నరహరి
(Narahari నుండి దారిమార్పు చెందింది)
నరహరి అనునది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రములలో క్షత్రియులు (రాజులు) యొక్క ఇంటిపేరు. వీరు ఆత్రేయస గోత్రమునకు చెందిన క్షత్రియ రాజులు. వీరు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా స్థిరపడి యున్నారు. వీరు క్షత్రియులలో మిగిలిన గోత్రాలైన కశ్యపస, వశిష్ట, భరద్వాజ గోత్రముల వారిని పెళ్ళి ఆడుదురు. వీరు హంపి విజయనగర రాజ్యమును యేలిన ఆరవీడు వంశమునకు చెందిన చంద్రవంశ క్షత్రియులు.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |