటలో పొందు పరుస్తాడు . ఈ తన కోరికను దాచడు.కాని పెద్దవారు నిజ జీవితంలో ఊహిస్తూ ఉండకూడదని తెలిసినా అటువంటి ఊహలకి తావిస్తునే ఉంటాడు పైగా వాటిని దాస్తు ఉంటాడు కూడా . తన ఊహలు చిన్న పిల్లల చేష్టలుగా భావించి బాగా లేవని తనలో తను సిగ్గు పడుతూ ఉంటాడు .

ఇక్కడ మీరు ఒకటి అడగవచ్చు . ప్రతి మనిషి తన ఊహల గురించి దాస్తుంటే మనకు వాటి గురించి ఇంతలా ఎలా తెలుస్తుంది అని . మనుషుల్లో కొందరు మానసిక జబ్బులకు, ఒత్తిడికి లోనై వైద్యుడు వద్ద పరిష్కార మార్గాన్ని కనుగొనాలని వెళ్ళినపుడు వాళ్ళ ఊహల గురించి చెప్పడం జరుగుతుంది.

ఈ వింతైన ఊహల గురించి ఇంకా బాగా తెలుసుకుందాం . సంతోషంగా ఉన్న మనిషికి వింత కోరికలు, వింత ఆలోచనలు కలుగవు . అసంతృప్తితో ఉన్న మనిషికి అపరిపూర్ణమైన కోరికల వలన విచిత్రమైన, వింతైన ఊహలు పుడతాయి . కోరికలను తీర్చుకునే మార్గం లోనే ఈ ఊహలు మొదలవతాయి . ఈ కోరికలు మనిషి పరిస్థితులు, నడవడిక, జాతి పై ఆధారపడి ఉంటుంది . వీటిని స్థూలంగా రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు .మొదటివి మనిషి యొక్క స్థాయిని పెంచే ఆశలతో కూడుకున్నవి . రెండవవి మనిషికి ఉత్తేజ ప్రేరణ కలిగించేవి .

వయసులో ఉన్న ఆడవారికి ఉత్తేజ పూర్వితమైన ఊహలు వారి ఆశని కప్పి పుచ్చుతాయి . అయితే వయసులో ఉన్న మగవారిలో ఉత్తేజ పూరితమైన వాటితో పాటు ఆశాపరమైన అహంతో కూడిన కోరికలు కూడా కలుగుతాయి . కాని ప్రతి ఆశా ప్రేరితమైన ఊహల్లో ఏదో ఒక మూల ఒక స్త్రీ కనిపిస్తుంది అది ఎవరికోసమైతే ఇంతటి పరాక్రమావంతమైన పనులు ఊహించుకున్నాడో ఆ స్త్రీ కూడా కావచ్చు .ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన స్త్రీ కొద్ది పాటి ఉత్తేజ పరిచే కోరికలను మాత్రమే ఊహించగలదు. అలాగే మగవారు కూడా.

ఊహలకి కలలకి మధ్య ఉన్న సంబంధాలని విస్మరించలేము . మనము రాత్రి పూట కనే కలలు మనము ఊహించుకునే ఊహలే.అందుకనే ఊహలను మన భాషలో పగటి కలలు అని అన్నారు . మన కలలు కప్పి ఉంచడానికి కారణం అవి కూడా మనం సిగ్గు పడే విధంగా ఉండటమే . ఇలా అణిచివేయబడిన కోరికలు బయటకి వ్యక్తపరిచేటప్పుడు చాల అస్తవ్యస్తంగా ఉంటాయి. శాస్త్ర వేతలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు . అంటే కలలకి మన కోరికలకి సంబంధం ఉంది .

ఊహల గురించి ఎంతో చెపుకున్నమ్ ఇక మన భావ కవుల గురించి ప్రస్తావిద్దాము . కవిని అతని ఊహలని విడదీసి చూడాలి . కొంత మంది కవులు జరిగిన దాన్ని గురించి రాస్తారు . మరికొందరు వాళ్ళ సొంత ఊహల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు . మనం మొదటి వారి గురించి చర్చిద్దాం . వారి దాంట్లో, ఒక కథానాయకుడు ఉంటాడు . అతని మీద జాలి కలిగేలా పరిస్థుతలను సృష్టిస్తాడు ఈ కవి . ఒక చోట అతనికి రక్తం కారుతూ బాధపడుతున్నట్లుగా చూపించి ఇంకో చోట అతను కోలుకునేలా చేస్తాడు . ఒక చోట అతని పడవ సముద్రంలో పెను తుఫానులో చిక్కుకున్నట్టుగా చూపించి దానికి కొనసాగింపుగా అనూహ్యంగా దాని నుంచి సురక్షితంగా బయట పడినట్టు చూపిస్తాడు . ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం లాంటి వీరోచిత కృత్యాలను కూడా ఆ కథానాయకుడితో చేయిస్తాడు . ఒక్క మాటలో చెప్పాలంటే కథానాయకుడు అమరత్వం అతని పాత్ర చిత్రీ కరణ ద్వారా ఆ కవి తన యొక్క అహం, ఊహలు తెలియపరుస్తాడు .