ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యతా పరీక్ష

(GATE నుండి దారిమార్పు చెందింది)

ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గేట్ - ఇంగ్లీషు - Graduate Aptitude Test in Engineering (GATE) or GATE) అనేది, శాస్త్ర సాంకేతిక రంగ విశ్వవిద్యాలయాల్లోని, కళాశాల్లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయుటకు రాయవలసిన యోగ్యతా పరీక్ష. దీని నిర్వహణ ఉన్నతవిద్యా విభాగం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తరఫున ఏడు భారతీయ ప్రౌద్యోగిక సంస్థానాలు (ఐఐటీ) , భారతీయ విజ్ఞాన సంస్థానం (ఐఐఎస్సీ) పర్యవేక్షిస్తాయి.

మెకానికల్ ఇంజినీర్ పరీక్షా మార్క్స్ షీట్

పరీక్ష

మార్చు

ఈ పరీక్షలో 3 గంటల వ్యవధిలో, 65 ప్రశ్నలకి జవాబులు రాయవలసి ఉంటుంది. గరిష్ఠ మార్కులు 100. పరీక్ష పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిండి ఉంటుంది. 65 ప్రశ్నలలో 55 ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న శాఖ లేదా స్పెషలైజేషన్ కి చెందినవి, మిగిలిన 10 ప్రశ్నలు సాధారణ యోగ్యతకీ చెందినవిగా ఉంటాయి. అక్ద్ఫషస్జ్గ్స్కస్క్ధ్గహ్హ్

అర్హత

మార్చు

ఈ పరీక్షకు హాజరుకావడానికి ఉండాల్సిన అర్హతలు

  • ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్ పట్టభద్రులు లేదా ఆయా కోర్సుల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు
  • సైన్సు/గణితం/గణాంకాలు/ కంప్యూటర్ అప్లికేషన్స్ తత్సమాన శాఖలలో మాస్టర్ డిగ్రీ చేసినవారు లేదా అఖరి ఏడాదిలోగానీ, అఖరి ఏడాదికి ముందు సంవత్సరంలోగానీ ఉన్నవారు
  • ఇంజనీరింగ్/టెక్నాలజీకి చెందిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ కోర్సులో రెండవ ఏడాది లేదా ఆపై సంవత్సరాలు చదివేవారు లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/ రెండు పట్టాల కోర్సులలో మూడవ సంవత్సరం లేదా ఆపైన సంవత్సరాలు చదివేవారు.
  • యూపీయస్సీ/ ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ సంస్థలు నిర్వహించే బి.ఈ/బి.టెక్ కి సమానమైన పరీక్షల ద్వారా అర్హత సాధించినవారు. సెక్షన్ ఎ లోని కోర్సు లేదా తత్సమాన కోర్సులు చేసినవారు కూడా అర్హులు

స్కోరు

మార్చు

హాజరైన ప్రతీ అభ్యర్థికీ పరీక్షలో అతని ప్రదర్శనని బట్టి భారతవ్యాప్త శ్రేణి (All India Rank) ఇవ్వబడుతుంది. వివిధ కళాశాలల్లో ఈ శ్రేణిని బట్టి ప్రవేశం ఇవ్వబడుతుంది. గేట్ స్కోరు ఈ క్రింది సూత్రం ద్వారా గణింపబడుతుంది.

 

  • m = అభ్యర్థి సాధించిన మార్కులు
  • a = అదే సంవత్సరం, అదే ప్రశ్నాపత్రానికి హాజరైనవారు సాధించిన మార్కుల సగటు
  • S = అదే సంవత్సరం, అదే ప్రశ్నాపత్రానికి హాజరైనవారు సాధించిన మార్కుల ప్రామాణిక విచలనం (standard deviation)
  • ag= మొత్తం అన్ని సంవత్సరాలు, ప్రశ్నాపత్రాలులో అభ్యర్హులు సాధించిన మార్కుల సగటు (global average)
  • sg= మొత్తం అన్ని సంవత్సరాలు, ప్రశ్నాపత్రాలులో అభ్యర్హులు సాధించిన మార్కుల ప్రామాణిక విచలనం ( global standard deviation)

గేట్ స్కోరు "0" కన్నా తక్కువ వస్తే "0"గానూ, 1000 కన్నా ఎక్కువ వస్తే 1000గానూ ఉంచబడుతుంది. ఈ స్కోరు 2 సంవత్సరాలవరకూ పనికివస్తుంది.

అర్హతా స్కోరు: గేట్ పరీక్షలో అర్హత సాధించాలంటే ఒక కనీస స్కోరుని దాటవలసిన ఉంటుంది. ఈ అర్హతా స్కోరు శాఖశాఖకీ, వర్గం వర్గానికీ వేర్వేరుగా ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థికి 25 లేదా (a + s) లలో ఏది ఎక్కువ అయితే అది, అర్హతా స్కోరుగా ఉంటుంది.

పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కార్యక్రమ ప్రవేశం

మార్చు

ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ పట్టభద్రులు, సైన్స్/గణితం/గణాంకాలు/కంప్యూటర్ అప్లికేషన్స్ మాస్టర్ డిగ్రీ పట్టభద్రులు గేట్ పరీక్షలో అర్హత సాధించిన పిదప ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ లలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్/డాక్టరేట్ చేయడానికీ అలాగే సంబంధిత శాస్త్రాలలో డాక్టరేట్ చేయడానికీ అర్హత పొందుతారు. వీరికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖనుండిగానీ, వేరే ఇతరరూపంలోగానీ ప్రభుత్వం నుండి ఉపకారవేతనం లభిస్తుంది. అయితే ఈ ఉపకార వేతనం పొందడానికి ఏదేని కళాశాల/విశ్వవిద్యాలయం/సంస్థానం లో తత్సంబంధిత ప్రవేశపద్ధతి ద్వారా ప్రవేశం పొందవలసి ఉంటుంది. ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారు డాక్టరేట్‌లో చేయడానికి గేట్ పరీక్ష తప్పనిసరి కాదు.

కొన్ని కళాశాలు/సంస్థానాలు సొంతంగా చదువుకొనేవారికీ (ఉపకారవేతనం పొందకుండా) కూడా గేట్ లో అర్హత సాధించడాన్నే కొలమానంగా తీసుకుంటాయి. శాస్త్రీయ , పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు(CSIR) ప్రయోగశాలల్లోనూ, తత్సంబంధిత ప్రాజెక్టుల్లోనూ జూనియర్ రీసెర్చ్ ఫెల్లోగా చేరడానికి గేట్ అర్హతయే ప్రధానం. గేట్‌లో అత్యుత్తమ శ్రేణులు పొందినవారు శాస్త్రీయ , పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు(CSIR) వారి "శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఫెల్లోషిప్"కి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు శాస్త్రవేత్త/ ఇంజనీర్ కొలువులకి గేట్‌లో అర్హతనే కనీస అర్హతగా నిర్ణయిస్తాయి.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్‌యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సిటీ వంటి సింగపూర్ విశ్వవిద్యాలయాలు, జర్మనీలోని సాంకేతిక విద్యాలయాలు పోస్ట్‌గ్రాడ్యయేషన్/డాక్టరేట్ చేయబోవు విద్యార్థుల గేట్ అర్హతని కూడా గమనిస్తాయి.

ఇటీవలి మార్పులు

మార్చు

రాస్తున్న అభ్యర్థుల సంఖ్య

మార్చు

గేట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడదికీ పెరుగుతూ వస్తోంది. ఈ పోకడని క్రింది పట్టికలో చూడవచ్చు.

ఏడాది అభ్యర్థుల సంఖ్య
2012 1239395
2011 552530
2010 414093

2011 సంవత్సరంలో శాఖలవారీగా హాజరైన అభ్యర్థులు

ప్రశ్నపత్రం అభ్యర్థుల సంఖ్య
ఈసీఈ 137856
సీ.ఎస్.సీ 136027
మెకానికల్ 81175
బయోటెక్నాలజీ 16425

2010 సంవత్సరంలో శాఖలవారీగా హాజరైన అభ్యర్థులు

విభాగం/ కోర్సు / శాఖ హాజరైన అభ్యర్థులు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ & ఐ.టి 107086
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 104291
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 52246
మెకానికల్ ఇంజనీరింగ్ 59338
సివిల్ ఇంజనీరింగ్ 19406

ఉద్యోగావకాశాలు

మార్చు

ఇటీవలి సంవత్సరాలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఈ గేట్ పరీక్ష ద్వారా కొలువులనిస్తున్నాయి.

బయటి లంకెలు

మార్చు