లూపస్

ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి). శరీర రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన
(Lupus నుండి దారిమార్పు చెందింది)

లూపస్ ను సాంకేతికంగా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ ( SLE ) అని పిలుస్తారు, ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి). అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని అనేక భాగాలలో ఆరోగ్యకరమైన కణజాలంపై పొరపాటున దాడి చేస్తుంది. వ్యక్తులలో ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి.

లూపస్
ఇతర పేర్లుసిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్
యువతిలో లూపస్ వలన కనిపించే సీతాకోకచిలుక దద్దుర్లు
ప్రత్యేకతరుమాటాలజీ
లక్షణాలుకీళ్లలో బాధాకరమైన వాపు, జ్వరం, ఛాతీ నొప్పి, జుట్టు రాలడం, నోటి పూత, శోషరస కణుపుల వాపు, అలసటగా అనిపించడం, ముఖంపై ఎర్రటి దద్దుర్లు
సాధారణ ప్రారంభం15-45 సంవత్సరాల మధ్య
కాల వ్యవధిదీర్ఘ కాలం
కారణాలుకారణాలు తెలియరాలేదు. పర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు, రక్త పరీక్షలు
చికిత్ససరిపడినంత నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం
ఔషధంస్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్), హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్
రోగ నిరూపణసాధారణ జీవిత కాలం
తరుచుదనము80% కి 15 సంవత్సరాలు

లక్షణాలు

మార్చు

ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు - కీళ్లలో బాధాకరమైన వాపు , జ్వరం, ఛాతీ నొప్పి, జుట్టు రాలడం, నోటి పూత, శోషరస కణుపుల వాపు, అలసటగా అనిపించడం, ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఉంటాయి. ఈ అనారోగ్యం ఏర్పడే కొన్ని సమయాలు ఉంటాయి వాటిని ( ఫ్లేర్స్) మంటలు అని పిలుస్తారు. అయితే కొన్ని లక్షణాలు మాత్రమే ఉండి ఉపశమనం కలిగే సమయాలు (రెమిషన్) ఉంటాయి.[1]

కారణాలు

మార్చు

ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే కారణం స్పష్టంగా లేదు. [1] ఇది పర్యావరణ కారకాలతో పాటు జన్యు పరమైన అంశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. [2] ఏక రూపు కవలలలో, ఒకరు ప్రభావితమైతే, మరొకరికి కూడా 24% వచ్చే అవకాశం ఉంటుంది. [1] స్త్రీలింగ హార్మోన్లు, సూర్యకాంతి, ధూమపానం, విటమిన్ డి లోపం, కొన్ని సంక్రమణాలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయని భావిస్తారు. [2] దీంట్లో విషయమేమంటే (మెకానిజం) ఒక వ్యక్తి స్వంత కణజాలాలకు ఈ ఆటోఆంటిబాడీస్ రోగనిరోధక ప్రతిస్పందనను కలుగ చేస్తుంది. ఇవి సాధారణంగా యాంటీ-న్యూక్లియర్ యాంటీబాడీస్, అవి వాపుకు కారణమవుతాయి. [1]

రోగనిర్ధారణ

మార్చు

రోగ నిర్ధారణ కష్టం, అయితే లక్షణాలు ప్రయోగశాల పరీక్షల కలిపి రోగ నిర్ధారణ ఉంటుంది. లూపస్ ఎరిథెమాటోసస్ లో అనేక ఇతర రకాల ఉన్నాయి. [1] ఉదాహరణకి -

  • డిస్కోయిడ్ లూపస్ ఎరిథెమాటోసస్,
  • నియోనాటల్ లూపస్,
  • సబాక్యూట్ క్యుటేనియస్ లూపస్ ఎరిథెమాటోసస్

చికిత్స

మార్చు

వైద్యం లేదు. చికిత్సలలో స్టెరాయిడ్స్ కాని నొప్పి నివారణ మందులు (Nonsteroidal anti-inflammatory drug - NSAIDలు), కార్టికోస్టెరాయిడ్స్, రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్), హైడ్రాక్సీక్లోరోక్విన్, మెథోట్రెక్సేట్ ఉండవచ్చు.[1] కార్టికోస్టెరాయిడ్స్ తో చికిత్స వేగంగా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక వినియోగం దుష్ప్రభావాలకు దారితీస్తుంది.[3] ప్రత్యామ్నాయ ఔషధం వ్యాధిని ప్రభావితం చేయదని తెలుస్తోంది.[1] లూపస్ ఉన్నవారిలో ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. [4] ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది, అందుకని మరణాలకి సాధారణ కారణం.[2] ఆధునిక చికిత్సకు సానుకూలంగా ప్రభావితమైన వారిలో 80% మంది 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. [5] లూపస్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అయితే చాలా వరకు విజయవంతమవుతారు.[1]

వ్యాప్తి

మార్చు

లూపస్ రేటు దేశాన్ని అనుసరించి మారుతుంటుంది. 100,000కి 20 నుండి 70 వరకు ఉంటుంది.[6] ప్రసవం వయస్సులో ఉన్న స్త్రీలు, పురుషుల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతారు.[2] ఇది సాధారణంగా 15 - 45 సంవత్సరాల మధ్య ప్రారంభమైనప్పటికీ, ఏ వయసువారైనా ప్రభావితం కావచ్చు.[1] ఆఫ్రికన్, కరేబియన్, చైనీస్ జాతులకు చెందిన వారు శ్వేతజాతీయుల కంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. [2][6] అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధి రేట్లు అస్పష్టంగా ఉన్నాయి. [7] లూపస్ అంటే లాటిన్‌లో "తోడేలు": దద్దుర్లు తోడేలు కాటులా కనిపిస్తాయని భావించినందున ఈ వ్యాధికి 13వ శతాబ్దంలో పేరు పెట్టారు. [8]

ప్రస్తావనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Handout on Health: Systemic Lupus Erythematosus". www.niams.nih.gov. February 2015. Archived from the original on 17 June 2016. Retrieved 12 June 2016.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Lisnevskaia, L; Murphy, G; Isenberg, D (22 November 2014). "Systemic lupus erythematosus". Lancet. 384 (9957): 1878–88. CiteSeerX 10.1.1.1008.5428. doi:10.1016/s0140-6736(14)60128-8. PMID 24881804.
  3. Davis, Laurie S.; Reimold, Andreas M. (April 2017). "Research and therapeutics—traditional and emerging therapies in systemic lupus erythematosus". Rheumatology. 56 (suppl_1): i100–i113. doi:10.1093/rheumatology/kew417. PMC 5850311. PMID 28375452.
  4. Murphy, G; Isenberg, D (December 2013). "Effect of gender on clinical presentation in systemic lupus erythematosus". Rheumatology (Oxford, England). 52 (12): 2108–15. doi:10.1093/rheumatology/ket160. PMID 23641038.
  5. The Cleveland Clinic Intensive Review of Internal Medicine (5 ed.). Lippincott Williams & Wilkins. 2012. p. 969. ISBN 9781451153309. Archived from the original on 7 January 2020. Retrieved 13 June 2016.
  6. 6.0 6.1 Danchenko, N.; Satia, J.A.; Anthony, M.S. (2006). "Epidemiology of systemic lupus erythematosus: a comparison of worldwide disease burden". Lupus. 15 (5): 308–318. doi:10.1191/0961203306lu2305xx. PMID 16761508.
  7. Tiffin, N; Adeyemo, A; Okpechi, I (7 January 2013). "A diverse array of genetic factors contribute to the pathogenesis of systemic lupus erythematosus". Orphanet Journal of Rare Diseases. 8: 2. doi:10.1186/1750-1172-8-2. PMC 3551738. PMID 23289717.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  8. Chabner, Davi-Ellen (2013). The Language of Medicine. Elsevier Health Sciences. p. 610. ISBN 978-1455728466. Archived from the original on 2020-01-07. Retrieved 2020-08-04.
"https://te.wikipedia.org/w/index.php?title=లూపస్&oldid=4349098" నుండి వెలికితీశారు