పంచానన్ మహేశ్వరి

భారతీయ వృక్ష శాస్త్రవేత్త
(Panchanan Maheshwari నుండి దారిమార్పు చెందింది)

పంచానన్ మహేశ్వరి (1904 నవంబరు 9 - 1966 మే 18) ప్రముఖ భారతీయ వృక్షశాస్త్రజ్ఞుడు, రాయల్ సొసైటీ సభ్యుడు. అంజిస్పెర్మస్ ను టెస్ట్ ట్యూబ్‌లో పెంచే సాంకేతికతను ఆవిష్కరించినందుకు గాను ఆయన ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఆవిష్కరణతో గతంలో పెంచడానికి సాధ్యపడని కాని కొన్ని సంకర జాతి మొక్కలను కృత్రిమంగా పెంచగలిగారు.

పంచానన్ మహేశ్వరి
జననం(1904-11-09)1904 నవంబరు 9
జైపూర్
మరణం1966 మే 18(1966-05-18) (వయసు 61)
రంగములువృక్షశాస్త్రం
చదువుకున్న సంస్థలుఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్
ముఖ్యమైన పురస్కారాలుఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (1965)[1]

చదువు

మార్చు

పంచానన్ జైపూరులో జన్మించాడు. అలహాబాదులోని ఎవింగ్ క్రిస్టియన్ కళాశాలలో చదివాడు. వైద్య విద్య చదవాలనేది అతడి ఆశయం.[1] ఎవింగ్‌లో ఉండగా విన్‌ఫీల్డ్ డడ్జన్ సలహా మేరకు తన లక్ష్యాన్ని సైన్సువైపు మళ్ళించాడు.[1] డడ్జన్ ప్రభావంతోనే ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (1925), మాస్టర్ ఆఫ్ సైన్స్ (1931), డాక్టర్ ఆఫ్ సైన్స్ (1931) డిగ్రీలు పొందాడు.

పురస్కారాలు, గౌరవాలు

మార్చు

1934 లో పంచానన్ మహేశ్వరి బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర అకాడమీ గౌరవ సభ్యుడయ్యాడు. 1968 లో భారతీయ సైన్స్ కాంగ్రెస్ సంఘం బీర్బల్ సాహ్నీ మెడల్‌తో ఆయన్ను గౌరవించింది.[2] 1965 లో ఆయన రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికయ్యాడు. ఈ గౌరవం పొందిన భారతీయ వృక్షశాస్రవేత్తల్లో ఆయన రెండోవాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Steward, F. C. (1967). "Panchanan Maheshwari 1904-1966". Biographical Memoirs of Fellows of the Royal Society. 13: 256–226. doi:10.1098/rsbm.1967.0013.
  2. "BIRBAL SAHNI MEDAL". Archived from the original on 2013-10-21. Retrieved 2017-01-03.